YCP MP Raju alleges own party people on social media posts దుష్ప్రచారానికి దిగుతున్న సోంత పార్టీ నేతలు: వైసీపీ ఎంపీ

Ysrcp rebel mp raju alleges ycp party people on social media posts

Raghurama Krishnaraju, Narsapuram MP, Amaravati, Capital issue, social media, YSPCP people, YSRCP top leader, Delhi tour, Bapatla MP, Andhra Pradesh, Politics

YSRCP MP Kanumuru Raghu Ramakrishna Raju alleges his own YSRCP party people on missing posts in social media against him. He also alleges that these people are provojing him to get arrested by the Andhra pradesh Police.

నెట్టింట్లో తనపై పోస్టులు.. సొంతపార్టీ నేతల పనే: ఎంపీ రాఘురామకృష్ణరాజు

Posted: 10/20/2020 10:26 AM IST
Ysrcp rebel mp raju alleges ycp party people on social media posts

(Image source from: Tupaki.com)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు సంధిస్తున్న ఆ పార్టీ రెబల్ నాయకుడిగా మారిన నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు తన సొంత పార్టీపై కామెంట్లు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే నిత్యం ఏదో ఒక అంశాన్ని అసరాగా చేసుకుని రాష్ట్రం అధికార ప్రభుత్వంపై మండిపడుతున్న ఆయన.. ఇన్నాళ్లు వారు ఎదుర్కోన్న వేడిని ఆయనే అనుభవిస్తున్నారు. తన సంస్థలు బ్యాంకుల నుంచి పొందిన రుణాలను ఉద్దేశపూర్వకంగా ఎగవేసి.. నిధులు మళ్లింపుకు కారణమైయ్యారన్న అరోపణల నేపథ్యంలో సీబిఐ అధికారులు ఆయన సంస్థలతో పాటు ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్ ప్రాంతాల్లో దాడులు నిర్వహించి పలు ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు.

అప్పట్నించీ ఆచితూచి అడుగులు వేస్తున్న రఘురామకృష్ణంరాజు.. ఆ తరువాత అధికార పార్టీపై కూడా పెద్దగా విమర్శలు, అరోపణలు చేయడం లేదు. తన సంస్థలో ఏర్పడిన అగాధాన్ని పూడ్చుకునే పనిలో వున్నారు. దీంతో ఇన్నాళ్లు వైసీపీని టార్గెట్ గా చేసుకుని కామెంట్లు పెడుతన్న ఆయనపైనే నెట్టింట్లో కామెంట్లు వెలుగుచూడటంతో ఆయన విస్తుపోయారు. ఇక తాజా పరిస్థితిపై ఆయన వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ ఆయనపై ఏం వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుందో తెలుసా.? ఎన్నికల తర్వాత నుంచి రఘురామ కృష్ణంరాజు కనిపించడం లేదనేదే ఆ వార్త. ఈ మేరకు నెట్టింట్లో ఆయనపై పోస్టులు విపరీతంగా చక్కర్లు కోడుతున్నాయి.

అయితే ఈ పోస్టులపై రఘురామకృష్ణరాజు తనదైన శైలిలో స్పందించారు. ఈ పోస్టులను తమ వైసీపీ పార్టీకి చెందిన వాళ్లే పెడుతున్నారని... తన నియోజకవర్గానికి వెళ్లేలా తనను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని... అక్కడకు వెళ్లగానే తనను అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని రఘురామ చెప్పారు. తాను లెవనెత్తిన అంశాలపై జవాబులు చెప్పలేక.. ఇలా తనపై పరోక్షంగా బురదజల్లే పనులు చేస్తున్నారని అన్నారు. తన గురించి కామెంట్లు చేస్తున్న వారు ఒక పెద్ద మనిషి గురించి మాట్లాడటం లేదని అన్నారు. వ్యక్తిగత అవసరాల కోసం ఢిల్లీకి తిరుగుతూ... మిగిలిన సమయాల్లో బయటకే రాని వ్యక్తి గురించి ఎందుకు మాట్లాడటం లేదని వ్యాఖ్యానించారు. క్రిస్మస్ కి ముందే నియోజకవర్గానికి వస్తానని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles