SPB's body brought to his house for public homage చెన్నైలోని ఫామ్ హౌజ్ లో ఎస్పీ బాలు అంత్యక్రియలు

Sp balasubrahmanyams funeral to take place at farmhouse

SPB dead, Balasubrahmanyam death, SP Balasubrahmanyam dead, singer Balasubrahmanyam, SP balasubrahmanyam hindi songs list, SP balasubrahmanyam, SP Sailaja, SP balasubramaniyaam songs list, SP balasubramaniam songs, MGM Hosiptal, coronavirus, covid-19, sp Balasubrahmanyam, SPB, Balu, Singer Balu, MGM Hospital, SP Charan, Last rites, Red Hills, Thamaraipakkam, SPB Farm House, Chennai, Tamil Nadu

Padma Shri award-winning musician's body was taken to his residence after embalming for public homage in the evening. A large number of people gathered at his residence here to have a last glimpse of the singer and pay their respects. The last rites will be held on Saturday at his farmhouse at Thamaraipakkam

చెన్నైలోని ఫామ్ హౌజ్ లో ఎస్పీ బాలు అంత్యక్రియలు

Posted: 09/26/2020 01:00 AM IST
Sp balasubrahmanyams funeral to take place at farmhouse

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దివికెగి.. యావత్ భారత సినీ జగత్తును, అభిమానులను విషాద సాగరంలో ముంచెత్తి ఇక సెలవంటూ మరో లోకానికి తరలి వెళ్లిన దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు శనివారం సాయంత్రం జరగనున్నాయి. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా రెడ్ హిల్స్ ప్రాంతంలోని తామరైపాకంలో ఉన్న ఫాంహౌస్ లో బాలు అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎంజీఎం ఆసుపత్రి నుంచి బాలు పార్థివదేహాన్ని కోడంబాక్కంలోని వారి నివాసానికి తరలించారు. అభిమానుల సందర్శనార్థం కోడంబాక్కంలో బాలు భౌతికకాయాన్ని ఉంచారు.

కాగా, అప్పటికే ఆయన ఇంటి వద్దకు వందలాది మంది అభిమానులు చేరుకున్నారు. కరోనా భయాలను సైతం లెక్క చేయకుండా తమ అభిమాన గాయకుడిని కడసారి చూసుకోవాలని పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుంటున్నారు. అభిమానుల సందర్శనంతో కోవిడ్ నిబంధనలు పాటించకపోవడంతో.. ఆయన పార్థీవ దేహాన్ని ఇవాళ సాయంత్రమే కొడంబాక్కంలోని ఫాంహౌజ్ కు తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై బాలు తనయుడు ఎస్పీ చరణ్ కాసేపట్లో ఓ ప్రకటన ద్వారా మరిన్ని వివరాలు తెలియజేసే అవకాశముంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles