SEC orders transfer of Praveen Prakash ఏపీలో ప్రశాంతంగా కొనసాగుతున్న తొలివిడత పంచాయతీ ఎన్నికలు

Ap panchayat elections updates 38 97 voting till 10 30am in chittoor polling agent dies of heart attack

panchayat elections, N. Ramesh Kumar, AP Panchayat elections 2021, AP Panchayat elections 2021 results, AP Panchayat election, AP Panchayat election results, Andhra Pradesh Panchayat elections 2021, panchayat elections, JanaSena, BJP, TDP, Congress, opposition parties, Andhra pradesh, Politics

Polling for 2,723 panchayats in Andhra Pradesh are underway with people standing in queues to cast their vote early on Tuesday. Polling began at 6.30 AM and will go on till 3.30 PM while counting of votes will begin at 4 PM, official said.

ఏపీ ‘పంచాయతీ’ ఎన్నికలు: ప్రశాంతంగా కొనసాగుతున్న తొలివిడత ఓటింగ్

Posted: 02/09/2021 12:09 PM IST
Ap panchayat elections updates 38 97 voting till 10 30am in chittoor polling agent dies of heart attack

ఆంధ్రప్రదేశ్ లో చెదురుమదురు ఘటనల మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉదయం ఆరు గంటల నుంచి పంచాయతీ ఎన్నికలకు ఓటింగ్ ప్రారంభం కాగా, ఉదయం నుంచే ఓటర్లు క్యూ లైన్లలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమాయానికి రమారమి 45శాతం మేర ఓటింగ్ నమోదైంది. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 2,723 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనుండగా, సర్పంచ్ స్థానాలకు 7,506 మంది, 20157 వార్డు స్థానాలకు 43,601 మంది బరిలో ఉన్నారు.

నోటిఫికేషన్ ఇచ్చిన 3,249 గ్రామ పంచాయతీల్లో 525 చోట్ల ఏకగ్రీవం అయ్యాయి. గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఏక్రగీవం అయిన వాటికి కూడా నిన్న ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గుర్తుల కేటాయింపులో పొరపాట్ల కారణంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని వడ్డిగూడెం, బొప్పనపల్లిలో వార్డు ఎన్నికలను రెండో దశకు వాయిదా వేశారు.  మొత్తం 32,502 వార్డు సభ్యుల స్థానాల్లో 12,185 ఏకగ్రీవం అయ్యాయి. 160 స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు.

తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలపరిధిలోని చిన్నజగ్గంపేట గ్రామపరిధిలో పంచాయతి ఎన్నికలు ఘర్షణకు దారితీసాయి. అధికార వైసీసీ- ప్రతపక్ష టీడీపీ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరగడంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. రంగంలోకి దిగిన పోలీసులు ఘర్షణలకు పాల్పడుతున్న వారిని చెదరగోట్టారు. అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు ఓటర్లను చివర క్షణంలో ప్రలోభాలకు గురిచేస్తున్నారని.. దీనిని అడ్డుకునేందుకు వచ్చిన టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని సమాచారం.

రాష్ట్రంలో తొలివిడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా గుంటూరు జిల్లాలె విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని కాకుమాను గ్రామంలో ఓ పార్టీకి చెందిన పోలింగ్ ఏజెంట్ గా వ్యవహరించేందుకు వచ్చిన వ్యక్తి అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మరణించాడు. ఓటింగ్ జరుగుతున్న క్రమంలోనే ఈ మేరకు ఏజెంట్ మరణించడంలో కొంత సమయం పోలింగ్ కు అంతరాయం ఏర్పడింది.

పంచాయతీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లోనూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం పల్లెపాలెంలో డబ్బులు పంపిణీ చేస్తున్న కొందరిని గ్రామస్థులు అడ్డుకున్నారు. చిత్తూరు జిల్లా బొట్లవారిపాలెంలో గత అర్ధరాత్రి వైసీపీ మద్దతుదారులు కొందరు హల్‌చల్ చేసి ప్రత్యర్థులపై దాడికి దిగారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ బాధితులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

రాష్ట్రంలో జరుగుతున్న తొలి విడద పంచాయతీ ఎన్నికలను నెల్లూరు జిల్లాలోని గ్రామస్థులు బహిష్కరిస్తున్నారు. జిల్లాలోని సంభునిపాలెం గ్రామానికి చెందిన ఓటర్లు ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. తమ గ్రామంలోని కొందరి నామినేషన్లను ఎన్నికల సంఘం అధికారులు తిరస్కరించినందుకు నిరసనగా గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరిస్తున్నారు.

చిత్తూరు జిల్లాలో ఉదయం 10.30 గంటలకు ఏకంగా 38.97శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలోని బంగారుపాలెం లో 43శాతం, చిత్తూరులో 38శాతం, గంగాధర నెల్లూరులో 56శాతం, గుడిపాలలో 32, ఐరాలలో 42, కార్వేటినగర్ లో 32, నగరిలో 39, నింద్రాలో 28, పాలసముద్రంలో33, పెనుమూర్ లో 25, పూతలపట్టులో 41, అర్సీపురంలో 63, ఎస్సార్ పురంలో 20, థమనంపల్లిలో 39, వదమలపేటలో 45. వెదురుకుప్పంలో 25, విజయపురంలో 38, యాదమరిలో 38శాతం పోలింగ్ నమోదూంది.

విశాఖ జిల్లాలో ఓటర్లు గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఉత్సాహంగా పాల్గోంటున్నారు. ఉదయం ఏడున్నర గంటలకే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు రెడీ అయ్యారు. ముఖ్యంగా కోండూరు గ్రామ పంచాయతీలో ఈ దృశ్యం కనిపించింది.

కృష్ణా జిల్లాలోనే తొలిదశ పంచాయతీ ఎన్నికలకు ఓటర్లు ఉత్సహం ప్రదర్శిస్తున్నారు. జిల్లాలోని తొలి దశ ఎన్నికలు ఓటర్ల ఉత్సాహంతో ఉదయం పది గంటల సమాయానికి రమారమి 30 శాతం నమోదైంది. కంచికచర్ల మండలంలో 30శాతం, నందిగామలో 26, చందర్లాపాడులో 19, వీర్లపాడులో 25, పెనుగంచిప్రోలులో 19, వట్సవైలో 22, జగ్గయ్యపేటలో 20, జికొండురూలో 18, మైలవరంలో 20, ఇబ్రహీంపట్నంలో 20, విజయవాడ రూరల్ లో 20, పెనమలూరులో 18, కంకిపాడులో 23, తొట్లవల్లూరులో 22 శాతం పోలింగ్ నమోదైంది.

ప్రశాకం జిల్లా దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపుగా 35 గ్రామపంచయతి ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. నామినేషన్లు వేసినా.. అభ్యర్థులు తమలో తాము చర్చించుకుని ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలతో తమ గ్రామాభివృద్దిని చేసుకునేలా ముందుకు వచ్చి.. నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు 35శాతం మేర ఏకగ్రీవాలు జరగడంలో స్థానిక ఎమ్మెల్యే మాదిశెట్టి వేణుగోపాల్ కీలక పాత్ర పోషించారు.

కరోనా బారిన పడిన ఓటర్లుకు ఎన్నికల కమీషన్ ప్రత్యేకంగా ఓటింగ్ హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కల్పించింది. పీపీఈ కిట్లు ధరించిన కరోనా రోగులు ప్రత్యేకంగా మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 3.30 గంటల మధ్యలో ఓటింగ్ హక్కును వినియోగించుకునేందుకు సమయాన్ని కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కమీషనర్ గిరిజా శంకర్ ఎన్నికలు జరుగుతున్న అన్ని పంచాయితీలకు అదేశాలను జారీ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles