Spy The Tiger In Pic Shared By Priyanka Gandhi's Son ప్రియాంక తనయుడి వైల్డ్ ఫ్రోటోగ్రాఫీ చూశారా.?

Priyanka gandhis son raihan shares stunning picture of tiger bravo says internet

Priyanka Gandhi, priyanka gandhi son, raihan rajiv vadra, ranthambore, ranthambore national park, raihan rajiv vadra pics. wildlife photographer, Social media, Tiger, Rajasthan

Congress leader Priyanka Gandhi Vadra's son, Raihan Rajiv Vadra, is a fantastic wildlife photographer. In a new post on social media on October 7, Raihan tweeted a beautiful picture of a tiger from the Ranthambore National Park in Rajasthan and the internet is absolutely mesmerised.

ప్రియాంక గాంధీ తనయుడు వైల్డ్ ఫోటోగ్రాఫర్.. బ్రావో అంటున్న నెటిజనులు

Posted: 10/08/2020 09:54 PM IST
Priyanka gandhis son raihan shares stunning picture of tiger bravo says internet

కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎంతటి ధైర్యవంతురాలో మనకు తెలుసు. ఇటీవలే ఉత్తర్ ప్రదేశ్ లోని హాత్రాస్ బాధితురాలని కలిసేందుకు రెండో పర్యాయం తన సోదరుడు రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ అగ్రనేతల బృందంతో కలిసి వెళ్లిన అమె వాహనాలను యూపీ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తలను తోసేసిన పోలీసులు వారిపై లాఠీచార్జీకి దిగారు. ఈ ఘటనను చూసిన అమె పోలీసుల లాఠీలకు ఎదురెళ్లి మరీ కార్యకర్తలను లాఠీ చార్జీ నుంచి తప్పించింది. దీంతో భళారే ప్రియాంకా అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రియాంకా గాంధీని వేనోళ్ల పోడుగుతున్నారు. ఇలాంటి నేత నాయకత్వంలో తాము దూసుకెళ్లేందుకు ఏమాత్రం వెనుకాడబోమని చెబుతున్నారు.

ఇక అమె తనయుడు రైహాన్ రాజీవ్ వాద్రా గురించి కూడా తాజాగా నెటిజనులు బ్రావో అంటూ కీర్తిస్తున్నారు. అదేంటి ఆయనేం చేశాడు అంటే.. ఆయన ప్రదర్శించిన సాహసం కూడా సామాన్యమైనది కాదు. అదిగో పులి అంటే ఇదిగో తోక అంటూ పరారయ్యే సామాన్యులకు భిన్నంగా రైహాన్ రాజీవ్ వాద్రా నేరుగా పులి సమీపంలోకి వెళ్లాడం.. దానిని పోదల మధ్యలోంచి ఫోటో తీయడం నెట్టింట్లో పెను సంచలనంగా మారింది. ఇప్పటివరకు ప్రియాంక తనయుడి గురించి తెలిసింది చాలా తక్కువ. అయితే ఒక్క ఫొటోతో రైహాన్ విశేషమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. నెట్ జనుల నుంచి ప్రశంసలను కూడా అందుకున్నాడు.

ఫొటోగ్రఫీ పట్ల ఎంతో మక్కువ చూపే రైహాన్ ఇటీవలే ఓ పులిని ఫొటో తీశాడు. రాజస్థాన్ లోని సుప్రసిద్ధ రణథంబోర్ నేషనల్ పార్క్ ను సందర్శించిన రైహాన్ అక్కడ చెట్ల నీడలో విశ్రమిస్తున్న పులిని తన కెమెరాలో బంధించాడు. ఆ పులి ఓ కంటితో తనవైపే చూస్తున్న దృశ్యాన్ని రైహాన్ అత్యంత ఒడుపుగా క్లిక్ మనిపించాడు. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా సందడి చేస్తోంది. ప్రియాంక గాంధీ తనయుడ్ని చాలామంది మొదటిసారి చూడడం ఒకెత్తయితే, అతడు తీసిన ఫొటో మరో ఎత్తు. మొత్తమ్మీద నెటిజన్ల దృష్టిలో రైహాన్ రాజీవ్ వాద్రా ఓ వైల్డ్ ఫొటోగ్రాఫర్ గుర్తింపు అందుకుంటున్నాడు. మీరేమంటారో ఈ ఫోటోను చూసి పులి కన్ను ఎక్కడుందో చెప్పిన తరువాత చెప్పండీ..!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles