Police Alerted After Maoists Make Come Back To Telangana నది దాటుతున్న మావోలను బంధించిన పోలీసుల డ్రోన్

Visual of mao meli on odisha chhattisgarh border surfaces

Telangana Police, Technology, sookshma district, kishtaram police station, paalodi forest area, Maoists, Chhattisgarh-Telangana border, Telangana news, Crime

Telangana Police have found a clue on the movement of Maoists through drone cameras. Through this clue, they have found out that, a group of Maoists are crossing the small pond near Chhattisgarh Sookshma district Kishtaram police station area's Paalodi forest region.

ITEMVIDEOS: నది దాటుతున్న మావోలను బంధించిన పోలీసుల డ్రోన్

Posted: 09/14/2020 07:30 PM IST
Visual of mao meli on odisha chhattisgarh border surfaces

దేశవ్యాప్తంగా మావోయిస్టులు తమ ఉని చాటుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దేశంలోని అణగారిన పక్షాన నిలిచే మావోలకు ప్రస్తుతం.. శరవేగంగా అభివృద్దిలో దూసుకుపోతున్న దేశంతో పాటు రాష్ట్రాల గమనం కూడా వారి ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చివేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం, తీవ్రత చాలానే వున్న విషయం కాదనలేని సత్యం. అయితే రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఈ ప్రభావం మరింత పెరుగుతోందని అప్పటి నేతలు పేర్కోన్నారు. అయితే పునర్విభజన తరువాత తెలుగు రాష్టాలలో మావోల ఉనికి పూర్తిగా సన్నగిల్లిందన్నది కాదనలేని వాస్తవం.

మావోల కోసం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తూ ఎక్కడికక్కడ జల్లెడ పట్టడంతో పాటు అందుబాటులోకి వచ్చిన సాంకేతిక మార్గాలను కూడా వినియోగిస్తూ వారి కదలికలపై నిఘా పెడుతున్నారు. ఇక ఈ తరుణంలో మావోలకు ప్రజల నుంచి కూడా ఆదరణ సన్నగిల్లింది. ప్రభుత్వాలను నిలదీయడం కన్నా అభివృద్ది పయనంలో పయనింపజేయడానికి దోహదం చేయాలని ప్రజలు భావిస్తున్నారు. దీంతో మావోలు ఉనికి రానురాను కాలక్రమేనా సన్నగిల్లుతోంది. ఇక దీనికి తోడు వారి కదలికలు గమనించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడం లేదా తప్పించుకునే ప్రయత్నంలో వారు జరిపే కాల్పులకు పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో వారు మరణిస్తున్నారు.

దీంతో మావోయిస్టుల బలం తగ్గుతూ వస్తోంది. ఇక మావోయిజంపై నేటి యువతరం పెద్దగా ఆసక్తిని కనబర్చకపోవడం కూడా మావోల బలం క్షీణించడానికి మారో కారణంగా నిలుస్తోంది, మారుతున్న అధునాతన సాంకేతిక ప్రపంచంలో అవే పాత పద్దతులను అనుసరిస్తున్న మావోలకు జనాదరణ కూడా లేకుండా పోతోంది. దీంతో మావోలు నిత్యం తమ ఉనికి చాటుకోవడం మాట అటుంచితే మరో దశాబ్దం గడిస్తూ మావోలు పరిస్థితి ఎలా వుంటుందోనన్న కూడా చెప్పలేని పరిస్థితలు వస్తాయనిపిస్తోంది. ఎందుకంటే పోలీసుల అదునాతన సాధనాలకు వారు అడ్డంగా చిక్కిపోతున్నారు. తాజాగా చత్తీస్ గఢ్ లో పోలీసులు ప్రయోగించిన డ్రోన్ కెమెరా కంట మావోయిస్టులు పడ్డారు.

అడవుల్లో మావోలు డ్రోన్ కెమెరాకు చిక్కడం ఇదే తొలిసారని అధికారులు వెల్లడించారు. చత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు ఓ నదిని దాటుతున్న చిత్రాలను డ్రోన్ కెమెరాలు అందించడంతో, ఆ ప్రాంతంలోని పోలీసు బలగాలు అప్రమత్తం అయ్యాయి. సుమారు నెల రోజులుగా తెలంగాణ, చత్తీస్ గఢ్ సరిహద్దుల్లో మావోల కదలికలు అధికంగా ఉన్నాయని తెలుస్తుండగా, తాజాగా డ్రోన్ కెమెరాల్లో సైతం వారి కదలికలు నమోదు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో తెలంగాణ డీజీపీ, స్వయంగా ఆదిలాబాద్ అడవుల్లో ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇప్పటికే రెండు రాష్ట్రాల పోలీసులు, ప్రత్యేక దళాలు, మావోల కదలికలపై నిఘా పెట్టి, వారిని చుట్టుముట్టే పనిలో పెద్దఎత్తున కూంబింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం వారు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు.

(Video Source: ABN Telugu)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles