All vacancies to be filled soon, says Railway Board chairman రైల్వే గుడ్ న్యూస్.. ఎంపికైన అసిస్టెంట్ లోకో పైలట్లకు త్వరలోనే శిక్షణ

1 4 lakh vacancies in indian railways to be filled soon railway board chairman

Indian Railways, Railway Board chairman, Indian Railways jobs, Indian Railways vacancies, RRB Recruitment Exams, Railway Board CEO, Suneet Sharma, Govt Jobs, Railway Jobs, Employment news

The process of filling vacancies in the Indian Railways, which has become the lifeline of development of the country, has started and in the coming time all these will be filled. The assurance was given by the newly appointed Chairman and CEO of the Railway Board, Suneet Sharma.

రైల్వే గుడ్ న్యూస్.. ఎంపికైన అసిస్టెంట్ లోకో పైలట్లకు త్వరలోనే శిక్షణ

Posted: 01/12/2021 09:43 PM IST
1 4 lakh vacancies in indian railways to be filled soon railway board chairman

కరోనా మహమ్మారి విజృంభనతో గత మార్చి నుంచి నిరుద్యోగులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఓవైపు ఉన్న ఉద్యోగాలే గాలిలో దీపాలుగా మారుతున్న క్రమంలో ఏ ఉద్యోగం దొరికినా ఫర్యాలేదని నిరుద్యోగ యువత భావిస్తున్నారు. కరోనా సమయంలో చాలీ చాలని జీతాలు.. ఉపాధి కొల్పోవడంతో సినీ కార్మికులు మొదలుకుని ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయుల వరకు అందరూ తమ కుటుంబపోషణ కోసం కూరగాయాలు, కిరాణా షాపులు, టీ స్టాల్ ఏర్పాటు చేసుకున్న విషయం కూడా తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే కరోనాకు వాక్సీన్ డ్రైరన్ ముగిస ఇవాళ రేపట్లో హెల్త్ వర్కర్లకు అందజేస్తున్న సమయంలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కూడా నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పింది.

రైల్వేలో ఉద్యోగాల భర్తీ నిరంతర ప్రక్రియ అని అది నిరంతరం కోనసాగుతోందని రైల్వే బోర్డు కొత్త సీఈవో సునీత్ శర్మ అన్నారు. రైల్వే కొత్త చైర్మన్ గా గత వారం రోజుల క్రితం బాధ్యతలు చేపట్టిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగాల భర్తీ అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంటుందన్నారు. ఇక రైల్వే సహా అన్ని ప్రభుత్వ సెక్టార్ల ఉద్యోగాలకు కరోనా వైరస్ ప్రభావితం చేసిందన్న ఆయన రైల్వే శాఖలో అసిస్టెంట్ లోకో పైలట్లుగా ఎంపికైన వారిని త్వరలోనే ఉద్యోగాలలో నియామకాల పిలుపును అందుకుంటారని అన్నారు. వారందరికీ గత నెల నుంచే శిక్షణను కూడా ప్రారంభించామని సునీత్ శర్మ తెలిపారు.

కరోనా వైరస్ కారణంగా శిక్షణ ఇవ్వడంలో జాప్యం జరిగిందని, ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామన్నారు. డిసెంబర్ నుంచి రైల్వే బోర్డు పరిధిలోని అన్ని శిక్షణా కేంద్రాలలో శిక్షణ ప్రారంభమైందన్నారు. ఇక శాఖపరంగా ఎలాంటి ఖాళీలు వున్నా వాటిని వెంటనే భర్తి చేస్తామని కూడా చెప్పారు. ఇదిలా ఉంటే, గతేడాది లక్షా 40వేల ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేయగా, రెండు లక్షలకు మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. కరోనా కారణంగా నిలిచిన పరీక్షలను డిసెంబర్ నుంచి నిర్వహిస్తున్నారు. ఆ ప్రక్రియ కొనసాగుతోందని సునీత్ శర్మ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles