HC stays use of ‘e-Watch’ app till Feb. 9 ‘ఈ-వాచ్’ వినియోగంపై ఈ నెల 9 తేల్చనున్న హైకోర్టు

Ap panchayat polls hc directs sec not to use ewatch till feb 9

AP High Court ,e-watch app, AP Panchayat Elections, Panchayat Elections in andhra pradesh, andhra pradesh Panchayat Elections, SEC focus on unanimous polls, SEC directs to hold unanimous results, unanious polls in guntur, unanimous polls in chittoor, AP High Court ,e-watch app, Nimmagadda Ramesh Kumar, SEC, Guntur, Chittoor, AP panchayat elections 2021, unanimous poll results, Andhra Pradesh, Politics

The Andhra Pradesh High Court on Friday has issued key directions on the e-watch app brought in for the AP SEC panchayat elections. The court ordered that the app not be implemented until the 9th of this month.

హైకోర్టులో ఎన్నికల సంఘానికి చుక్కెదురు.. ‘ఈ-వాచ్’ వినియోగం వద్దు..

Posted: 02/05/2021 07:09 PM IST
Ap panchayat polls hc directs sec not to use ewatch till feb 9

రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు రాష్ట్ర హైకోర్టులో చుక్కెదురైంది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆయన ఎక్కడా ఎలాంటి అక్రమాలు, అన్యాయాలు జరగకుండా కట్టుదిట్టంగా ఎన్నికలను జరపాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన రాష్ట్ర గ్రామీణ ప్రాంత ఓట్లర్ల అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ వాచ్ యాప్ వినియోగంపై రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు ఆంక్షలు విధించింది. ఈ యాప్ ను ఈ నెల 9 వరకు వినియోగంలోకి తీసుకురాకూడదని అదేశాలను జారీ చేసింది.

గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అఘమేఘాల మీద రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకువచ్చిన ‘ఈ-వాచ్‌’ యాప్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నత న్యాయస్థానంలో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై ఈరోజు హైకోర్టు విచారణ చేపట్టింది. యాప్ కు సంబంధించి భద్రతా ధ్రృవపత్రం అందలేదని ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ధ్రువపత్రం వచ్చేందుకు మరో ఐదు రోజులు పడుతుందని తెలిపారు. దీంతో తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 9కి వాయిదా వేసింది. అప్పటి వరకు యాప్‌ను అందుబాటులోకి తేవొద్దని స్పష్టం చేసింది.

ఈనెల 3న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ‘ఈ-వాచ్‌’ యాప్‌ను ఆవిష్కరించారు. సాంకేతిక సమస్యలతో యాప్‌ వెలుగు చూడలేదు. ‘సెక్యూరిటీ ఆడిట్‌’ సంబంధిత అంశాలపై మరింత పరిశీలన అవసరమన్న ఉద్దేశంతో తాత్కాలికంగా నిలుపుదల చేశారు. తొలుత ‘గూగుల్‌ ప్లే స్టోర్‌’లో గురువారం నుంచి యాప్‌ని డౌన్‌లోడు చేసుకోవచ్చని ప్రకటించినా సాంకేతికపరమైన అంశాలు అవరోధంగా నిలిచాయని అధికారులు తెలిపారు. ‘సెక్యూరిటీ ఆడిట్‌ సర్టిఫికెట్‌’ తప్పనిసరి కావడంతో ఆంధ్రప్రదేశ్‌ టెక్నాలజీ సర్వీసెస్‌ (ఏపీటీఎస్‌)కి యాప్‌ పరిశీలన బాధ్యత అప్పగించినట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles