Judge shuts down defendant's flirting attempt మహిళా జడ్జీకి ఐ లవ్ యూ చెప్పిన ఖైదీ..

Florida man flirts with gorgeous judge during virtual court hearing

Florida burglar flatters Judge, Broward County Judge, Tabitha Blackmon, Demetrius Lewis, Zoom hearing, Bond Court, Broward County, Florida, US, America, crime

A Florida man facing an attempted burglary charge is making headlines after flirting with the judge presiding over his case. Demetrius Lewis appeared before Broward County Judge Tabitha Blackmon via a Zoom hearing on Thursday on allegations he tried to break into a Fort Lauderdale home as three children slept inside.

ITEMVIDEOS: మహిళా జడ్జీకి ఐ లవ్ యూ చెప్పిన ఖైదీ.. అయినా బెయిల్..

Posted: 02/08/2021 07:35 PM IST
Florida man flirts with gorgeous judge during virtual court hearing

దోపిడి కేసులో అడ్డంగా పోలీసులకు చిక్కి అండర్ ట్రయల్ ఖైదీగా వున్న ఓ నిందితుడు తన కేసును విచారించిన న్యాయమూర్తి.. శిక్షను ఖరారు చేస్తున్న తరుణంలో అమెకు ప్రపోజ్ చేసి ఫ్లర్ట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందా.? అని అలోచనలో పడ్డారా.. అగ్రరాజ్యం అమెరికాలోని ఫ్లోరిడా నగరంలో జరిగిందీ. కరోనా కారణంగా నేరాభియోగాలు ఎదుర్కోంటున్న నిందితులను న్యాయస్థానానికి తీసుకురాకుండా జూమ్ కాల్ ద్వారా విచారిస్తున్నారు. ఈ సందర్బంగా ఈ ఘటన చోటుచేసుకోవడం.. ఆ వీడియో కాస్తా వైరల్ గా మారడం.. ఏకంగా పది లక్షల మంది నెట్ జనులు ఈ వీడియోను చూశారు.

బ్రోవార్డ్ కౌంటీ జడ్జి తబితా బ్లాక్‌మోన్ తన విచారణను కొనసాగిస్తున్న క్రమంలో అమె ఎదుట ఫ్లోరిడా కు చెందిన నేరాభియోగాలు ఎదుర్కోంటున్న డెమెట్రియస్ లూయిస్ జూమ్ కాల్ ద్వారా హాజరయ్యాడు. ఫోర్ట్ లాడర్డేల్ హోమ్ లోని ఓ ఇంట్లో ముగ్గురు పిల్లలు మాత్రమే వున్నారని తెలుసుకుని వారింట్లోకి చోరబడేందుకు యత్నించాడన్న అరోపణలపై న్యాయస్థానంలో జడ్జీ ముందు లూయిస్ హాజరయ్యాడు. ఈ నేపథ్యం అమె జూమ్ కాల్ లో అతడ్ని విచారిస్తూ ఎలా వున్నారు అని అడిగారు. దానికి సమాధానం ఇవ్వకుండా మీరు చాలా అందంగా వున్నారు.. ఈ విషయం మీకు చెప్పాలని అనుకున్నాను.. మీరు చాలా చాలా అందంగా వున్నారని అన్నాడు లూయిస్.

ఇలా డెమెట్రియస్ లూయిస్ న్యాయమూర్తిని పోగుడుతూనే అమెను ప్రేమిస్తున్నానని కూడా చెప్పాడు. అంతే కొద్దిగా విస్తుపోయిన అమె వెంటనే తేరుకుని ఇలాంటివి ముఖస్తుతి మీకు ఎక్కడైనా లబిస్తుందోమో కానీ ఇక్కడ కాదు అని తన గొంతును సవరించుకుని కాసింత ఘాటుగానే చెప్పింది. అంతేకాదు అమె చెప్పినట్టుగానే నిందితుడ్ని బెయిల్ విషయంలోనూ కఠినంగానే వ్యవహరిచింది. నిందితుడి బెయిల్ మంజూరు చేసిన అమె అందుకు గాను అతడు ఐదు వేల డాలర్లను న్యాయస్థానంలో జమచేయాలని అదేశించింది. ఇక ఈ కేసులో నిందితుడు లూయిస్ గతంలో నాలుగేళ్లు జైలు శిక్షను కూడా గడిపారిన అమెరికా వర్గాలు తెలిపాయి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles