Doctor In Maharashtra Treat Covid patients for free 87 ఏళ్ల హోమియో వైద్యుడు.. నిజంగా నారాయణుడే..!

87 year old doctor in maharashtra braves covid 19 to treat villagers

Covid-19, coronavirus, SARS-CoV2, Covid infections, Covid symptoms, Maharashtra Doctor, Maharashtra Chandrapur district, Villagers, Homeopathy, Ayurveda, Coronavirus cases India, Maharashtra Doctor, Ramchandra Dandekar, Homeopathy doctor, Ayurveda doctor, Mul, Pombhurna, Ballarshah, Chandrapur district, Maharashtra

An 87-year-old from Mul in Maharashtra's Chandrapur district has been going out of his way to attend to his patients in remote villages. With only his bicycle for company, Ramchandra Dandekar has been travelling barefoot for at least 10 km every day to villages in Mul, Pombhurna and Ballarshah talukas for the last 60 years, providing free doorstep treatment to people.

87 ఏళ్ల హోమియో వైద్యుడు.. నిజంగా నారాయణుడే..!

Posted: 10/23/2020 09:52 PM IST
87 year old doctor in maharashtra braves covid 19 to treat villagers

(Image source from: Twitter.com/ANI)

యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ మహమ్మారి.. దేశ అర్థిక రాజధాని ముంబై సహా మహారాష్ట్రలోనే అత్యధికంగా జడలు విప్పుతూ ప్రజల ప్రాణాలను కూడా బలితీసుకుంటోంది. ఈ క్రమంలో సాదారణ వ్యాధుల బారిన పడిన రోగులకు చికిత్స చేసేందుకు దేశంలోని ప్రముఖ నగరాలతో పాటు పట్టణాల్లో శాఖోపశాఖలుగా వెలసిన కార్పోరేట్ ఆసుపత్రులే ముందుకు రావడం లేదు. ఒకవేళ వచ్చినా ముందు డబ్బును డిపాజిట్ చేసిన తరువాత మాత్రమే చికి్త్స చేస్తున్నారు. అటు కరోనా వైరస్ బారిన పడిన వారిని కూడా కరోనా సోకిందని.,. పేషంట్ ను చూడటానికి వీలు లేదని చెప్పి.. వారి అరోగ్యాన్ని అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా ధన దోపిడికి పాల్పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటూనే వున్నాయి.

ప్రజలు వైద్యుడ్ని నారాయణుడితో పోల్చుతున్నా.. తాము మాత్రం ధనం మూలమ్ ఇదం జగత్ అన్న సూక్తినే ఫాలో అవుతున్నారు కార్పోరేట్, ప్రైవేటు అసుపత్రుల వైద్యులు. అయితే సమాజంలో వైద్యం అందరికీ అందాలని కొందరు డాక్టర్లు చేస్తున్న ప్రయత్నాలు యావత్ వైద్యలోకానికే ప్రశంసలు అందేలా చేస్తున్నాయి. ఇప్పటికే చెన్నైలో ఐదు రూపాయల డాక్టర్ గురించి.. తెలిసినట్టుగానే దేశంలోని పలు ప్రాంతాల్లో అయుర్వేద వైద్యులు, హోమియో వైద్యులు, ఆర్ఎంపీ వైద్యుల సేవలు, ఎంబిబిఎస్ డాక్టర్లు అందిస్తున్న సేవలకు ప్రశంసలు అందుకుంటూనే వున్నారు. ఈ తరహాలోనే మహారాష్ట్రలోని రామచంద్ర దండేకర్ అనే వైద్యుడ్ని స్థానిక ప్రజలు నిజమైన నారాయణుడిగానే అభివర్ణిస్తున్నారు.

కోవిడ్ నిబంధనలు అమలులో వున్న నేపథ్యంలో అరవై ఏళ్లు పైబడిన వ్యక్తులు బయటకు రావద్దని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా.. 87 ఏళ్ల వైద్యుడు మాత్రం తన సైకిల్ పై ఏకంగా పది కిలోమీటర్ల దూరం తొక్కుకుంటూ అక్కడి గ్రామాల్లోని పేద ప్రజల ఇళ్లకు వెళ్లి మరీ వైద్యం అందిస్తున్నారు. అయితే ఇంత దూరం సైకిల్ పై వచ్చి వైద్యం అందిస్తూ ఏమి అర్జిస్తున్నాడంటే.. ఈ వైద్యాన్ని ఆయన ఉచితంగానే అందిస్తున్నారు. ఇవాళ కొత్తగా కాదు ఏకంగా ఆరు దశాబ్దాలుగా ఆయన ఇదే తరహాలో స్థానిక ప్రజలకు వైద్యం అందిస్తున్నారు. మహారాష్ట్రంలోని చంద్రపూర్ జిల్లాకు చెందిన రామచంద్ర దండేకర్ ను అందరూ ‘‘డాక్టర్ సాబ్ ముల్ వాలే’’ అని పిలుస్తూంటారు.

1957-58లో నాగ్‌పూర్ కాలేజ్ ఆఫ్ హోమియోపతి నుండి డిప్లొమా పూర్తి చేసిన తరువాత, రామచంద్ర దండేకర్ చంద్రపూర్ హోమియోపతి కళాశాలలో లెక్చరర్ గా ఒక సంవత్సరం పనిచేశారు, ఆ తరువాత ఆయన తన వైద్య సేవలను గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అందించాలని నిర్ణయం తీసుకున్నారు, అయితే తన వైద్యానికి రోగులు నుంచి డబ్బులు తీసుకోని ఆయన.. వారు తన కోసం వచ్చేలా కాకుండా వారి కోసం ఆయనే గ్రామాలకు వెళ్లి సేవలందిస్తుంటారు, ‘‘నా దినచర్య మునుపటిలాగే ఉంది. గ్రామాల్లోని పేదలకు నిస్వార్థ సేవలను అందించడం కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను ”అని ఆయనను కలిసిన మీడియాతో అన్నారు.

కాగా, తన తండ్రి పేదలకు అందిస్తున్న ఉచిత వైద్య సేవలకు ఎంతో గర్వంగా ఉందని రామచంద్ర దండేకర్ పెద్ద కుమారుడు జయంత్ దండేకర్ అన్నారు, వారాంతపు రోజులలో గ్రామాలను సందర్శించడానికి ఈ పెద్దాయన ఒక నిర్ణీత టైమ్ టేబుల్ పాటిస్తాడని తెలిపాడు. అయితే గ్రామాల పర్యటనకు వెళ్లిన సమయంలో ఆయన తనతో సెల్ ఫోన్, కానీ చేతి గడియారం కానీ పెట్టుకెళ్లరని చెప్పాడు, కేవలం వైద్య సామగ్రితో పాటు మందులను మాత్రమే తీసుకువెళతాడని దూరంగా వున్న ప్రాంతాలకు బస్సులో వెళ్లి అక్కడ గ్రామాల్లో ఉంచిన సూకిళ్లపై ఇళ్లను సందర్శిస్తాడు. అక్కడి రోగుల చికిత్సలో ఆలస్యం అయితే అదే గ్రామంలో ఎవరో ఒకరి ఇంట్లో వుండి మరుసటి రోజు ఇంటికి వస్తారని చెప్పారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles