'Act of terror': 22 killed in Kabul University attack కాబుల్ యూనివర్సిటీలో ఇస్లామిక్ ఉగ్రసంస్థ మారణహోమం

Gunmen kill more than a dozen students in attack on kabul university

Kabul University, students killed, students attacked, university attacked, suicide bomber, gunmen, Islamic State of Iraq and Levant, ISIL, ISIS, Ashraf Ghani, Afghanistan

At least 22 people were killed and 22 other wounded when gunmen stormed Kabul University in a brutal, hours-long assault that saw students left in pools of blood in their classrooms. The attack in Afghanistan’s capital, claimed by the the Islamic State of Iraq and Levant (ISIL, ISIS) group, came as violence surged across the country.

కాబుల్ యూనివర్సిటీలో ఇస్లామిక్ ఉగ్రసంస్థ మారణహోమం

Posted: 11/03/2020 06:29 PM IST
Gunmen kill more than a dozen students in attack on kabul university

ఆఫ్ఘనిస్థాన్‌ లో నెల రోజుల వ్యవధిలో ఉగ్రవాదులు తమ చెలరేగిపోయి అమాయక విద్యార్ధుల ప్రాణాలను టార్గెట్ చేస్తున్నారు, ఓ వైపు ఆత్మహుతి దళాలతో భయాందోళనకు గురిచేసి మరోవైపు సాయుధులైన ముష్కరులు విశ్వవిద్యాలయాల్లోకి చోరబడి విద్యార్థులపై తూటాల వర్షం కురిపించారు. అప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లోని కాబూల్ యూనివర్సిటీలో ఉగ్రవాదులు దారుణ మారణహోమానికి పాల్పడ్డారు, దేశంలోనే అతిపెద్దదైన విశ్వవిద్యాలయంలో రక్తపుటేర్లు పారడంలో అనేక మంది విద్యార్థులకు భయకంపితులయ్యారు, పలువురు విద్యార్థులు ప్రాణాలను చేతబట్టుకుని యూనివర్సిటీ ప్రహరీగోడలను దూకి వెళ్లిపోయారు, అయినా ఈ ఘటనలో ఏకంగా 22 మంది అమాయక విద్యార్ధుల ప్రాణాలను ఉగ్రవాదులు బలితీసుకున్నారు.

కాబూల్ యూనివర్సిటీలో నిన్న నిర్వహించిన మారణహోమానికి తాము బాధ్యత వహిస్తున్నట్లు ఇస్లామిక్ స్టేట్ అప్ ఇరాక్ అండ్ లివట్ సహా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలు ప్రకటించుకున్నాయి, యూనివర్సిటీలో పుస్తక ప్రదర్శనకు ఆఫ్ఘనిస్థాన్ లోని ఇరాన్ రాయబారి బహదూర్ అమినియన్, సాంస్కృతిక దౌత్యవేత్త మొజ్తాబా నొరూజితోపాటు పలువురు ప్రముఖులు హాజరు కాబోతున్న సమాచారం తెలుసుకున్న ఉగ్రవాదులు ఈ మారణహోమానికి పాల్పడ్డారు. దీంతో ముందుగా ఉగ్రవాద సంస్థలకు చెందిన ఆత్మహుతి దళాల సభ్యులు విశ్వవిద్యాలయంలోకి ప్రవేశించి.. తమను తాము పేల్చుకున్నారు, ఆ వెంటనే అత్యాధునిక తుపాకులతో యూనివర్సిటీలోకి ప్రవేశించిన ముగ్గురు ఉగ్రవాదులు విద్యార్థులపైకి తూటాల వర్షం కురిపించారు. ఏం జరుగుతోందో తెలిసే లోపే 22 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

ఉగ్రవాదుల నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి విద్యార్థులు పరుగులు తీశారు. పలువరు ప్రహరీ గోడలను ఎక్కి దూకారు, సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా దళాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఇరు వర్గాల మధ్య దాదాపు 5 గంటలపాటు కాల్పులు కొనసాగాయి. దీంతో తుపాకులు, గ్రనేడ్ల మోతతో యూనివర్సిటీ దద్దరిల్లిపోయింది. భద్రతా దళాల కాల్పుల్లో ఉగ్రవాదులు ముగ్గురూ హతమయ్యారు. మరికొందరు మాత్రం తమ తరగతి గదుల్లోనే నక్కారు, బధ్రతా దళాల వచ్చి రక్షించే వరకు అక్కడే ప్రాణాలను గుప్పిట్టో పెట్టుకుని భయంభయంగా గడిపాయని విద్యార్థులు తెలిపారు, యూనివర్సిటీలో ఉగ్రఘటనను భారత ప్రధాని నరేంద్రమోదీ తీవ్రంగా ఖండించారు. దీనిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఉగ్రవాదంపై పోరులో ఆఫ్ఘనిస్థాన్ కు భారత్ సాయం కొనసాగుతుందని హామీ ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles