CBSE class 10, 12 board exam date sheet out సీబీఎస్ఈ పది, పన్నెండవ తరగతి పరీక్షల షెడ్యూల్ ఇదే..

Cbse class 10 12 exam 2021 date sheet released on cbse nic in

CBSE, CBSE board exam, cbse board exam date sheet,cbse board exam schedule,cbse class 12 board exam,cbse board exam class 10, board exam dates, CBSE Board exams, CBSE 10 class time table, CBSE 12 class time table, CBSE Exams, CBSE 10th Exam time table, CBSE 12th Exam time table, Education minister, Ramesh Pokhriayal

The Central Board of Secondary Education (CBSE) on Tuesday announced the examination schedule for the upcoming class 10 and 12 board examinations. In a press briefing, Education minister, Ramesh Pokhriayal 'Nishank', released the schedule on his Twitter account.

సీబీఎస్ఈ పది, పన్నెండవ తరగతి పరీక్షల షెడ్యూల్ ఇదే..

Posted: 02/02/2021 04:53 PM IST
Cbse class 10 12 exam 2021 date sheet released on cbse nic in

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పది, ఇంటర్ విద్యార్థుల పరీక్షల షెడ్యూల్ విడుదల కావడంతో అంతకుముందుగానే మే నెల 4 నుంచి తమ సీబీఎస్ఈ పరీక్షలు ప్రారంభం అవుతాయని చెప్పినా.. పరీక్షల షెడ్యూల్ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అంటూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న తరుణం రానేవచ్చింది. సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షల పూర్తి షెడ్యూల్‌ ను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ ఫోఖ్రియాల్ ట్విట్టర్ లో విడుదల చేశారు. మే 4 నుంచి  జూన్‌ 11 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను సీబీఎస్ఈ.ఎన్ఐసి.ఐఎన్ వెబ్ సైట్లో పోందుపర్చినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ తెలిపారు.

ఇక పదో తరగతి పరీక్షలు ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరగనుండగా, పన్నెండవ తరగతి పరీక్షలు మాత్రం ఉదయం, మధ్యాహ్నం వేళల్లో జరగనున్నాయి. 12వ తరగతి పరీక్షలు రెండు షిఫ్ట్ లలో కొనసాగుతాయి. తొలి షిఫ్ట్‌ ఉదయం 10.30గంటల నుంచి 1.30గంటల వరకు; రెండో షిఫ్ట్‌ మధ్యాహ్నం 2.30గంటల నుంచి 5.30గంటల వరకు జరగనున్నాయి. కరోనా విజృంభణ నేపథ్యంలో ఈ ఏడాది పరీక్షల నిర్వహణలో జాప్యం నెలకొంది. 2021లో బోర్డు పరీక్షలను ఆన్ లైన్ లో నిర్వహించబోమని ఇప్పటికే సీబీఎస్‌ఈ బోర్డు స్పష్టంచేసిన విషయం తెలిసిందే.

యూజీసీ-నెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల

యూజీసీ -నెట్‌ 2021 పరీక్ష తేదీల షెడ్యూలు విడుదలైంది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) నిర్వహించే ఈ పరీక్ష మే 2 నుంచి జరగనున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం ఆయన ట్వీట్‌ చేశారు. దీంట్లో స్కోరు సాధిస్తే జూనియర్‌ రీసెర్చి ఫెలోషిప్‌, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీపడేందుకు ఉపయోగపడుతుంది. ఈ పరీక్షలు మే 2,3,4,5,6,7,10,11,12,14 మరియు 17 తేదీల్లో జరుగుతాయని కేంద్రమంత్రి వెల్లడించారు. ఈ పరీక్ష రాసే అభ్యర్థులందరికీ ఆయన శుభాకాంక్షలు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles