MP Raghurama Krishna Raju fires on TTD Officials transter 'తిరుమల శ్రీవారి సొమ్ముపై వారి కన్నుపడింది'

Why the govt transfered ttd officials questions mp raghurama krishna raju

Raghurama Krishnaraju, Narsapuram MP, Tirumala Income, TTD assets, TTD officials transfer, YSRCP Leaders, Nandigam Suresh, Bapatla MP, Andhra Pradesh, Politics

YSRCP MP Raghurama Krishna Raju questions that Andhra Pradesh Ruling YSR Congress Party Government what is the need and necessary to transfer two of the Tirumala Tirupati Devasthanam officials. He alleges that the Leaders of the party are eyeing TTD assets.

‘‘తిరుమల శ్రీవారి సొమ్ముపై వారి కన్నుపడింది’’: రఘురామ కష్ణంరాజు

Posted: 09/22/2020 12:23 AM IST
Why the govt transfered ttd officials questions mp raghurama krishna raju

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు సంధిస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇవాళ మరో అంశంలోనూ ప్రభుత్వంపై సునిశిత విమర్శలను కొనసాగించారు. తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాల విషయంలో తన సోంత పార్టీపై విమర్శలు చేస్తూ, తన పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేల అరచకాలు చేస్తున్నారంటూ అరోపణలు చేసిన ఆయన తాజాగా మరోమారు తిరుమల వెంకన్న సంపదపై తన పార్టీ నేతల కన్ను పడిందని అరోపించారు. ఈ విషయాన్ని ప్రస్తుతం రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారని అన్నారు.

అయితే దేవుడి సొమ్ము కొట్టేసిన వాడు బాగుపడినట్టు చరిత్రలో లేదని.. దేవుడి సొమ్మును కాజేయాలని చూపిన వాళ్లకి ఆయనే తన ప్రతాపాన్ని చూపుతాడని అన్నారు. ఉన్నపళంగా కరోనా కష్టసమయంలోనూ టీటీడీలో కొనసాగుతున్న ఇద్దరు అధికారులను మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చిందందని ఆయన ప్రశ్నించారు, రథం తగలబడిన ఘటనలో ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతోందని అన్నారు. ఇక ఈ ఘటనకు బాధ్యత వహించాల్సిన ప్రభుత్వం కొత్త రథాలకు తమ జేబులోంచి డబ్బులు ఇవ్వడం లేదని.. ఇస్తున్నదంతా ప్రజల డబ్బేనని అన్నారు.

అమ్మవారి వెండి విగ్రహాలు పోతే, ఆ పోయాయిలే అని తేలిగ్గా తీసిపారేయడం తగదని వ్యాఖ్యానించారు. దేవాలయాలపై జరిగిన దాడులు హిందువులకు తగిలిన గాయాలు అని పేర్కొన్నారు. పరిస్థితి ఇలావుంటే, మరోపక్క హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వైసీపీ మంత్రులు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ క్రమంలో రఘురామకృష్ణరాజు అమరావతి అంశంపైనా స్పందించారు. గతంలో అత్తారింటికి దారేది అన్న పవన్ కల్యాణ్ ఇప్పుడు అమరావతికి దారేది అంటున్నారని తెలిపారు. అమరావతి 20 గ్రామాల సమస్య కాదని, రాష్ట్ర సమస్య అని స్పష్టం చేశారు. తమ ఎంపీలు జీఎస్టీ బకాయిలపై కాకుండా ఇతర అంశాలపై పోరాటం చేస్తున్నారంటూ రఘురామ వ్యంగ్యం ప్రదర్శించారు.

కాగా ఎంపీ రఘురామకృష్ణరాజు దళితులంటే అహంకార పూరితంగా మాట్లాడుతున్నారని బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ ధ్వజమెత్తారు. సెక్యూరిటీ సిబ్బంది తన రక్షణ కోసమే తప్ప ఎదుటివాళ్లను చంపడానికి కాదు, చర్మం వలవడానికి కాదన్న విషయాన్ని మర్చిపోయి మరీ దళితులపై విరుచుకుపడుతున్నారని మండిపడ్డారు. దళితుల పట్ల అసూయతో రగిలిపోతన్నారని ఇది ప్రజాస్వామ్యంలో సముచితం కాదన్నారు. ఈ పరిణామాలపై ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేశామన్నారు. రఘురామకృష్ణరాజుకు దళితులన్నా.. దళిత కులాలన్నా చిన్నచూపు ఉందని అది పోవాలని, సురేశ్ అన్నారు. ఆయన తీరుపై లోక్ సభ స్పీకర్ కూడా పిర్యాదు చేయనున్నామని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles