Trend to tarnish judges ahead of elevation: CJI జూనియర్లతో జడ్జి సరస సల్లాపం.. అంతర్గత విచారణకు అదేశం

To flirt with a junior not an acceptable conduct for a judge supreme court

sexual harassment, judge conduct, flirting judge,former District Judge, Senior Advocate Ravindra Srivastava, senior judicial officer, WhatsApp messages, madhya pradesh high court, posh act, cji sa bobde, supreme court

The Supreme Court expressed reluctance to entertain a petition filed by a former District Judge from Madhya Pradesh challenging the disciplinary proceedings initiated by the MP High Court over the sexual harassment allegations made by a junior judicial officer.

జూనియర్లతో జడ్జి సరస సల్లాపం.. అంతర్గత విచారణకు అదేశం

Posted: 02/17/2021 03:07 PM IST
To flirt with a junior not an acceptable conduct for a judge supreme court

జూనియర్‌ న్యాయాధికారితో సీనియర్ న్యాయమూర్తులు సరస సల్లాపాలకు పాల్పడటం న్యాయవ్యవస్థలో అమోదయోగ్యం కాదని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి ప్రవర్తన న్యాయవ్యవస్థను సైతం మాయనిమచ్చలా తయారవుతుందని పేర్కోంది. ఇలాంటి కేసులలో బాధితురాలు తన పిటీషన్ ను ఉపసంహరించుకున్నా.. తదుపరి విచారణకు సహకరించకున్నా.. న్యాయవ్యవస్థ అపఖ్యాతి పాలుకాకుండా వుండేందుకు అంతర్గత విచారణను చేపట్టాల్సిన అవసరం వుందని.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని అత్యుత్తమ న్యాయస్థాన ధర్మాసనం తేల్చిచెప్పింది.

న్యాయమూర్తి హోదాలో బాధ్యతలను చేపడుతున్న వ్యక్తులు తమ జూనియర్ అధికారులతో సరసాలకు పాల్పడటం ఆమోదయోగ్య ప్రవర్తన కాదని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అంతేకాదు విచారణ ఎదుర్కోంటున్న వ్యక్తి పదవిలో లేకపోయినా (పదవీ విరమణ పోందినా) విచారణ కోనసాగాల్సిందేనని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ జిల్లా న్యాయమూర్తి (ప్రస్తుతం విశ్రాంత జడ్జి) తనను లైంగికంగా వేధించారంటూ జూనియర్‌ న్యాయాధికారిణి ఒకరు మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటీషన్ వేశారు.

ఈ కేసును విచారణ జరుగుతున్న క్రమంలో అమె తన పిటీషన్ ను ఉపసంహరించుకున్నారని, దీంతో ఇక న్యాయస్థానం న్యాయమూర్తిపై కేసు విచారణ చేపట్టడంలో అర్థమే లేదని.. దీనిని ఇంతటితో ముగించాలని న్యాయమూర్తి తరపు న్యాయవాది ఆర్ బాలసుబ్రహ్మణ్యం సుప్రీం ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. కాగా, జూనియర్ మహిళా న్యాయమూర్తి అనవసర ఇబ్బందులను కొనితెచ్చుకోవడం ఇష్టంలేక తన పిటీషన్ ను ఉపసంహరించుకుని ఉండవచ్చునని.. అయినా శాఖపరంగా అంతర్గత విచారణను మాత్రం కొనసాగాల్సిందేనని సుప్రీంకోర్టు ధర్మాసనంలోని న్యాయమూర్తులు జస్టిస్ ఏఎస్ బొప్పన్న, జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యంలు అభిప్రాయపడ్డారు.

ఈ క్రమంలో- తనపై విచారణను నిలిపివేయాలని, తాను హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందకూడదనే దురుద్దేశంతోనే ఆరోపణలు చేశారంటూ సదరు విశ్రాంత న్యాయమూర్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ‘‘ఆరోపణలు ఎదుర్కొంటున్న విశ్రాంత జిల్లా న్యాయమూర్తి అనుచితమైన, అసహ్యకరమైన వాట్సప్‌ సందేశాలు పంపారు. జూనియర్‌ అధికారిణితో సరసాలకు పాల్పడటం జడ్జిలకు తగదు. హైకోర్టు నిర్ణయం మేరకు ఆయన అంతర్గత విచారణను ఎదుర్కోవాల్సిందే’’ అని సూచించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles