Federal Bank customers can book two-wheeler at Re 1 ఖాతాదారులకు ఫెడరల్ బ్యాంకు బ్రహ్మాండమైన ఆఫర్.. రూ 1కే బైక్..

Federal bank customers can book two wheeler at re 1 pay rest via debit card emi

two-wheeler loan,two-wheeler debit card EMI,Federal Bank,Federal Bank debit card,auto loan,two-wheeler insurance,Hero MotoCorp,Honda Motorcycle,TVS Motor

Federal Bank customers can buy a two-wheeler on EMI using their debit cards. The bank customers can book their two-wheeler by paying Re 1, the lender said in a statement. The offer will be applicable at select showrooms of Hero MotoCorp, Honda Motorcycle and TVS Motor across the country. Borrowers can choose a repayment period of 3 or 6 or 9 or 12 months, the bank added.

ఖాతాదారులకు ఫెడరల్ బ్యాంకు బ్రహ్మాండమైన ఆఫర్.. రూ 1కే బైక్..

Posted: 10/16/2020 06:33 PM IST
Federal bank customers can book two wheeler at re 1 pay rest via debit card emi

రూపాయికి టీ కూడా రాదు అని సినిమా డైలాగ్ చెప్పేవారికి ఇకపై రూపాయిని కూడా తక్కువగా చూడరాదని చెప్పేందుకు ఫెడరల్ బ్యాంక్ ప్రకటించిన బ్రహ్మాండమైన ఆఫర్ చక్కటి ఉదాహరణ. ఎందుకంటారా..? రూపాయికి దాదాపు లక్ష రూపాయాల విలువ చేసే చక్కని బైక్ (ద్విచక్ర వాహనం) మీ సోంతం చేసుకోవచ్చు. కేవలం ఒకే ఒక్క రూపాయితో మీకు నచ్చిన బైక్ తొలుకుని వెళ్లిపోవచ్చు. అంటే ఒక్క రూపాయి మాత్రమే మీరు మీ జేబు నుంచి కట్టే డౌన్  పేమెంట్. అదెలా అంటారా.? త‌క్కువ ధ‌ర‌కే ద్విచక్ర వాహనాన్ని సొంతం చేసుకోవాలని చూస్తున్న వారి కోసం ఫెడరల్ బ్యాంక్ శుభవార్త చెప్పింది. కేవలం ఒక్క రూపాయికే బైక్ బుక్ చేసుకోవచ్చంటూ తన కస్టమర్లకు ఊరటనిచ్చింది. బ్యాంక్ కస్టమర్లు ఫెడరల్ డెబిట్ కార్డు ద్వారా కేవలం ఒక్క రూపాయి చెల్లించి, మిగిలిన సొమ్మును ఈఎంఐ చెల్లింపు అవకాశంతో కొనుగోలు చేయవచ్చని తెలిపింది.

దేశంలో ఎంపిక చేసిన హీరో, హోండా, టీవీఎస్ షోరూంలలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. మరోవైపు ఫెస్టివల్ ఆఫర్‌గా ఎంపిక చేసిన హోండా మోటార్ సైకిల్ షోరూంల ద్వారా డెబిట్ కార్డు ఈఎంఐతో బైక్ కొనుగోలు చేసినవారికి 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను సైతం బ్యాంక్ అందిస్తోంది. రానున్న పండుగ సీజన్, కరోనా మహమ్మారి ప్రోటోకాల్స్, కార్డ్‌ల ద్వారా ద్విచక్ర వాహనాల కొనుగోళ్లపై జీఎస్‌టీ తగ్గింపు నేపథ్యంలో ఈజీ ఫైనాన్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్లతో కస్టమర్లకు ప్రోత్సాహాన్నివ్వాలని భావిస్తున్నట్టు బ్యాంకు తెలిపింది. భారతదేశం అంతటా 36,000 దుకాణాలలో వినియోగదారుల డ్యూరబుల్స్ కొనుగోలు కోసం బ్యాంక్ డెబిట్ కార్డులపై ఈఎంఐ సదుపాయం అందిస్తోంది. కాగా ఈకామర్స్ పోర్టల్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ కొనుగోళ్లపై కూడా ఇటీవలఈఎంఐ ఆఫర్ అందించడం ప్రారంభించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles