Ancient treasure found at Srisailam శ్రీశైలం ఘంటామఠంలో పురాతన తామ్రపత్రాలు, వెండినాణేలు

Ancient treasure found at srisailam of andhra pradesh

Jeernodharna works, Ghanta Matham, srisailam, mallikarjuna swamy temple, silver coins, british regime, copper sheets, kurnool, Andhra pradesh

Ancient treasure was been unearthed at Srisailam on Wednesday. The treasure was found at the surrounding areas of Ghantaravam around Mallikarjuna Swamy temple where Jeernodharna works pertaining to Ghanta Matham are going on.

శ్రీశైలం ఘంటామఠంలో పురాతన తామ్రపత్రాలు, వెండినాణేలు లభ్యం

Posted: 09/16/2020 03:23 PM IST
Ancient treasure found at srisailam of andhra pradesh

యావత్ ప్రపంచవ్యాప్తంగా వున్న ద్వాదశ జ్యోతిర్లింగాలలో శ్రీశైలానికి ప్రత్యేకత వుంది. ఇక్కడ కలువైన అమ్మవారు కూడా అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి కావడం.. అదిదంపతులుగా కొలువబడే పార్వతీ పరమేశ్వరుల చెందిన పవిత్ర ఫుణ్యస్థలం కాబట్టి అనాదిగా ఎంతో మంది మహర్షులు, రుషులు, సాధుసంతవులు ఇక్కడ నెలకొన్న పంచమఠాల్లో అద్వైతశక్తిని పోందారని చరిత్ర చెబుతున్న సత్యం. వారి శివైక్యం అయిన విషయం కూడా అప్పట్లో తెలిసేది కాదు. కొందరు సమాధి కాగా, మరికొందరు అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లి అక్కడ కూడా తమ తోపోదీక్షను కొనసాగించేవారు. అయితే వారికి అప్పట్లో దర్శించిన భక్తులు వారికి సమర్పించిన కానుకలు కూడా అక్కడే వదిలివెళ్లి వెళ్లేవారు.

అలా వదిలివెళ్లిన కానుకలు ఆలయ జీర్ణోద్దరణ కార్యక్రమాల సందర్భంగా బయటపడుతున్నాయి. గతంతో 2017లో కూడా మఠం జీర్ణోద్దరణ పనులు చేపడుతుండగా బయటపడిన పురాతన వెండి, బంగారు నాణేలు.. తాజాగా మరోమారు కూడా అలాంటి పురాతన నాణేలతో పాటు తామ్రపత్రాలు కూడా బయటపడ్డాయి. శ్రీశైలంలోని పంచ మఠాల్లో ఒకటైన ఘంటామఠం ప్రాంగణంలోని చిన్న శివాలయ పునరుద్ధరణ పనులు చేస్తుండగా గోడల నుంచి పురాతన తామ్ర శాసనాలు, వెండి నాణేలు బయటపడ్డాయి. మూడు తామ్రపత్రాలు, 245 వెండి నాణేలు లభ్యమైనట్టు అధికారులు తెలిపారు.

తామ్రశాసనాలపై నాగరి, కన్నడ లిపితో పాటు, శివలింగానికి రాజు నమస్కరిస్తున్నట్టు, నంది, గోవు చిత్రాలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. అయితే ఇవి రాజులు సాధువులను సందర్శించిన నేపథ్యంలో సమర్పించిన పత్రాలుగా కూడా పేర్కోంటున్నారు. పురాతన నాణేలు బయటపడిన సమాచారం అందుకున్న దేవస్థానం ఈవో రామారావు, తహసీల్దారు రాజేంద్రసింగ్, ఎస్సై హరిప్రసాద్‌లు ఆలయానికి చేరుకుని వాటిని పరిశీలించారు. వెండినాణేలను 1800-1900 సంవత్సరాల మధ్య బ్రిటిష్ పాలన నాటివిగా అధికారులు గుర్తించారు. తామ్ర పత్రాలకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles