Schools re-opened in Andhra Pradesh amid coronavirus spread ఏపీలో తెరుచుకున్న పాఠశాలలు.. అంతంతమాత్రంగానే హాజరైన విద్యార్థులు

Schools re opened in andhra pradesh amid coronavirus spread

covid-19, coronavirus, coronavirus in india, coronavirus in ap, covid-19 in ap, coronavirus updates, coronavirus pandemic, fight against coronavirus, schools re-opened, ap schools, school students, physical distance, sanitizers, masks, coronavirus andhra pradesh, coronavirus updates

Andhra Pradesh schools reopened today after many days following the COVID-19 guidelines. Andhra Pradesh government asked the parents of the students not to worry over the safety of the children and asserted that safety precautions will be followed in every school.

ఏపీలో తెరుచుకున్న పాఠశాలలు.. అంతంతమాత్రంగానే హాజరైన విద్యార్థులు

Posted: 11/02/2020 09:54 PM IST
Schools re opened in andhra pradesh amid coronavirus spread

(Image source from: Twitter.com/ANI)

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ మహమ్మారి తగ్గుముఖం పడుతున్నా.. యావత్ ప్రపంచవ్యాప్తంగా మాత్రం కరోనా వైరస్ మమమ్మారి రెండో ఉద్దృతిని కొనసాగిస్తోంది. దీంతో మన దేశంలోనూ ఎలాంటి విపత్కర ప్రభావం చూపుతుందా.. అని యావత్ దేశ ప్రజలు అందోళనకు గురువుతున్నారు. ఈ ఏడాది ఆరంభంలో పలు దేశాలు లాక్ అవుట్ ప్రకటించినట్టుగానే ఇక ఇప్పుడు కూడా తాజాగా అవే ఆంక్షల దిశగా కొనసాగుతున్నాయి. అయితే మన దేశంలో మాత్రం ఇంకా అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాలేదు. దీంతో దేశ ప్రజలు కాసింత ధైర్యంగా వున్నా.. నిగూఢంగా మాత్రం ఏ క్షణంలో ఎలాంటి ఉత్పాతాలు సంభవిస్తాయోనన్న భయం మాత్రం నెలకొనివుంది. అయితే ప్రస్తుతం పరిణామాల నేపథ్యంలో విజృంభన స్తాయి నుంచి తగ్గుముఖం పట్టిన స్థాయి కొనసాగుతోంది.

అయితే నవంబర్ 2వ తేదీ నుంచి రాష్ట్రంలో విద్యాసంస్థలను తెరుస్తున్నామని ముందునుంచీ చెబుతూ వస్తున్న ప్రభుత్వం ఇవాళ్టి నుంచి పాఠశాలలను తెరచి విద్యార్థులకు తరగతులను నిర్వహించింది, దేశవ్యాప్తంగా అన్ లాక్ 5.0 మార్గదర్శకాలు మరో నెల రోజుల పాటు అమల్లో వుంటాయని కేంద్ర హొం మంత్రిత్వ శాఖ ఇటీవలే అదేశాలు జారీ చేసి.. దేశంలోని పాఠశాలలు, విద్యాసంస్థలు, కాలేజీలన్నీ నవంబర్ 30 ఇవే మార్గదర్శకాలు అమలు చేయాలని అదేశాలను వెలువరించినా.. వాటిని తోసిపుచ్చిన ఆంధ్రప్రదేశ్ రాస్ట్ర ప్రభుత్వం మాత్రం నవంబర్ 2 నుంచి పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలను తెరుస్తామని ప్రకటించినట్లుగానే ఇవాళ విద్యాలయాలను తెరచింది.

గత ఏడాది విద్యార్ధులను ఏలాంటి పరీక్షలు లేకుండా పై తరగతులకు ప్రమోట్  చేసిన ప్రభుత్వం.. ఈ విద్యాసంవత్సంలో మాత్రం ఖచ్చితంగా 180 రోజుల పాటు తరగతులను నిర్వహించాలని నిర్ణయించింది. అందుకు పలు మార్గదర్శకాలను కూడా ఇప్పటికే విడుదల చేసింది. ఏప్రిల్ 30 వరకు విద్యార్థులకు తరగతులను నిర్వహించాలని వాటిలో 144 పనిదినాలతో పాటు 36 సెలవు దినాలు కూడా వున్నాయి, సెలవు దినాల్లో ఉపాధ్యాయల పర్యవేక్షణలో ఇళ్ల వద్ద విద్యార్థులు చదవుకునేలా చూడాలని నిర్ణయింది. నవంబర్ నెల రోజులు మాత్రం మద్యాహ్నం వరకు పాఠశాలల్లో తరగతులను నిర్వహించి.. ఆ తరువాత పరిస్థితులను బట్టి స్కూళ్ల సమయాలను పొడిగించే విషయాన్ని పరిశీలించనున్నారు. కాగా తొలి రోజు పాఠశాలలకు మాత్రం కొద్దిపాటి సంఖ్యలోనే విద్యార్థులు హాజరయ్యారని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles