Atal Tunnel Rohtang: Dream of Himachal come True ప్రపంచ అత్యంత పొడవైన అటల్ టన్నెల్ మార్గం.. కల సాకారం..

Pm modi inaugurates worlds longest highway tunnel above 10000 feet in manali

rohtang tunnel, atal tunnel rohtang, rohtang atal tunnel, atal tunnel manali, rohtang tunnel status, rohtang tunnel opening date, rohtang tunnel map, rohtang tunnel benefits, rohtang tunnel construction company, rohtang tunnel project contractors, atal tunnel length, atal tunnel map, atal tunnel connects, Atal Bihari Vajpayee, Politics

PM Narendra Modi has inaugurated Atal Tunnel in Manali. It is 'world's longest highway' tunnel and is named Atal Tunnel, Rohtang. The 9.02 kilometres long engineering marvel connects Manali in Himachal Pradesh to Lahaul-Spiti throughout the year.

ప్రపంచ అత్యంత పొడవైన అటల్ టన్నెల్ మార్గం.. కల సాకారం..

Posted: 10/03/2020 04:18 PM IST
Pm modi inaugurates worlds longest highway tunnel above 10000 feet in manali

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పాయ్ చేతుల మీదుగా 2002 మే 26న శంఖుస్థాపన జరిగిన రోహ్ తంగ్ టన్నెల్.. అటల్ టన్నెల్ గా పేరు మార్చుకుని ఇవాళ భారత జాతిని పరిరక్షిస్తున్న సైనిక దళాలకు అంకితమిచ్చారు ప్రధాని నమరేంద్రమోడీ. ప్రపంచంలోనే అత్యంత పోడవైన 9.2 కిలోమీటర్ల మేర సొరంగ మార్గన్ని ఇవాళ ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ ఇవాళ చారిత్రాత్మకమైన రోజుగా అభివర్ణించారు. మాజీ ప్రధాని వాజ్‌పేయ్ కల సాకారమైన రోజుగా పేర్కోన్నారు. ఫిర్‌ ఫంజల్‌ పర్వతాల మధ్యలో నిర్మించిన ఈ టన్నెల్ తో హిమాచల్‌ ప్రజల దశాబ్దాల ఎదురుచూపులకు ఇవాళ్టితో చెక్ పడిందన్నారు. ఈ టన్నెల్ అందుబాటులోకి రావడంతో కోట్లాది మంది స్థానికులకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు.

హిమాచల్ లోని మనాలి- లేహ్ జాతీయ రహదరాిపై లాహౌల్-స్పిటీ జిల్లాలో రోహ్ తంగ్ పాస్ ల మధ్య ఈ టన్నెల్ నిర్మితమైన విషయం తెలిసిందే. ఈ సొరంగంతో సరిహద్దులకు అదనపు బలం చేకూరుతుందని మోదీ తెలిపారు. సరిహద్దుల్లో మౌలిక వసతుల ఏర్పాటుకు ఈ టన్నెల్‌ ఎంతో సహకరిస్తుందన్నారు. ఈ టన్నెల్ అందుబాటులోకి రావడంతో మనాలి-లేహ్ మధ్య ఏకంగా 46 కిలోమీటర్ల దూరం తరగిపోనుంది. మరీ ముఖ్యంగా శీతాకాలంలో మంచు కురిసే సమయాల్లో మంచు పేరుకుపోయి రహదారులపైనే రోజులు నెలల తరబడి వాహనాలు నిల్చుండిపోతాయి. అలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ.. దట్టంగా మంచుకురిసినా ఈ టన్నెల్ మార్గం ద్వారా హిమాచల్ వాసులకు మిగిలిన ప్రాంతాలతో రవాణా సంబంధాలు కోనసాగనున్నాయి.  

ఇక దేశ రక్షణలోనూ ఈ టన్నెల్ సైనిక బలగాలకు ఎంతగానో దోహదపడుతోంది. సరిహద్దులలో ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా ఈ టన్నెల్ ద్వారా సైనిక హాహనాల్లో సామాగ్రిని త్వరితగతిన తరలించే అవకాశం వుండేలా ఎంతో వ్యూహాత్మకంగా టన్నెల్ నిర్మాణం చేపట్టారు, సోరడంతో ప్రతీ 60 మీటర్ల దూరంలో అగ్నిమాపక వ్యవస్థ.. ప్రతీ 150 మీటర్ల దూరంలో టెలిఫోన్, ప్రతీ 250 మీటర్ల దూరంలో సిసి కెమెరా, ప్రతీ 500 మీటర్ల దూరంలో అత్యవసర మార్గం, ప్రతీ కిలోమీటరుకు గాలి నాణ్యత పరిక్షించే వ్యవస్థ, 2.2 కిలోమీటర్ల దూరంలో వెలుతురు ప్రసరించే వ్యవస్థ ఏర్పాటుతో అత్యాధునికంగా ఈ సొరంగమార్గం నిర్మితమైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles