'Our success in Pulwama': Pak minister admits role in terror attack పూల్వమా దాడిని నిసిగ్గుగా గొప్పని చెప్పుకున్న పాక్..

Pakistan minister fawad hussain chaudhry claims pulwama terror attack a success of their government

pak minister pulwama attack, pak minister pakistan assembly pulwama attack mention, pakistan pulwama attack role, pulwama attack, imran khan, Chaudhry Fawad Hussain, pakistan minister claims pulwama attack, pulawama terror attack

In a sensational admission, a senior Pakistani minister on Thursday admitted that Pakistan was responsible for the deadly Pulwama terrorist attack in Jammu and Kashmir in 2019 that brought the two countries to the brink of a war.

ITEMVIDEOS: పార్లమెంటులో తన్నుకోచ్చిన నిజం.. బయటపెట్టిన పాక్ మంత్రి.. ఆనక వెనక్కు..

Posted: 10/30/2020 04:08 PM IST
Pakistan minister fawad hussain chaudhry claims pulwama terror attack a success of their government

యావత్ ప్రపంచం ముక్తకంఠంతో ఖండించిన ఉగ్రదాడి అది. గతేడాది ఫిబ్రవరి 14న కశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందడం పట్ల దేశవిదేశాలు వారికి సానుభూతి తెలిపి.. భారత్ పక్షాన నిలిచాయి. జమ్మూకాశ్మీర్ లోని పూల్వమా మీదుగా అక్కడి మిలటరీ బేస్ కేంద్రాలకు వెళ్తున్న జవాన్లపై మందుగుండు నింపుకున్న అటో వచ్చి ఢీకొనడంతో దాడి జరుగగా.. అ వెంటనే కిందకు దిగిన జవాన్లపై తుటాల వర్షం కురిపించిన ముష్కరులు భారత జవాన్లు తేరుకుని ఎదురుకాల్పులకు దిగే లోపు పరారైన విషయం తెలిసిందే.

ఆ దాడితో యావత్ భారతం రగిలిపోయింది. అయితే ఇది పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల పనేనని యావత్ భారత్ అరోపించింది. అయితే పాకిస్థాన్ మాత్రం ఈ అరోపణలను అప్పట్లో తీవ్రంగా ఖండించింది. అయితే భారత్ చేసిన అరోపణలు నిజమని.. వాటిలో ఏ మాత్రం అభ్యంతరాలు లేవని సాక్ష్యాత్తు పాకిస్థాన్ శాస్త్రసాంకేతిక శాఖ మంత్రి ఫవాద్ హుస్సేన్ చౌదరి అదేశ పార్టమొంటులోనే నిసిగ్గుగా దొంగదెబ్బ తీయడం కూడా తమ గోప్పగా చెప్పుకోచ్చారు. ఈ దాడి పాక్ ప్రోద్బలిత దాడి అని అది పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రోద్బలంతోనే జరిగాయని కూడా చెప్పుకోవడం దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి.

పాక్ ప్రభుత్వంపై అక్కడి విపక్షాలు సంధించిన ప్రశ్నలతో విస్తుపోయిన అధికార పక్షం తరపున పార్లమెంటులో తమ గొప్పులు చెప్పుకోచ్చిన మంత్రి.. ఏకంగా హిందుస్తాన్ లోని పూల్వామాలో జరిగిన దాడిని తమ గోప్పగా పేర్కోన్నారు. హిందుస్తాన్ లోకి చోరబడి వారి సొంతగడ్డపైనే వారి సైన్యాన్ని దారుణంగా దెబ్బకొట్టామని, ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలో సాధించిన ఈ విజయం పాక్ ప్రజల విజయం అని అభివర్ణించారు. ఇది యావత్ పాకిస్థాన్ విజయమని ఇందులో ప్రతీ పాకిస్తానీయుడికి భాగస్వామ్యం ఉందని గొప్పలకు పోయారు, ఈ వ్యాఖ్యలను కొందరు పార్లమెంటు సభ్యులు బల్లలు చరుస్తూ హర్షం వ్యక్తం చేశారు.

ఫవాద్ చౌదరి వ్యాఖ్యల వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. దీంతో యావత్ ప్రపంచానికి పాకిస్తాన్ నిజస్వరూపం అర్థమైంది. వెంటనే పాకిస్థాన్ దిద్దుబాటు చర్యలకు దిగింది. తాను మాట్లాడింది పుల్వామా ఉగ్రదాడి తరువాత భారత్ తో జరిగిన వైమానిక దాడి గురించేనని ఫవాద్ చైదరి చెప్పారు. అమాయకులను చంపి తాము ధైర్యవంతులం అని చెప్పుకోవాల్సిన పని తమకు లేదని అన్నారు. ఉగ్రవాదానికి తాము ముందు నుంచి వ్యతిరేకమే అని చెప్పారు. తన మాటలను భారత మీడియా వక్రీకరించిందని అన్నారు. పుల్వామా దాడి చేయించింది పాకిస్థానే అని తాను అనలేదని చెప్పారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles