UK returnee tests positive for new strain in TN కొత్త రకం కరోనా బారిన పడిన చెన్నై వ్యక్తి.. నిర్థారించిన పూణే ల్యాబ్..

Chennai man tests positive for new strain of coronavirus

corona new strain, new strain B.1.1.7, COVID 19, Coronavirus, UK returnee covid 19, mutant strain covid 19, virus strain, chennai person new srain

A Chennai resident, who returned from the United Kingdom, was found to be among the six in India to have tested positive for the new strain of the SARS-CoV-2 which causes Covid-19. The new strain, called B.1.1.7, of the coronavirus, was recently identified in the UK and is suspected to be much more transmissible than the original strain.

కొత్త రకం కరోనా బారిన పడిన చెన్నై వ్యక్తి.. నిర్థారించిన పూణే ల్యాబ్..

Posted: 12/30/2020 07:17 PM IST
Chennai man tests positive for new strain of coronavirus

(Image source from: Hindustantimes.com)

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రాణాలను బలిగొనింది. అంతేకాదు మరెందరనో తన ప్రభావానికి గురిచేసింది. ఇప్పుడిప్పుడే ఈ కేసులు తగ్గుతున్న తరుణంలో దేశంలో నెమ్మదిగా కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ వేళ్లూనుకుంటోంది. బ్రిటన్ నుంచి దేశానికి వస్తున్న వారిలో ఇది బయటపడుతోంది. లండన్ నుంచి ఇటీవల రాష్ట్రానికి వచ్చిన 30 మంది నమూనాలను సేకరించి పూణె వైరాలజీ ల్యాబ్ లో పరీక్షించగా చెన్నైకి చెందిన వ్యక్తికి కరోనా కొత్త వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది.

ఈ మేరకు తమిళనాడు ఆరోగ్యశాఖ కార్యదర్శి జె రాధాకృష్ణన్ మీడియాకు సమాచారం అందించారు, కొత్తరకం కరోనా దేశంలోకి చోచ్చుకురాకుండా భారత ప్రభుత్వం ముందస్తుగా బ్రిటన్ నుంచి దేశానికి వచ్చే విమానాలను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయినా దేశంలోకి ఈ కత్త రకం కరోనా చోచ్చుకొచ్చింది. తమిళనాడుకు చెందిన వ్యక్తికి నిర్థారణ కావడంతో మొత్తంగా దేశంలో ఆరుగురు వ్యక్తులు ఈ రకం కరోనాకు బాధితులయ్యారు. అయితే వీరి నుంచి ఇతరులకు కరోనా కత్తరకం స్ట్రెయిన్ సోకకుండా వైద్యాధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

నవంబరు 25 నుంచి ఇప్పటి వరకు బ్రిటన్ నుంచి తిరిగి వచ్చిన 2,200 మందికి పరీక్షలు నిర్వహించామని, వారిలో 17 మందిలో వైరస్ లక్షణాలు బయటపడినట్టు ఆయన పేర్కొన్నారు. అలాగే, వారితో సంబంధాలు కలిగిన మరో 16 మందికి కూడా వైరస్ పరీక్షలు నిర్వహించినట్టు చెప్పారు. పాజిటివ్ లక్షణాలు తీవ్రంగా ఉన్న 30 మంది నమూనాలను పూణె వైరాలజీ ల్యాబ్‌కు పంపగా, చెన్నైకి చెందిన వ్యక్తికి కరోనా కొత్త స్ట్రెయిన్ సోకినట్టు నిర్ధారణ అయిందన్నారు. బాధితుడిని ప్రస్తుతం గిండీలో ఏర్పాటు చేసిన కరోనా ప్రత్యేక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : corona new strain  Coronavirus  UK returnee  Covid 19  

Other Articles