Mother rat chases away snake to protect baby బిడ్డ ప్రాణం కోసం.. కన్నతల్లి విరోచిత పోరాటం.. నెట్టింట్లో వైరల్

Mother rat chases away snake to protect baby video goes viral

Snake Chased By Rat, Rat Chases Snake Video, Snake Rat Viral Video, Rat Snake Fight Video, Rat Snake Viral Video, baby rat, chases, mother rat, protect, rat, snake, Video viral

In a video that has been widely shared on the microblogging site Twitter, a mother rat is seen attacking and giving chase to a snake. At first it looks like an ordinary fight between the two animals. Until the viewer realises that the rodent was fighting the reptile to protect its little one.

బిడ్డ ప్రాణం కోసం.. కన్నతల్లి విరోచిత పోరాటం.. నెట్టింట్లో వైరల్

Posted: 11/28/2020 03:17 PM IST
Mother rat chases away snake to protect baby video goes viral

కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోసం అన్న నానుడిని ప్రతీ ఒక్కరు వినేవుంటారు. అయితే ఇక్క మూడో వ్యక్తి చెబుతున్న నానుడి ఇది. కానీ అదే మూడో వ్యక్తి పాము నోట కరుచుకుపోయిన కప్ప తల్లే అయితే ఏం చేసేది. అన్నది ఈ ఘటన. తల్లి ఎంత చిన్నది అయినా.. తన బిడ్డ ఆపదలో చిక్కుకుంది అంటే కచ్చితంగా విరోచితంగా పోరాడి తన బిడ్డను రక్షించుకుంటోంది. మొన్నామధ్య తన బిడ్డ వున్న చోటుకు ఓ పులి చేరుకోవడంతో.. ఆ బిడ్డ తల్లైన ఆదివాసి ఆడపడచు.. తనదైన సాహసంతో పులిని తరమేసి తన బిడ్డను రక్షించుకున్న ఘటన పశ్చిమ బెంగాల్ లో జరిగింది. ఇక మనుషులు మాత్రమే కాదు జంతువులు కూడా తమ బిడ్డలను ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటాయన్న విషయం తెలిసిందే.

మొన్నామధ్య ఏనుగు కూడా తమ బిడ్డను పులి నుంచి ఎంతో చాకచక్యంగా రక్షించుకున్న ఘటనను చూశాం. తన బిడ్డకు ఎక్కడ అపద తలపెడుతుందోనని గ్రహించిన తల్లి ఏనుగు పులిని వెంటాడి వెంటాడి తరిమింది. అయితే ఏనుగులు, మనుషులే కాదు.. అవసరమైతే చిట్టి ఎలుక తల్లి కూడా తన బిడ్డను శత్రువుల నుంచి కాపాడుకోవడంతో వీరోచితంగా నిలుస్తాయని ఈ ఘటన మరోమారు చాటిచెబుతోంది, కడుపు నింపుకోవాలన్న ఉద్దేశంతో ఓ పాము ఎలుక పిల్లను తినేందుకు ప్రయత్నించి దానిని నోట కరుచుకుని పోదల్లోకి దూసుకెళ్ల సాగింది. అంతే ఈ దృశ్యం ఎలుక తల్లి కంటపడింది. ఒక్కసారిగా హతుశురాలైన తల్లి ఎలుక.. పాముతో పోరాటం సాగించింది.

పాము వేగాన్ని, మెలి తిరగడాన్ని కూడా పెద్దగా పట్టించుకోని తల్లి ఎలుక ప్రాణాలకు తెగించి పాముతో పోరాడసాగింది. పాము తోకను టార్గెట్ గా చేసుకుని దానిని తన పంటితో కొరకడం ప్రారంభించింది. అయినా పాము ఎలుక పిల్లను నోట కరుచుకుని మరింత వేగంగా ముందుకు సాగగా, ఎలుక మాత్రం తన పోరాటాన్ని కోనసాగించింది. దీంతో పాము తన నోట్లోని చిట్టి ఎలుకను జారవిడిచి పొదల్లోకి పారిపోయింది. అయినా ఎలుక మాత్రం పాము తోకను టార్గెట్ చేస్తూనే పోదల్లోకి వెళ్లింది. ఇక చిట్టచివరకు తిరిగి తన చిట్టి ఎలుక వద్దకు వచ్చిన తల్లి ఎలుక,, తన బిడ్డను నోట కరచుకుని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లింది, పామును సైతం ఎదురించిన ఎలుక తీరు మాతృత్వ స్ఫూర్తిని చాటుతుంది. దీని తాలూకు వీడియోను సుషాంత్ నందా అనే అటవీశాఖ అధికారి సోషల్ మీడియాలో పంచుకోగా, నెటిజన్ల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles