Expect more rains in Andhra Pradesh in next two days: IMD విశాఖ, కాకినాడల మధ్య తీరం దాటనున్న తీవ్ర వాయుగుండం

Depression likely to intensify deep over bay of bengal heavy rain predicted over telugu states

low pressure, deep depression, visakhapatnam, kakinada, rains in hyderabad, telangana weather, andhra pradesh weather, rains in amaravati, weather report today, weather forecast, weather forecast today, Rain, low pressure, thunder storms, lightening, Bay of Bengal, Telangana, Andhra Pradesh, weather forecast, rains in Andhra Pradesh

IMD reports forecast more rains in the next two days with the well-marked low pressure area over east-central and adjoining southeast Bay of Bengal concentrating into a depression and moving west ­northwestwards The Met Centre, forecast heavy rainfall in many parts of Telugu states.

తీవ్ర వాయుగుండం అలర్ట్.. విశాఖ, కాకినాడల మధ్య తీరం దాటే అవకాశం

Posted: 10/12/2020 10:16 PM IST
Depression likely to intensify deep over bay of bengal heavy rain predicted over telugu states

(Image source from: Odishabytes.com)

నైరుతి రుతుపవనాల ప్రభావానికి తోడె బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్లతో ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఈ ఏడాది వర్షాకాలంలో సమృద్దిగా వర్షాలు కురిసాయి, దీంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి, ఇక నైరుతి రుతుపవనాలు తిరోగమనం పూర్తైనా వర్షాలు మాత్రం తెలుగురాష్ట్రాలపై దండెత్తుతూనే వున్నాయి, బంగాళాఖాతంలో ఒత్తడితో, లేక ఉపరితల ఆవర్తనం ప్రభావంతోనో మొత్తానికి వర్షాలు మాత్రం తెలుగురాష్ట్రాలను వీడటం లేదు. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ వాయుగుండం మరింత ఒత్తడికి గురై తీవ్ర వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ ప్రభుత్వాలను ప్రజలను అప్రమత్తం చేసింది.  

రానున్న 12 గంటల్లో ఈ వాయుగుండం బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది, పశ్చమి వాయువ్య దిశగా వాయుగుండం ప్రయాణిస్తూ గంటకు ఏడు కిలోమీటర్ల వేగంతో కోస్తాంధ్ర తీరానికి సమీపంలోకి వస్తున్నట్టు తెలిపింది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో విశాఖపట్టణానికి ఆగ్రేయంగా 280 కిలోమీటర్లు, కాకినాడకు తూర్పు ఆగ్నేయంగా 320 కిలోమీటర్లు, నర్సాపూర్ కు తూర్పు అగ్నేయంగా 360 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని తెలిపింది. ఇది క్రమేపీ వాయువ్య దిశగా ప్రయాణించి ఏపీలోని నర్సాపూర్-విశాఖ మధ్య కాకినాడకు సమీపంలో మంగళవారం ఉదయం నాటికి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

దీని ప్రభావంతో ఉత్తర, కోస్తాంధ్ర జిల్లాలతో పాటు ఉభయగోదావరి జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనూ మోస్తారు నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి, ఇక రాగల 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురేసే అవకాశాలు వున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్లు 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏపీలో వాయుగుండం తీరం దాటుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది, వాయుగుండం పరిస్థితిని ఎఫ్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు విపత్తు నివారణ శాఖ కమీషనర్ కన్నబాబు తెలిపారు.

ఇప్పటికే ప్రభుత్వం ప్రభావిత ప్రాంతాల్లోని అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేసిందని ఆయన తెలిపారు. తీర ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక తీరంలోని లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వం అలర్ట్ చేసిందని చెప్పారు, వాయుగంగం ప్రభావంతో పాటు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇటు వర్షాలతో తెలంగాణ తడిసి ముద్దైంది. గత రాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో రోడ్టు జలమయమయ్యాయి, దీనికి తోడు ఇవాళ ఉదయం నుంచి కూడా వర్షం కురుస్తూనే వుంది, అటు వాతావరణ శాఖ అధికారులు రానున్న రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు వున్నాయని సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles