ATS arrests HAL employee for leaking information to ISI ఐఎస్ఐకి సున్నిత సమాచారం లీక్.. హెచ్ఏఎల్ ఉద్యోగి అరెస్టు

Maharashtra ats arrests hal employee for leaking sensitive information to isi

Anti Terrorism Squad, ATS, ISI, HAL, Mumbai, Nashik, Pakistan, Inter Services Intelligence, Hindustan Aeronautics Limited, Maharashtra, Crime

The Maharashtra Anti-Terrorism Squad (ATS) arrested a 41-year-old employee, identified as Deepak Shirsath, of Hindustan Aeronautics Limited (HAL) for supplying sensitive information about Indian fighter aircraft and their manufacturing unit to the Inter Services Intelligence (ISI) of Pakistan.

ఐఎస్ఐకి సున్నిత సమాచారం లీక్.. హెచ్ఏఎల్ ఉద్యోగి అరెస్టు

Posted: 10/10/2020 11:23 AM IST
Maharashtra ats arrests hal employee for leaking sensitive information to isi

(Image source from: Ndtv.com)

పాలు తాగి తల్లి రొమ్ము మీదే గుద్దిన కసాయి మాదిరిగా ఓ హెల్ఏఎల్ ఉద్యోగి.. సంస్థలో పనిచేస్తూ అంతటితో సంతోషించకుండా తల్లి భారతావనికే వెన్నుపోటు పొడిచేలా దేశద్రోహానికి పాల్పడ్డాడు. మహారాష్ట్రకు చెందిన యాంటీ టెర్రరిస్టు స్వాడ్ ఉద్యోగిని అరెస్టు చేసిన దర్యాప్తు ప్రారంభించింది. కాగా ప్రాథమిక విచారణలో తాను పాకిస్థాన్ కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)కి భారత ఫైటర్ ఎయిర్ క్రాప్ట్ కు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని లీక్ చేశానని అంగీకరించాడని ఏటీఎస్ అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఏటీఎస్ అధికారుల తెలిపిన పూర్తి వివరాలు ఇలా వున్నాయి.

హెచ్ఏఎల్ సంస్థలో ఫైటర్ ఎయిర్ క్రాప్ట్ యుద్ధవిమానాల తయారీ విభాగంలో విదులు నిర్వహిస్తున్న 41 ఏళ్ల దీపక్ శ్రీసత్ అనే ఉద్యోగి, యుద్ద విమానాల తయారీతో పాటు తయారీ చేస్తున్న సంస్థకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్ ఐఎస్ఐకి అందించాడు. ఈ సందర్భంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్న యాంటీ టెర్రరిస్టు స్వాడ్ బృందం అతడి నుంచి మూడు సెల్ ఫోన్లతో పాటు ఐదు సిమ్ కార్డులను, రెండు మెమొరీ కార్డులను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు, పాకిస్థాన్ కు చెందిన ఐఎస్‌ఐతో నిత్యం సంప్రదింపులు జరుపుతుండగా నిఘా పెట్టిన ఏటీఎస్ బృందం ఇవాళ అతడ్ని అరెస్టు చేసింది. ఈ మేరకు ఏటీఎస్ కు పక్కా సమాచారం అందడంతోనే అతడిపై నిఘా పెట్టి అరెస్ట్‌ చేసింది.

ఇండియన్ ఫైటర్ ఎయిర్ క్రాప్ట్ యుద్ధవిమానాలకు సంబంధించిన సున్నితమైన సమాచారంతో పాటు నాసిక్ కు సమీపంలో ఓజార్‌ ప్రాంతంలో ఉన్న హెచ్‌ఏఎల్‌ తయారీ కర్మాగారానికి సంబంధించిన సమాచారాన్ని కూడా ఈ నిందితుడు ఐఎస్‌ఐతో పంచుకున్నాడని ఏటీఎస్ అధికారులు తెలిపారు. అధికార రహస్యాల చట్టం కింద నిందితుడిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అతడి నుంచి స్వాధీనం చేసుకున్న పోన్లు, సిమ్ కార్డులను ఫోరెన్సిక్‌ ల్యాబ్ కు పంపి పరీశీలిస్తున్నామని తెలిపారు. నిందితుడు ఏకంగా పదిహేను ఏళ్లుగా సంస్థలో విధులు నిర్వహిస్తున్నాడు, అయితే నిఘా పెట్టిన అధికారులు అతడ్ని ఇవాళ అతని నివాసంలోనే అదుపులోకి తీసుకున్నారు.

విచారణ సందర్భంగా సదరు ఉద్యోగి తనతో నిత్యం ఐఎస్ఐకి చెందిన వారు టచ్ లో వున్నారని, వారి వినతి మేరకు తాను తన సంస్థకు చెందిన సమాచారంతో పాటు యుద్దవిమానాలకు సంబంధించిన సున్నిత సమాచారాన్ని వారికి అప్పగించినట్లు అంగీకరించాడని  ఏటీఎస్ బృందం అధికారులు తెలిపారు, కాగా నిందితుడ్ని అరెస్టు చేసిన ఏటీఎస్ పోలీసులు అతడిపై భారత శిక్షాస్మృతిలోని అధికార రహస్యాల చట్టం కింద సెక్షన్ 3, సెక్షన్ 4, సెక్షన్ 5ల కింది కేసులు నమోదు చేశారు, నిందితుడిని కోర్టు ముందు హాజరుపరచ్చగా 10 రోజుల రిమాండ్‌ విధించింది. నాసిక్ కు సమీపంలో 1964లో ఏర్పాటైన తయారీ కర్మాగారంలో మిగ్‌-21ఎఫ్‌ఎల్‌, మిగ్‌-21ఎం, మిగ్‌-21బీఐఎస్‌, మిగ్‌-27ఎం వంటి యుద్ధ విమానాలతో పాటు, కె-13 మిస్సైల్‌ కూడా తయారవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles