Atchannaidu arrested for threatening rebel candidate భారీ పోలీసు బందోబస్తు మధ్య అచ్చెన్నాయుడి అరెస్ట్..

Andhra pradesh tdp president atchannaidu arrest triggered protests

TDP AP president K Atchannaidu arrested, Atchannaidu arrested, Kinjarapu Appanna, Vijaya Sai Reddy, Srikakulam district, Kinjarapu Atchannaidu, gram panchayat, Atchannaidu, Vendetta Politics, Nimmada, Kotabommali police station, Srikakulam, Andhra Pradesh, Politics, Crime

TDP Andhra Pradesh unit Chief Kinjarapu Atchannaidu was arrested in connection with a gram panchayat election-related case in which he was facing a charge of alleged criminal intimidation. Atchannaidu was listed an accused, along with 21 others, in the case in Nimmada village in Srikakulam district, police sources said.

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి అరెస్ట్.. ఖండించిన చంద్రబాబు, లోకేష్

Posted: 02/02/2021 12:42 PM IST
Andhra pradesh tdp president atchannaidu arrest triggered protests

అధికార వైఎస్సార్సీపి పార్టీ సర్పంచ్ అభ్యర్థిని బెదిరించారన్న ఆరోపణలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళంలోని కోటబొమ్మాళి ప్రాంత పరిధిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీచేస్తున్న సర్పంచ్ అభ్యర్థిపై ఆయన బెదిరింపులకు పాల్పడ్డారని, ఒక దశలో స్పరంచ్ అభ్యర్థఇకి మద్దతు పలుకుతున్న వైసీపీ స్థానిక నేతలపై ఆయన వర్గీయులు దాడి కూడా చేశారని కోటబొమ్మాళి పోలిస్ స్టేషన్ లో పిర్యాదు నమోదు అయ్యింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అచ్చెన్నాయుడును అరెస్టు చేసేందుకు చర్యలు చేపట్టారు.

దీంతో నిమ్మాడలోని ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించి.. కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని ఆయనను అరెస్ట్ చేసి కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్ కు తరలించారు. విషయం తెలిసిన టీడీపీ కార్యకర్తలు నిమ్మాడలో ఆందోళనకు దిగారు. దీంతో ఆ ప్రాంతంలోని వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఇదిలావుండగా అచ్చెన్నాయుడి అరెస్టును టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో పోలీసులు వైసీపీ ఏజెంట్ల మాదిరిగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. అచ్చెన్నాయుడు పంచాయతీ ఎన్నికలలో తన మార్కు విజయాన్ని టీడీపీకి అందిస్తారని అంచనా వేసిన వైసీపీ ఇలాంటి చౌకబారు అరోపణలు చేయించి అరెస్టు చేసిందని దుయ్యబట్టారు.

అచ్చెన్నాయుడిని అరెస్టుపై ఆ పార్టీ నేత నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. అచ్చెన్నాయుడి అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ కు ఓటమి తప్పదన్న భయంతోనే జగన్ ఇలాంటి పిరికిపంద చర్యలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడి అరెస్ట్ రాజారెడ్డి రాజ్యాంగానికి పరాకాష్ఠ అని ఆరోపించారు. అచ్చెన్నాయుడి ఇంటిపైకి రాడ్లు, కత్తులతో దాడికి వెళ్లిన వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్, ఆయన అనుచరులపై పోలీసులు ఇప్పటి వరకు కేసెందుకు నమోదు చేయలేదని లోకేశ్ ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles