Cash, Jewellery, Weapons Stolen From Sonali Phogat’s House బీజేపి నేత, టిక్ టాక్ స్టార్ సోనాలి ఫొగాట్ ఇంట్లో చోరి

Gold revolver rs 10 lakh cash stolen from bjp leader sonali phogat s house

sonali phogat, Gold, Congress, Revolver, Jewellery, digital video recorder (DVR), CCTV cameras, Chandigarh, BJP, Haryana, Politics, Crime

Jewellery, a licensed revolver, Rs 10 lakh and other valuables were stolen from BJP leader Sonali Phogat's house here in Haryana, police said on Tuesday. In her complaint, Phogat said that the theft took place when she was in Chandigarh.

బీజేపి నేత, టిక్ టాక్ స్టార్ సోనాలి ఫొగాట్ ఇంట్లో చోరి

Posted: 02/16/2021 08:34 PM IST
Gold revolver rs 10 lakh cash stolen from bjp leader sonali phogat s house

హర్యానాకు చెందిన బీజేపి నేత, టిక్‌టాక్‌ స్టార్‌ సొనాలీ ఫొగాట్‌ ఇంట్లో భారీ చోరీ జరిగింది. బంగారు ఆభరణాలు, లైసెన్స్‌డ్‌ రివాల్వర్‌, రూ.10లక్షల నగదుతో పాటు విలువైన వస్తువులు చోరీకి గురైనట్టు పోలీసులు వెల్లడించారు. తాను చండీగఢ్‌లో ఉన్న సమయంలో ఈ చోరీ జరిగినట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. మరోవైపు, సొనాలీ ఇంటి వద్ద సీసీటీవీ కెమెరాలు ఉన్నప్పటికీ.. దొంగలు డిజిటల్‌ వీడియో రికార్డర్‌ (డీవీఆర్‌)లో ఉన్న ఫుటేజీని కూడా తీసుకుపోయారని పోలీసులు తెలిపారు. ఈ చోరీ కేసుపై దర్యాప్తు చేస్తున్నట్టు హెచ్‌టీఎం స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ సుఖ్‌జిత్‌ చెప్పారు.

ఈ నెల 9న తన ఇంటికి తాళం వేసి చండీగఢ్‌కు వెళ్లినట్టు ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిబ్రవరి 15న తిరిగి హిసార్‌లోని తన నివాసానికి వచ్చేసరికి తాళాలు పగలగొట్టినట్టు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. బంగారం, వెండి ఆభరణాలు, రూ.10లక్షల నగదు, లైసెన్స్‌డ్‌ రివాల్వర్‌ తన ఇంట్లో అదృశ్యమైనట్టు పేర్కొన్నారు. 2019లో జరిగిన హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో అదంపూర్‌ నుంచి భాజపా తరఫున పోటీ చేసిన సొనాలీ ఫొగాట్‌.. కాంగ్రెస్‌ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles