IMD issues depression watch over Bay of Bengal బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. వర్షాలు కురిసే అవకాశం

Fresh low pressure likely to form over bay of bengal around october 9 heavy rain predicted over telugu states

weather, weather today, weather in hyderabad, telangana weather, andhra pradesh weather, weather in amaravati, weather report today, weather forecast, weather forecast today, Rain, low pressure, thunder storms, lightening, Bay of Bengal, Telangana, Andhra Pradesh, weather forecast, tamil nadu weather, karnataka weather

A fresh low pressure area is very likely to from over north Andaman Sea and adjoining east Central Bay of Bengal around 9th October 2020, informed the India Meteorological Department (IMD) regional meteorological centre. The Met Centre, forecast heavy rainfall in many parts of Telugu states.

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. వర్షాలు కురిసే అవకాశం

Posted: 10/05/2020 05:05 PM IST
Fresh low pressure likely to form over bay of bengal around october 9 heavy rain predicted over telugu states

నైరుతి రుతుపవనాల ప్రభావంతో కురిసిన వర్షాలతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి, ఇక నైరుతి రుతుపవనాలు తిరోగమనం పూర్తైనా వర్షాలు మాత్రం తెలుగురాష్ట్రాలపై దండెత్తుతూనే వున్నాయి, బంగాళాఖాతంలో ఒత్తడితో, లేక ఉపరితల ఆవర్తనం ప్రభావంతోనో మొత్తానికి వర్షాలు మాత్రం తెలుగురాష్ట్రాలను వీడటం లేదు. తాజాగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, దాని ప్రభావంతోనూ తెలుగు రాష్ట్రాలలో వర్షాలు కురిసే అవకాశాలు వున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది, మరో నాలుగు రోజుల వ్యవధిలో ఈ అల్పపీడనం ఏర్పడే అవకాశాలు వున్నాయని తెలిపింది.

ఉత్తర అండమాన్ నుంచి తూర్పు మధ్య బంగాళాఖాతం మధ్యలో ఈ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అయితే ఇప్పటికే వాయవ్య బంగాళాఖాతం నుంచి దానికి ఆనుకుని ఉన్న ఒడిశా తీర ప్రాంతం వరకూ అల్పపీడనం ఉందని, దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కూడా ఉందని వెల్లడించిన అధికారులు, దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో పలు ప్రాంతాల్లో వర్షాలకు అవకాశాలు ఉన్నాయని, కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలకు అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేశారు.

ఇక బంగాళాఖాతంలో మరో అల్పపీడనం 9వ తేదీన ఏర్పడే అవకాశం ఉందని, ఆ తరువాత మరో మూడు నుంచి నాలుగు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని అధికారులు వ్యాఖ్యానించారు. కాగా, నిన్న కూడా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. నారాయణ పేట్ ప్రాంతంలో అత్యధికంగా 4.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా, మిగతా జిల్లాల్లో చిరు జల్లులు కురిశాయి. ఈశాన్య రుతుపవనాలు వచ్చేశాయని, ఈ సీజన్ లో ఇప్పటి వరకూ సగటున 18.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి వుండగా, నిన్నటివరకూ 5.5 మిల్లీ మీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైందని, రానున్న అల్పపీడనాలతో మరింత వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rain  low pressure  thunder storms  lightening  Bay of Bengal  Telangana  Andhra Pradesh  weather forecast  

Other Articles