Distribute voter slips by 27th Nov: SEC to GHMC offcials ఓటేసిన బ్యాలెట్ పేపర్ ఫోటో తీస్తే మూడేళ్ల జైలు: ఎస్ఈసీ

Sec asks ghmc authorities to supply 100 percent voter slips for higher polling

State Election Commission, GHMC Polling Officers, GHMC elections, civic body officials, voter slips supply, polling percentage, ballot paper, Hyderabad, Telangana, Politics

The SEC has asked GHMC authorities to supply 100% voter slips to the electorate by 25th and make an employee responsible for a ward to look after the distribution of voter slips. Since lack of their supply was found to be the main reason for the low poll percentage in 2009 (42.04%) and 2016 (45.29%) elections to the civic body.

ఓటేసిన బ్యాలెట్ పేపర్ ఫోటో తీస్తే మూడేళ్ల జైలు: ఎస్ఈసీ

Posted: 11/28/2020 11:47 PM IST
Sec asks ghmc authorities to supply 100 percent voter slips for higher polling

(Image source from: ythisnews.com)

జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఓటింగ్ శాతం మెరుగయ్యేందుకు పలు చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ఎన్నికల సంఘం అదే సమయంలో గతంలో ఓటర్లు చేసిన తప్పిదాలను కూడా పరిగణలోకి తీసుకుని కఠిన నిబంధనలను, శిక్షలను ఈ సారి ఎన్నికలలో అమలుపరుస్తామని హెచ్చరించింది. రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కొందరు బ్యాలెట్ పత్రాలను ఫోటోలు తీసి.. వాటిని సామాజిక మాద్యామాల్లో పోస్టు చేసిన సందర్భాలు ఈ ఎన్నికలలో పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ చర్యల్లో భాగంగా ఎన్నికల కేంద్రంలోకి సెల్ ఫోన్లను అనుమతించరాదని ఈ మేరకు పోలింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.

సీక్రెట్ బ్యాలెట్ విషయంలోని గోపత్యను ఎవరైన ఉల్లంఘనకు పాల్పడితే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలకు ఉపక్రమిస్తామని తెలిపారు, ఓటు వేసిన బ్యాలెట్ పత్రాన్ని ఫోటో తీసి దానిని గోప్యతను బయటపెట్టిన వ్యక్తలకు మూడు నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల సంఘం వార్నింగ్ ఇచ్చింది. ఓటు వేసిన తరువాత ఓటరు కూడా బ్యాలెట్ పత్రాన్ని ఎవరికీ చూపకుండా బ్యాలెట్ బాక్సులలో వేయాలని సూచించింది. మరోవైపు ఎన్నికల విధుల్లో పాల్గోనే అధికారులు, సిబ్బందితో పాటు అభ్యర్థుల ఏజెంట్లు పూర్తిస్థాయిలో గోప్యత పాటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది, ఎన్నికల విధుల్లో గోప్యత విషయమై రాష్ట్ర ఎన్నికల సంఘం జీహెచ్ఎంసీ అధికారులకు పలు అదేశాలు జారీ చేసింది.

ఇక గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి ఓటరు స్లిప్పుల పంఫిణీని ఈ నెల 25లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారులను అదేశించింది. ఓటరు స్లిప్పుల పంఫిణీ కార్యక్రమం సంపూర్ణంగా జరగకపోవడం కారణంగా 2009, 2016 జీహెచ్ఎంసీ ఎన్నికలలో పోలింగ్ శాతం 50శాతానికి మించలేదని పేర్కోంది, ఈ సారి ఓటింగ్ శాతం పెరిగేలా జీహెచ్ఎంసీ పోలింగ్ అధికారులు నూటికి నూరు శాతం పోలింగ్ స్లిప్సులు పంచాలని ఎస్ఈసీ అదేశించింది. ఈ పంపిణీల సక్రమంగా జరుగుతుందా లేదా.? అన్న విషయాలను డిఫ్యూటీ కమీషనర్లెు, జోనల్ కమీషనర్లు పరిశీలించాలని అదేశించింది. ప్రతీ వార్డులో ఒక ఉద్యోగిని పంఫిణీ బాధ్యతలను అప్పగించాలని అదేశించింది. ఎవరికైనా ఓటరు స్లిప్పులు రాలేదని తేలితే వాటిని త్వరలోనే అందజేయాలని ఎన్నికల సంఘం సూచించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles