వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రెండున్నర నెలలకు పైగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమం చేస్తున్న రైతులను పరామర్శించి వారితో చర్చలు జరిపేందుకు ప్రధాని నరేంద్రమోడీ వద్ద అసలు సమయమే లేదని విమర్శించారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. ప్రధానికి పాకిస్థాన్ వెళ్లడానికి, చైనా విహారానికి సమయం వుంటుంది కానీ.. దేశంలోని రైతులను పరామర్శించి వారి సమస్యలను పరిష్కరించేందుకు మాత్రం ఆయన వద్ద అసలు సమయం లేదని అన్నారు. దేశాన్ని అన్ని విధాలుగా నిర్భరంగా మార్చిన రైతులకు తమ మద్దతు ఎఫ్పటికీ వుంటుందని అన్నారు.
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించేలా చర్యలు చేపడతామని ఆమె రైతులకు హామీ ఇచ్చారు. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులను ప్రధాని మోడీ సహా బీజేపి నేతలు అవమానిస్తున్నారని, వారిని ఉగ్రవాదులుగా, దేశద్రోహులుగా అభివర్ణిస్తున్నారని అన్నారు. కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉత్తర్ ప్రదేశ్ లోని 27 జిల్లాలో పది రోజుల పాటు జై జవాన్, జై కిసాన్ పేరిట కిసాన్ పంచాయతీలు నిర్వహిస్తున్న యూపీ కాంగ్రెస్ సభలో అమె ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఇవాళ ఉత్రర్ ప్రదేశ్ లోని అలహాబాద్ లో త్రివేణి సంఘమంలో ఆమె మౌని అమావాస్య సందర్భంగా పవిత్ర సాన్నం ఆచరించారు. ఈ సందర్భంగా అమె ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. ఆ తరువాత అక్కడ వున్న ఆనంద్ భవన్ కు చేరుకుని అక్కడి మ్యూజియం ను సందర్శించారు. అంతకుముందు ఆమె సహారన్ పూర్ లో కిసాన్ పంచాయత్ లో మాట్లాడుతూ.. నిత్యం భూమిని చదను చేసి.. రాత్రింబవళ్లు శ్రమించే రైతులు ఎలా దేశద్రోహులు, ఉగ్రవాదులు అవుతారని ప్రశ్నించారు. ప్రధాని తన సొంత నియోజకవర్గ రైతులు నిరసన తెలుపుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు,
సమయం లేక కలవలేదని రైతులు ఓ మేరకు సంయమనం పాటిస్తున్నా.. వారిని కూడా ప్రధాని పార్లమెంటు సాక్షిగా చులకన చేసి మాట్లాడుతున్నారని అమె దుయ్యబట్టారు. రైతులను ఆందోళన జీవి అంటూ.. వారికి మద్దతు ఇస్తున్న వారిని కూడా అందోళన జీవులుగా పరన్నాజీవులుగా పేర్కోనడం దేశ ప్రధానికే చెందిందని అమె మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్రం తాను తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవాలని ప్రియాంక గాంధీ వాద్రా డిమాండ్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more