Will Form A Committee Will Form A Committee: SC రైతు దీక్షలపై 'సుప్రీం' అందోళన.. కమిటీ వేయాలని యోచన..

Your negotiation does not work apparently we will form a committee supreme court

India, Farmers, Supreme Court to form committee to resolve farmers protest, Agriculture sector, Corporates, minimum support price, Fertility, Agri products, political parties, Politics, singhu Farmers protest, corporates in Agri sector, farmers protest central bill, farmers produce trade and commerce, farmers empowerment and protection bill, farmers price assurance, farmers farm services act, farmers essential commodities, congress, national congress, political parties, Politics

The Supreme Court indicated that a Committee, including members of farmers organisations, may be formed to resolve the deadlock to end farmers protests. The observation was made by a Bench headed by CJI SA Bobde while hearing a batch of PILs seeking removal of farmers protesting at Delhi borders against the three Farmers Acts.

రైతు దీక్షలపై ‘సుప్రీం’ అందోళన.. కమిటీ వేయాలని యోచన..

Posted: 12/16/2020 11:25 PM IST
Your negotiation does not work apparently we will form a committee supreme court

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు గత ఇరవై ఒక్క రోజులుగా ఢిల్లీలోని శివారు సింఘు, టిక్రీ ప్రాంతంలో నిరసన చేపడుతున్న నేపథ్యంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అందోళన వ్యక్తం చేసింది. రైతుల నిరసనలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం అవుతుందని.. ఈ నేపథ్యంలో రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ఒక కమిటీని వేయాలని యోచనలో వున్నట్లు తెలిపింది. రైతులు సాగిస్తున్న ఆందోళనలతో సామాన్య ప్రజల జీవనానికి ఇబ్బందులు కలిగిస్తుందని తక్షణమే వారిని ఖాళీ చేయించాలంటూ రిషబ్ శర్మ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటీషన్ పై న్యాయస్థానం విచారించింది.

దీంతో పాటు రైతు సంఘాలు సాగిస్తున్న పోరాటం నేపథ్యంలోనూ వారికి మద్దుతుగా అనేక పిటీషన్లు దాఖలయ్యాయి. వీటిపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌.ఎ. బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తూ కేంద్రం వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘చట్టాలు తమకు వ్యతిరేకంగా ఉన్నాయని రైతులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై మీరు(కేంద్రం) విశాల దృక్పథంతో చర్చలు జరపనంతవరకూ అవి విఫలమవుతూనే ఉంటాయి’ అని ధర్మాసనం అభిప్రాయపడింది. రైతులతో కేంద్రం చర్చలు ఫలించేలా కన్పించట్లేదని, త్వరలోనే ఇది జాతీయ సమస్యగా మారే అవకాశముందని జస్టిస్‌ బోబ్డే అన్నారు. అందుకే వివాద పరిష్కారం కోసం తామే ఓ కమిటీని ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలిపారు.

రైతు సంఘాలు, ప్రభుత్వ ప్రతినిధులతో ఈ కమిటీని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు న్యాయస్థానం యోచిస్తుందని తెలిపింది. కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని న్యాయస్థానానికి తెలిపారు. ఇదిలా ఉండగా.. ఆందోళన చేస్తున్న రైతు సంఘాలను పార్టీలుగా ఇంప్లీడ్‌ చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాలకు నోటీసులు జారీ చేసింది. దీనిపై రేపటిలోగా సమాధానం చెప్పాలన్న ధర్మాసనం.. విచారణను గురువారానికి వాయిదా వేసింది. రైతుల ఆందోళనపై అన్ని పిటిషన్లను ఓకేసారి విచారిస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh