High court sensational judgement on family pension భార్యకు పెన్షన్ పై హైకోర్టు సంచలన తీర్పు.

High court says wife eligible for family pension even if she murders husband

high court, Punjab and Haryana High Court, Baljeet Kaur, Ambala, Tarsem Singh, remarriage, family pension, wife, murder, National, Politics

In an unusual judgment, the Punjab and Haryana High Court recently said that the wife would be eligible for family pension even if she murders her husband. The wife is entitled to a family pension under CCS (Pension) Rules, 1972 after her husband's death. The widow of a government servant is also eligible to receive the family pension even after remarriage.

భార్యకు పెన్షన్ చెల్లింపుపై పంజాబ్-హర్యానా హైకోర్టు సంచలన తీర్పు

Posted: 02/01/2021 06:29 PM IST
High court says wife eligible for family pension even if she murders husband

ప్రభుత్వ ఉద్యోగాలు.. ప్రైవేటు ఉద్యోగాలు చేసి పదవీవిరమణ పోందిన వారికి లభించే పెన్సన్ ను వారి మరణానంతరం వారి భార్యలకు అందించే విషయమై సంచలన తీర్పును వెలువరించింది పంజాబ్, హర్యానా హైకోర్టు. భర్తలను పెన్సన్ ను ఇకపై భార్యలకు ఇవ్వాల్సిందేనన్న న్యాయస్థానం మరో అడుగుముందుకేసీ.. భర్తలను వారి భార్య హత్య చేసేనా.. లేక భర్త మరణానంతరం అమె మరో వివాహం చేసుకుని వెళ్లిపోయినా.. అమెకు పెన్షన్ మాత్రం లభించి తీరాల్సిందేనని న్యాయస్థానం సంచలనాత్మక తీర్పును వెలువరించింది,

కుటుంబ పెన్షన్ అనేది సంక్షేమ పథకమని, ప్రభుత్వ ఉద్యోగి చనిపోయినప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకే దానిని ప్రవేశపెట్టారని న్యాయస్థానం పేర్కొంది. క్రిమినల్ కేసులో ఆమెకు శిక్ష పడినా సరే పెన్షన్ హక్కును కాదనలేమని తీర్పు చెప్పింది. హర్యానాలోని అంబాలాకు చెందిన బల్జీత్ కౌర్ భర్త తర్సెమ్‌సింగ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి. 2008లో ఆయన మరణించగా, 2009లో ఆమెపై హత్యానేరం కింద కేసు నమోదైంది. ఈ కేసులో దోషిగా తేలిన ఆమెకు 2011లో శిక్ష పడింది.

అప్పటి వరకు బల్జీత్‌ కౌర్‌కు పెన్షన్ అందిస్తున్న ప్రభుత్వం ఆమెకు శిక్ష పడగానే నిలిపివేసింది. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. నిని విచారించిన న్యాయస్థానం.. భర్తను ఆమె హత్య  చేసినప్పటికీ, పెన్షన్ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. భర్త మరణానంతరం భార్యే కుటుంబ పింఛనుకు హక్కుదారు అవుతుందని, కాబట్టి ఆమెకు రావాల్సిన పింఛను, పాత బకాయిలను రెండు నెలల్లో విడుదల చేయాలని సంబంధింత శాఖను హైకోర్టు ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles