AP 10th Class Exams Time Table Released ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల..

Ap 10th class examinations 2021 time table schedule released

AP SSC, AP SSC board exam, AP SSC board exam date sheet, ssc board exam schedule, AP SSC board exam class 10, board exam dates, AP SSC Board exams, AP SSC 10 class time table, AP SSC Exams, SSC 10th Exam time table, ssc Exam time table, Education minister, Adimulapu Suresh, 10th Class Exams, 10th Exam Time Table, 10th Class Exams 2021, Andhra Pradesh

AP Education Minister Dr Adimulapu Suresh released the schedule for the Class X exams. It has been announced that the exams will be held from June 7 to 16 2021. The Inter Exams be held from May 5 to 23. It has been revealed that the new academic year in AP will start from July 21st.

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల..

Posted: 02/03/2021 06:52 PM IST
Ap 10th class examinations 2021 time table schedule released

కరోనా మహమ్మారి నేపథ్యంలో పాఠశాలు, కళాశాలలు మూతపడి అన్ లాక్ నేపథ్యంలో ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్న నేపథ్యంలో ఈ పాటికే పలు విద్యాసంస్థలకు పరీక్షలు జరగాల్సి వున్నా.. కొంత ఆలస్యంగా జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో వరుసగా పరీక్షల షెడ్యూల్ విడుదల చేస్తున్నాయి ప్రభుత్వాలు. క్రితం రోజునే సీబీఎస్ఈ పరీక్షల తేదీలు కేంద్ర మంత్రి విడుదల చేసిన నేపథ్యంలో తమ పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తారా..? అని ఆంధ్రప్రదేశ్ పదో తరగతి విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రమంలో ఆ సుమూర్తం కూడా రానేవచ్చింది.

ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఇవాళ రాష్ట్ర పదో తరగతి పరీక్షలకు షెడ్యూల్ ను విడుదల చేశారు. జూన్ 7 నుంచి 16 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఏడాది ఏడు పేపర్లతో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒక్కో సబ్జెక్టుకు 100 మార్కులకు పరీక్ష జరుగుతుంది. సైన్సు సబ్జెక్టుకు మాత్రం రెండు పేపర్లు ఉంటాయి. సైన్సులో ఒక్కో పేపరుకు 50 మార్కులు కేటాయించారు. మరోవైపు పదో తరగతి విద్యార్థులకు జూన్ ఐదో తేదీ వరకు క్లాసులు జరగనున్నాయి. మే 3 నుంచి 10 వరకు ఇతర తరగతులకు పరీక్షలు జరుగుతాయి. పరీక్షల అనంతరం సెలవుల తర్వాత జులై 21 నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది.

పదోతరగతి పరీక్షల షెడ్యూల్‌
 తేదీ               పరీక్ష
 07.06.2021      ఫస్ట్‌ లాంగ్వేజ్‌ (గ్రూప్‌ ఏ) & (కాంపోజిట్‌ కోర్సు)
 08.06.2021      సెకెండ్‌ లాంగ్వేజ్‌
 09.06.2021      ఇంగ్లీష్‌
 10.06.2021      మ్యాథమెటిక్స్‌
 11.06.2021      ఫిజికల్‌ సైన్స్‌
 12.06.2021      బయోలాజికల్‌ సైన్స్‌
 14.06.2021      సోషల్‌ స్టడీస్‌
 15.06.2021     ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌2 (కాంపోజిట్‌ కోర్సు)
        ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 1 (సంస్కృతం, అరబిక్‌, పర్షియన్‌)
 16.06.2021       ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్‌ కోర్సు (థియరీ)
        ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ 2 (సంస్కృతం, అరబిక్‌, పర్షియన్‌)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles