Swami kamalananda bharati sensational comments జగన్ ప్రభుత్వంపై కమలానంద భారతి తీవ్ర ఆగ్రహం..

Swami kamalananda bharati sensational comments on ap govt

swami kamalananda bharati, Hindu temples attack, Hindu gods idols demolished, kamalananda bharai sensational comments, AP Govt, Hindus safe guard, Hindu's Religious faiths, Amit Shah, Union Government

Swami kamalananda bharati sensational comments on Andhra Pradesh Government, says the AP Govt is not safe guarding the Hindu's Religious faiths.

జగన్ ప్రభుత్వంపై కమలానంద భారతి తీవ్ర ఆగ్రహం..

Posted: 12/31/2020 08:25 PM IST
Swami kamalananda bharati sensational comments on ap govt

(Image source from: telugu.oneindia.com)

ఆంధ్రప్రదేశ్ రాఫ్ట్రంలోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై కమలానంద భారతి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని పవిత్ర హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ దేవతామూర్తుల విగ్రహాలను ధ్వంసం చేస్తుండటం దారుణమని పేర్కొన్న ఆయన ఏపీలో వున్న ప్రభుత్వం ముమ్మాటికీ క్రైస్తవుల ప్రభుత్వమేనని వ్యాఖ్యానించారు. దేవాలయాలపై దాడులు, దేవతావిగ్రహాల ధ్వంస ఘటనలపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏతో దర్యాప్తు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ లో వున్నది హిందువుల అనుకూల ప్రభుత్వం కాదని చాలా స్పష్టంగా అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించాలని అన్నారు. ఏపీలో ఏడాది కాలంలో దాదాపు వంద ఘటనలు జరిగాయని ఆయన అన్నారు. విజయవాడ, అంతర్వేది, బిట్రగుంట, రామతీర్థం వంటి ఘటనలు కలకలం రేపినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. కనీసం దేవాదాయ శాఖ మంత్రి కూడా నోరు విప్పడం లేదని దుయ్యబట్టారు.

విగ్రహాలను ధ్వంసం చేస్తున్నా, ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడంతో, కోట్లాది మంది హిందువుల మనోభావాలు గాయపడుతున్నాయని అన్నారు. ఓట్లకు మాత్రమే హిందువులు పనికివస్తున్నారా.? వారి మనోభావాలతో ముడిపడిన దేవాలయాలపై దాడులు జరిగినా స్పందించరా.? అని ఆయన నిలదీశారు. చిలకలూరిపేటలో క్రైస్తవుల సమాధులను ధ్వంసం చేస్తే రాష్ట్ర హోంమంత్రి స్వయంగా వెళ్లి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. ఒక్కో మతం పట్ల ఒక్కో మాదిరి వ్యవహరించడం సరికాదని అన్నారు. లౌకిక స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించడం దారుణమని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles