CBI books YSRCP MP Ramakrishna Raju in loan default case ఎంపీ రాఘురామకృష్ణరాజు సంస్థపై సీబిఐ దాడులు.. 11 ప్రాంతాల్లో సోదాలు

Ysrcp rebel mp raju cheated pnb led consortium by siphoning off bank funds cbi says

Raghurama Krishnaraju, Narsapuram MP, Punjab National Bank, Ind-Barath Thermal Power Ltd, CBI searches, Prevention of Corruption Act, Bapatla MP, Andhra Pradesh, Politics

The CBI has booked YSRCP MP Kanumuru Raghu Ramakrishna Raju, his wife and nine others in connection with an alleged loan default case worth Rs 826 crore in a Punjab National Bank-led consortium of banks by Ind-Barath Thermal Power Ltd, officials said.

ఎంపీ రాఘురామకృష్ణరాజు సంస్థపై సీబిఐ దాడులు.. 11 ప్రాంతాల్లో సోదాలు

Posted: 10/09/2020 08:18 PM IST
Ysrcp rebel mp raju cheated pnb led consortium by siphoning off bank funds cbi says

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు సంధిస్తున్న ఆ పార్టీ రెబల్ నాయకుడిగా మారిన నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు చిక్కుల్లో పడ్డారు. హస్తినలో ప్రధాని నరేంద్రమోడీతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయిన రోజు నుంచే రఘురామకృష్ణరాజు ఇళ్లు, కార్యాలయాలపై సీబిఐ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారన్న వార్తలు వినిపించాయి. అయితే వాటిని ఆయన తొలుత ఖండించారు. కాగా నిధుల దారిమళ్లింపుపై పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారుల పిర్యాదుపై ఆయన సంస్థ సహా సంస్థ డెరెక్టర్ల నివాసాలపై అధికారులు దాడులు నిర్వహించారు. వ్యాపారం కోసం తీసుకున్న రుణాన్ని దారి మళ్లించారంటూ ఆయన సంస్థపై అభియోగాలు దాఖలయ్యాయి.

ఈ ఏడాది మార్చి 21న బ్యాంకు చీఫ్ మేనేజర్ సౌరభ్ మల్హోత్రా ఈ మేరకు సీబిఐ అధికారులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన సీబిఐ అధికారులు హైదరాబాద్, ముంబై, పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం 11 చోట్ల సోదాలు జరిపారు. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం... ఇండ్-భారత్ సంస్థకు వివిధ బ్యాంకులు కలిసి రూ. 941 కోట్లు, దీనికి అదనంగా మరో రూ. 62.80 కోట్లు మంజూరు చేశాయి. కర్ణాటకలో తొలుత విద్యుత్ ఉత్పత్తి సంస్థను ఏర్పాటు చేసిన ఇండ్-భారత్, ఆ తర్వాత దానిని తమిళనాడులోని ట్యుటుకోరిన్‌కు మార్చింది. సంస్థ ఏర్పాటు తర్వాత వివిధ పద్ధతుల ద్వారా నిధులను మళ్లించారు. విద్యుదుత్పత్తి కోసం కొనుగోలు చేసిన బొగ్గు ద్వారా కూడా నిధులను మాయం చేసినట్టు బయటపడింది.

2014-15, 2015-16 ఆర్థిక సంవత్సరాల్లో రూ. 516.20 కోట్ల విలువైన 14,70,861 టన్నుల బొగ్గును కొనుగోలు చేసినట్టు సంస్థ చూపించింది. అయితే, ఆడిట్‌లో మాత్రం అంత బొగ్గు నిల్వలేదు. కొనుగోళ్ల రశీదులు అడిగితే పాడైపోయినట్టు చెప్పారు. బొగ్గు సరఫరా వివరాలను వేబ్రిడ్జిలో పరిశీలించేందుకు అధికారులు ప్రయత్నించగా కంప్యూటర్‌లో ఆ వివరాలు నిక్షిప్తం కాలేదని చెప్పడంతో అనుమానాలు బలపడ్డాయి. కంపెనీ లావాదేవీల్లో అవకతకవలను గుర్తించిన బ్యాంకులు సంస్థను పలుమార్లు హెచ్చరించాయి. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు లేకపోవడంతో సంస్థను నిరర్ధక ఆస్తుల జాబితాలో చేర్చారు. సంస్థ డైరెక్టర్లు, అడిషనల్ డైరెక్టర్లు కలిసి లబ్ధిపొందేందుకు ప్రయత్నించి రూ. 826.17 కోట్ల నష్టం కలిగించినట్టు సౌరభ్ మల్హోత్రా తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles