(Image source from: Telugurajyam.com)
రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో జరిగిన ప్రమాదాలపై కాంగ్రెస్ నేతలు ఓ వైపు పరామర్శిస్తూనే మరోవైపు కల్వకుర్తి లిప్టు పంప్ హౌజ్ వద్ద జరిగిన ప్రమాదాన్ని పరిశీలించేందుకు వెళ్లగా వారిని పోలీసులు అడ్డుకుని అనుమతి లేకుండా పరిశీలన రావడం చట్టరిత్యా నేరమంటూ అరెస్టు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని స్వయంగా అరెస్టు అయిన కాంగ్రెస్ సీనియర్ నేత రేవంత్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయడంతో విషయం సంచలనంగా మారింది. ఇక జరిగిన ప్రమాదం విషయం కూడా చర్చనీయాంశంగా మారింది. నాగర్ కర్నూల్ జిల్లా ఎల్లూరు వద్దకు చేరుకున్న రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లు రవి, సంపత్ కుమార్ లతో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కృష్ణా నది ఒడ్డున నిర్మితమైన మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథక మొదటి దశ లిఫ్టు పంపుహౌజ్ లో నిన్న సాయంత్రం ప్రమాదం సంభవించింది. నీళ్ల పంపింగ్ నడుస్తున్న సమయంలో చోటుచేసుకున్న ఈ భారీ ప్రమాదంలో మోటారు బిగించిన ఫౌండేషన్ బోల్టులు ఒక్కసారిగా ఊడిపోయాయి. దీంతో పంపుహౌస్ గోడని చీల్చుకొని ఫౌండేషన్ రాడ్లు, మోటార్ల పరికరాలు దూసుకెళ్లాయి. దీంతో సర్జిపూల్ నుంచి వరదనీరు భారీగా పంప్‌హౌస్‌లోకి చేరింది. కొన్ని నిమిషాల్లోనే పంప్‌హౌస్‌లోని 14 అంతస్తుల్లోేని పది అంతస్తుల్లోకి నీరు చేరిపోయిందంటే ప్రమాద తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మోటార్లను ఆపే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో అక్కడి సిబ్బంది ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు.
దీనిపై కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ రోజు ప్రమాద స్థలిని పరిశీలించేందుకు కొల్లాపూర్ వెళ్లిన కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, మల్లు రవి, సంపత్ కుమార్ లను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దీనిపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నిన్న శ్రీశైలం విద్యుత్ ప్లాంట్ ప్రమాదం, నేడు కల్వకుర్తి లిఫ్ట్ మునక... ప్రమాద స్థలికి ప్రతిపక్షం వెళితే ప్రభుత్వానికి ఉలుకెందుకు? ఖాకీ పహారతో నిజాన్నెందుకు దాస్తోంది. ఆలోచించు తెలంగాణమా’ అని అన్నారు.
నిన్న శ్రీశైలం విద్యుత్ ప్లాంట్ ప్రమాదం, నేడు కల్వకుర్తి లిఫ్ట్ మునక... ప్రమాద స్థలికి ప్రతిపక్షం వెళితే ప్రభుత్వానికి ఉలుకెందుకు? ఖాకీ పహార తో నిజాన్నెందుకు దాస్తోంది.
— Revanth Reddy (@revanth_anumula) October 17, 2020
ఆలోచించు తెలంగాణమా! @manickamtagore @UttamTPCC @seethakkaMLA @KVishReddy @sravandasoju @SampathKumarINC pic.twitter.com/IUyfVTKgVE
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more