Telugu states to witness rains in next three days తెలుగు రాష్ట్రాలను హడలెత్తించే వార్త.. రానున్న మూడు రోజులూ వర్షాలు..

Weather update telugu states to witness rains in next three days

rain in telangana, rain in hyderabad, rain in amarvati, rain in andhra pradesh, surface periodicity in Bay of Bengal, IMD, weather department, Rain, Telangana, Andhra Pradesh

With the surface periodicity continues from the southeastern Bay of Bengal to the southwestern Bay of Bengal, the weather department has predicted rains in two Telugu states for the next three days.

తెలుగు రాష్ట్రాలను హడలెత్తించే వార్త.. రానున్న మూడు రోజులూ వర్షాలు..

Posted: 11/05/2020 04:16 PM IST
Weather update telugu states to witness rains in next three days

తెలుగు రాష్ట్రాలపై ఇప్పటికే వరుణుడు పగబట్టాడు. ఈ తరుణంలో వర్షం పేరు చెబితేనే తెలుగు రాష్ట్రాల ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఇప్పటికే గత నెలలో కురిసిన వర్షం తెలుగు రాష్ట్రాలలోని అనేక ప్రాంతాలు జలదిగ్భంధమయ్యాయి. పలు కాలనీలు, ముంపు ప్రాంతాలు నీటమునిగాయి. జనజీవనం స్థంభించింది. ఇక పలు చోట్ల వరుణుడు శాంతించినా.. నీరు వెళ్లేందుకు మార్గంలేక అనేక మంది ప్రజలు వరద నీటిలోనే ఐదు రోజుల నుంచి వారం రోజుల వరకు ఉండిపోవాల్సి వచ్చింది. వరద నీరు నేపథ్యంలో ఆదుకోవాల్సిన అధికార యంత్రాంగం కూడా ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించాయే తప్ప.. ముంపులో వున్నవారి బాధలను తీర్చలేకపోయింది.

వర్షం మిగిల్చిన గాయం నుంచి.. ప్రభుత్వాలు అందిస్తానన్న పరిహారం కోసం ఇప్పటికే పలు గడపలను ఎక్కి దిగుతున్న బాధితులు మరోమారు హడలెత్తిపోయే వార్తను భారతీయ వాతావరణ శాఖ వెలువరించింది. వర్షం నుంచి కొంత యడతెరపి పొంది ప్రజాజీవనం గాడిన పడుతున్న వేళ మరోమారు రానున్న మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కోంది. అగ్నేయ బంగాళాఖాతం నుంచి నైరుతి బంగళాఖాతం వరకు ఆవరించిన ఉపరితల అవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

శ్రీలంక తీరానికి సమీపంలో 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉందని, ఇది తమిళనాడు వరకూ విస్తరించి, భారీ ఆవర్తనంగా మారిందని తెలిపారు. ఈ ఆవర్తనం ప్రభావంతో 8వ తేదీ వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు. కాగా, నిన్న ఉదయం నుంచి ఈ తెల్లవారుజాము వరకూ ప్రకాశం, చిత్తూరు, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిశాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles