SEC removed Secretary Vani Mohan from her duties ఎస్ఈసీలో అధికారుల ‘పంచాయితీ’.. చెక్ పెడుతున్న నిమ్మగడ్డ

Nimmagadda ramesh kumar removed the sec secretary vani mohan from her duties

State Election commissioner, Nimmagadda Ramesh Kumar, Gram panchayat elections, GP election shedule, chief secretary, Adithyanath, High Court, Gopala Krishna dwivedi, public Health, panchayat raj secretary, YS Jagan Mohan Reddy, chief Minister, Andhra Pradesh, YSRCP, TDP, Politics

Andhra Pradesh State Election Commissioner, Nimmagadda Ramesh Kumar took another sensational decision. Disciplinary actions are being taken against officials who are disobeying the orders of the Election Commission. SEC Nimmagadda Ramesh Kumar has suspended Vani Mohan as a secretary in the Election Commission.

ఎస్ఈసీలో అధికారుల ‘పంచాయితీ’.. చెక్ పెడుతున్న నిమ్మగడ్డ

Posted: 01/12/2021 09:14 PM IST
Nimmagadda ramesh kumar removed the sec secretary vani mohan from her duties

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల నగరా మ్రోగిన నేపథ్యంలో దానిని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించడంతో వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో ఈ అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం రిట్ పిటీషన్ వేసింది. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ ఎదుట సవాలు చేసింది. దీనిపై ఓ వైపు న్యాయస్థానంలో విచారణ కొనసాగుతున్న తరుణంలోనే రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు విఘాతం కలిగించే చర్యలకు పూనుకుంటున్న ఇంటి దోంగల భరతం కూడా పడుతోంది ఎన్నికల సంఘం. ఓ వైపు ఎస్ఈసీ నిర్ణయంపై న్యాయస్థానం వ్యతిరేక తీర్పును వెలువరించడంతో దానిని సవాల్ చేసిన ఈసీ.. ఇక తమ శాఖలోనే ఎన్నికల వేళ అందుకు సుముఖంగా లేని అధికారులపై కోరడా ఝుళిపించింది.

రాష్ట్ర ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ జీవీ సాయి ప్రసాద్ పై క్రమశిక్షణ చర్యలు చర్యలు తీసుకున్నారు. ఇక తమ విభాగంలో వున్న సిబ్బందిని ప్రక్షాళణ చేసే ప్రక్రియను కూడా చేపట్టారు, ఇక తాజాగా కార్యదర్శి వాణి మోఁహన్ సేవలకు కూడా చెక్ పెట్టారు, రాష్ట్రంలో గ్రామ పంచాయితీ ఎన్నికలకు షెడ్యూల్డు విడుదల చేసిన తరుణంలో ఆయన 30 రోజుల పాటు సెలవుపై వెళ్లడంతో రాష్ట్ర ఎన్నికల అధికార నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మండిపడుతున్నారు. దీంతో ఆయనపై చర్యలకు ఉపక్రమించారు. తన అధికారాలకు మరింత పదును పెట్టిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. ఎన్నికల సంఘం ఆదేశాలను బేఖాతరు చేస్తున్న అధికారులపై వరుసగా క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నారు.

జీవీ సాయి ప్రసాద్ పై క్రమశిక్షణా చర్యలు తీసుకున్న ఆయన.. సాయిప్రసాద్ తాను సెలవుపై వెళ్లడంతో పాటు ఇతర ఎన్నికల సంఘం ఉద్యోగులు, సిబ్బందిని కూడా సెలవులపై వెళ్లేలా ప్రభావితం చేశారన్న అధారాలు ఉన్నయాని దీంతో అయనపై క్రమశిక్షణా చర్యలకు ఈ అభియోగాలను కూడా జతపర్చుతున్నట్లు తెలిపారు. దీంతో ఆయనను ఎన్నికల విధుల నుంచి తొలగించింది. అంతటితో ఆగకుండా ఆయన ఇతర ప్రభుత్వ సర్వీసులలో ప్రత్యక్షంగా లేదా.. పరోక్షంగా విధులు నిర్వహించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఇక తాజాగా సెక్రటరీగా ఉన్న వాణీ మోహన్‌ను తొలగిస్తూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీఎస్‌కు లేఖ రాశారు. వాణీమోహన్‌ సేవలు ఎన్నికల కమిషన్‌లో అవసరం లేదని లేఖలో తెలిపారు. వాణీమోహన్‌ను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles