CBI files case against IVRCL for Rs 5,000 crore loan fraud బ్యాంకులకు రూ.5 వేల కోట్లు కుచ్చుటోపి పెట్టిన ఐవీఆర్సీఎల్..

Ivrcl firm booked for alleged bank fraud of rs 4837 crore cbi raids premises

Central Bureau of Investigation, CBI, Hyderabad, IVRCL Limited, E Sudhir Reddy, R Balarami Reddy, State Bank of India, IDBI Bank, Canara Bank, Andhra Bank, Corporation Bank, EXIM Bank, Punjab

The Central Bureau of Investigation (CBI) has registered a fraud case against Hyderabad-based IVRCL Limited, its former managing director E Sudhir Reddy, former joint Managing Director R Balarami Reddy and unknown public servants, others on a complaint from State Bank of India, Hyderabad.

బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టిన ఐవీఆర్సీఎల్.. రూ.5000 కోట్లకు ఎగనామం..

Posted: 12/31/2020 09:19 PM IST
Ivrcl firm booked for alleged bank fraud of rs 4837 crore cbi raids premises

(Image source from: Indiatoday.in)

బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టి వేల కోట్ల రూపాయలతో బోర్డు తిప్పేస్తున్న సంస్థలు ఈ మధ్యకాలంలో అనేకం వున్నాయి. చెన్నైకి చెందిన సంస్థలతో పాటు ఉత్తర భారత దేశానికి చెందిన సంస్థలు కూడా ఇప్పటికే ఈ జాబితాలో చేరిపోయాయి. ఇక తాజాగా మరో హైదరాబాదీ సంస్థ కూడా ఈ జాబితాలో చేరింది. కొన్ని వేల కోట్ల రూపాయలను బ్యాంకులకు ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేశారు లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ. వారి జాబితాలో చేరేందుకు హైదరాబాద్ ఇన్ఫ్రా సంస్థ ఐవీఆర్ సీఎల్ ఎండీ సుధీర్ రెడ్డి కూడా చేరిపోయారు.

అయితే ఈయన విదేశాలకైతే పారిపోలేదుగానీ.. 8 బ్యాంకులకు రూ.4,837 కోట్ల కుచ్చుటోపీ పెట్టాడు. ఆ బ్యాంకులన్నింటికీ నేతృత్వం వహిస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఫిర్యాదుతో ఆయనగారి బాగోతం బయటపడింది. సీబీఐ కేసు నమోదు చేసింది. ఐవీఆర్ సీఎల్ అనే మౌలిక వసతుల సంస్థ తమ నేతృత్వంలోని 8 బ్యాంకుల కన్సార్టియంను మోసం చేసిందని సీబీఐకి ఎస్బీఐ ఫిర్యాదు చేసింది. ప్రభుత్వ అధికారులతో కలిసి బ్యాంకులను సంస్థ ముంచిందని పేర్కొంది. తమ రుణాలను చెల్లించకపోవడంతో పాటు ఎగనామం పెడుతున్న నేపథ్యంలో ఎస్పీఐ సీబిఐకి పిర్యాదు చేసింది.

దీంతో రంగంలోకి దిగిన సీబిఐ ప్రాథమిక విచారణ చేయగా, ఎస్బీఐతో పాటుగా మరో ఎనమిది బ్యాంకులకు ఐవీఆర్సీఎల్ కుచ్చుటోపి పెట్టిందని తేలింది, ఐడీబీఐ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఎగ్జిమ్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాల నుంచి ఐవీఆర్ సీఎల్ రుణాలు తీసుకుంది. ఎస్బీఐ ఫిర్యాదుతో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఇ. సుధీర్ రెడ్డి, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్. బలరామిరెడ్డి, తప్పుడు మార్గాల్లో రుణాలు ఇచ్చేందుకు సహకరించిన ప్రభుత్వ అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు సీబీఐ అధికారి ఆర్కే గౌర్ వెల్లడించారు.

వేరే పార్టీలకు పేమెంట్ చేయాల్సి ఉందని చెప్పి లెటర్ ఆఫ్ క్రెడిట్స్ (రుణ పత్రం) కింద బ్యాంకుల నుంచి సంస్థ రుణాలు తీసుకున్నా.. వాటిని తిరిగి చెల్లించలేదని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ ప్రకారం ఆ మొత్తాన్ని అడ్డదారుల్లో సంస్థ ఖాతాల్లోకి మళ్లించిందని వివరించారు. ఫిర్యాదుల నేపథ్యంలో హైదరాబాద్ లోని నిందితుల ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు చేసింది. సోదాల్లో పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు చెప్పారు. కాగా, ఐవీఆర్ సీఎల్ సంస్థ 25 ఏళ్లుగా పర్యావరణం, నీటిపారుదల, రవాణా, నిర్మాణ రంగం, విద్యుత్ సరఫరా, గనుల రంగాల్లో వ్యాపారం చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CBI  IVRCL Limited  E Sudhir Reddy  R Balarami Reddy  SBI  IDBI Bank  Canara Bank  Andhra Bank  Corporation Bank  

Other Articles