Priya Ramani acquitted in MJ Akbar defamation case ఢిల్లీ కోర్టులో మాజీ మంత్రికి ఎదరుదెబ్బ

Journalist priya ramani acquitted in defamation case filed by mj akbar

MJ Akbar, molestation charges on MJ Akbar, MJ Akbar defamation case, Former Union minister, defamation case, Delhi High Court, MeToo Movement, Priya Ramani, Journalist, Crime

A Delhi court on Wednesday acquitted former journalist Priya Ramani in former Union minister MJ Akbar's defamation case against her for her allegations of sexual harassment and said a woman has right to voice her grievance even after several years.

పాత్రికేయుడి పరువునష్టం దావాను కోట్టివేత.. మాజీ మంత్రికి ఎదురుదెబ్బ

Posted: 02/17/2021 05:30 PM IST
Journalist priya ramani acquitted in defamation case filed by mj akbar

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మీటూ ఉద్యమం అటు ప్రపంచాన్ని కూడా కుదిపేసిందన్నడంలో సందేహమే లేదు. ఎలాగోలా ఈ ఉద్యమం కాసింత శాంతించిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి మరోమారు ఢిల్లీ కోర్టు కీలక తీర్పును వెలువరించింది. మీటూ బాధితులైన మహిళలు తాము ఎదుర్కోన్న ఘటనలపై ఎప్పుడైనా న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చునని తీర్పును వెలువరించారు. ఈ కేసులో బాధితులైన మహిళలు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను బహిర్గతం చేయడానికి కూడా సుముఖతను చూపరని న్యాయస్థానం అభిప్రాయపడింది.

ఈ కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం రామాయణ, మహభారత మతగ్రంధాల విషయాన్ని కూడా ప్రస్తావించింది. భారత్ కర్మభూమి అని, ఇక్కడ మహిళలను దేవతగా అరాధిస్తారని.. అయినా ఈ పవిత్రభూమిలోనూ మహిళలపై లైంగిక దాడులు జరగడం దురదృష్టకరమని న్యాయస్థానం అభిప్రాయపడింది. రామాయణం, మహాభారత ఇతిహాసాల్లో మహిళలను ఏ విధంగా గౌరవించారో స్పష్టంగా కనిపిస్తుందని, అయినా ఈ దేశంలోనూ మహిళలపై లైంగికంగా దాడులకు పాల్పడటం క్షమించరానినేరం’ అంటూ న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది.

కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్‌ తనపై లైంగిక వేదింపులకు పాల్పడ్డారంటూ జర్నలిస్ట్‌ ప్రియా రమణి చేసిన అరోపణలకు సంబంధించిన కేసులో న్యాయస్థానం ఈ మేరకు సంచలన తీర్పును వెలువరించింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసులో మాజీ కేంద్రమంత్రి ఎంజే అక్బర్ ప్రియా రమణిపై పరువు నష్టం దావా వేశారు. అమె తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, తన పరువుకు భంగంకలిగే విధంగా వ్యాఖ్యలు చేశారని కోర్టును ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘ విచారణ చేపట్టిన న్యాయస్థానం బుధవారం కీలక తీర్పునిచ్చింది.

బాధితురాలిపై ఎంజే అక్బర్‌ దాఖలు చేసిన పరువునష్టం దావా పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది. తనకు జరిగిన అన్యాయాన్ని బాధితురాలు ఎప్పుడైనా బయటకు చెప్పుకోవచ్చని స్పష్టం చేసింది. ఎంజే అక్బర్‌ వాదనలతో ఏకీభవించని న్యాయస్థానం.. ఆయన సెలబ్రిటీ ఇమేజ్ సహా కీర్తి ప్రతిష్టలు మహిళ విలువైన జీవితంతో తూకం వేయలేమని పేర్కోంది. ఆమె వ్యాఖ్యలతో పిటిషనర్ కు పరువు నష్టం జరిగిందని భావించేమని పేర్కొంది. ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు తెలిపింది. దీంతో ప్రియా రమణికి న్యాయస్థానంలో ఊరట లభించింది.

గత ఏడాది అక్టోబర్‌లో 20 ఏళ్ల క్రితం అక్బర్‌ తమని లైంగికంగా వేధించారని ఆయన మాజీ సహచర ఉద్యోగులు ప్రియా రమణి, ప్రేరణాసింగ్‌ బింద్రా, పేరు తెలియని మరో మహిళా జర్నలిస్టు ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే వీటిని అవాస్తవమని కొట్టి పారేసిన అక్బర్‌ జర్నలిస్టు ప్రియా రమణిపై చట్టపరమైన చర్యలకు దిగారు. ఆమె తప్పుడు ఆరోపణలు చేశారంటూ పరువు నష్టం కేసు నమోదు చేశారు. దీనిని తాజాగా ఢిల్లీ కోర్టు కొట్టివేసింది. కాగా ఎంజే అక్బర్ పై వచ్చిన లైంగిక ఆరోపణలు ప్రధానంగా రాజకీయ రంగంలో తీవ్రచర్చకు దారి తీశాయి.  ప్రియా రమణి మొదలు పలువురు మహిళలు అక్బర్‌పై తీవ్రమైన ఆరోపణలతో  మీటూ అంటూ సోషల్‌ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles