Doctor Cheer Up Covid Patients with Dance రోగుల అహ్లాదం కోసం డాన్స్ చేసిన డాక్టర్..

Assam doctor dances to ghungroo in ppe kit to cheer up covid 19 patients

Silchar Hospital, Dancing doctor, Covid Doctor, Covid doctor, corona patients, doctor dance in hospital, social media, viral video, Assam Doctor, video viral

A doctor in Assam is winning hearts with his energetic performance to the song Ghungroo from the movie War. A video that is being widely circulated online shows Dr Arup Senapati dancing to the song while clad in a full PPE kit, apparently in a bid to cheer up COVID-19 patients at his Silchar hospital.

ITEMVIDEOS: రోగుల అహ్లాదం కోసం డాన్స్ చేసిన డాక్టర్.. నెట్టింట్లో వైరల్

Posted: 10/20/2020 09:51 AM IST
Assam doctor dances to ghungroo in ppe kit to cheer up covid 19 patients

రోగిని ప్రేమించలేని వైద్యుడు కూడా రోగితో సమానం అన్న డైలాగ్ గుర్తుందా.. శంకర్ దాదా ఎంబిబిఎస్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి చెప్పిన డైలాగ్ ఇది. అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వున్న వైద్యులు మాత్రం నిజంగా రోగులను ప్రేమిస్తూనే.. వారికి సోకిన కరోనా వైరస్ మహమ్మారి త్వరగా తగ్గిపోవాలని తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ వైద్యం అందిస్తున్నారు. వైద్యో నారాయణో హరి అన్న నానుడికి నిజమైన అర్థాన్ని చాటి చెబుతున్నారు. అయినా సందెట్లో సడేమియా అన్నట్లు కొన్ని ప్రైవేటు అసుపత్రుల తీరు మాత్రం ఎప్పటికీ మారదు. ధనం మూలమ్ ఇదం జగత్ అన్న సూక్తికే కట్టుబడిపోయి.. దానినే ఫాలో అవుతున్నాయి.

డబ్బు కోసం ప్రాణాలు పోతున్నా లెక్కచేయకుండా డబ్బిస్తేనే వైద్యం.. అన్నట్లు వ్యవహరిస్తున్నాయి. ఇక చికిత్స చేస్తున్నామన్న పేరుతో అసలేం జరుగుతుందో కూడా రోగుల బంధువులకు తెలియకుండానే లక్షల రూపాయలను లాగేస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇలాంటి వారిని చూసి అసలు వీరు వైద్యులేనా.? మనిషి ప్రాణాలకు కనీసం విలువ ఇవ్వని వీరు.. వైద్యం పేరుతో వ్యాపారం చేస్తున్నారా.? రోగులకు చికిత్స పేరుతో వారి కుటుంబసభ్యుల రక్తమాంసాలతో వ్యాపారం చేస్తారా..? కనీస మానవత్వం కూడా వీరికి ఉండదా.? అన్న ప్రశ్నలు సామాన్య ప్రజల్లో ఉత్పన్నమవుతుంది. ఇలాంటి వైద్యుల గురించి తెలిసిన సందర్భాలలో రోగులకు చికిత్స చేయడం మాత్రమే కాదు వారికి సంతోషపర్చేందుకు కూడా కొందరు వైద్యులు వెనుకాడటం లేదు.

అలాంటి వారితో అసోంకు చెందిన డాక్టర్ అరూప్ సేనాపతి ఒకరు. కోవిడ్ రోగుల సంతోషం కోసం ఆయన ఏకంగా ఆసుపత్రిలో డ్యాన్స్ చేసి అందరి ప్రశంసలు పొందారు. అసోంలోని సిల్చర్ మెడికల్ కాలేజ్ కు చెందిన ఆసుపత్రిలో ఈఎన్టీ స్పెషలిస్టుగా విదులు నిర్వహిస్తున్న డాక్టర్ అరూప్ సేనాపతి.. మనోవేదనలోకి జారుకుని రోగుల ఆరోగ్యం క్షీణిస్తుందని తెలుసుకుని వారిని సంతోషపర్చుతూ.. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేలా అహ్లాదపర్చేందుకు ఈ వినూత్న ప్రయత్నం చేశారు, ఓ వైపు రోగులకు  చికిత్స అందిస్తూనే.. మరోవైపు వారిని కోసం తాను ధరించిన పీపీఈ కిట్ తోనే డ్యాన్స్ చేశారు. 'వార్' సినిమాలోని ఘంగ్రూ పాటకు  ఆయన వేసిన స్టెప్పులు రోగుల ముఖాలలో ఆనందాన్ని నింపాయి. అరూప్ డాన్స్ చస్తన్న సమయంలో అతని సహచ వైద్యుడు ఫైజన్ అహ్మద్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇప్పటికే రెండు లక్షలకు పైగా వ్యూస్ లభించాయి. డాక్టర్ అరూప్ చేసిన పనికి నెటిజన్లు కామెంట్లు చేస్తూ ప్రశంసిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh