EPFO to pay 8.5% interest for FY20 ప్రావిడెంట్ ఫండ్ చందాదారులకు గుడ్ న్యూస్..

Epfo decides to credit part of 8 5 interest on epf for fy20

EPF account, EPF account interest, EPF interest, EPF interest rate, Provident Fund Interest, EPFO Interest

The six crore subscribers of retirement fund body EPFO will receive interest for 2019-20 on their EPF or employee provident fund accounts in two instalments. The EPFO board had earlier in March decided to provide 8.5% interest rate for 2019-20.

ప్రావిడెంట్ ఫండ్ చందాదారులకు గుడ్ న్యూస్.. వడ్డీ రేటు ఖరారు..

Posted: 09/09/2020 11:29 PM IST
Epfo decides to credit part of 8 5 interest on epf for fy20

(Image source from: India.com)

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) చందాదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. అయితే కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి ప్రభావం చివరాఖరన ఉద్యోగుల భవిష్యనిధిపై కూడా పడింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్)పై 8.5 శాతం వడ్డీ చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే గతంలొ మాదిరిగా ఒకేసారి ఈ వడ్డీని జతచేసే బదులుగా రెండు వాయిదాల్లో్ జమ చేయనున్నారు. కరోనా ప్రభావంతోనే కేంద్రం ఇలా రెండు వాయిదాల రూపంలో వడ్డీలను జమచేయనుంది. అయితే మొత్తానికి వడ్డీ రావడం కార్మికులకు ఆనందాన్ని పంచుతోంది.

కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఈపీఎఫ్ చందాదారులుగా వున్న దాదాపు 6 కోట్ల మంది ఉద్యోగులు ప్రయోజనం పొందుతారు. తొలి విడతగా పీఎఫ్ ఖాతాల్లోని నిధిపై 8.15 శాతం వడ్డీని ఈ నెలలో జమచేయనున్న కేంద్రం.. మిగిలిన 0.35 శాతం వడ్డీని ఈ ఏడాది డిసెంబరు నెలలో జమ చేయనున్నట్లు ఈఫీఎఫ్ బోర్డు సమావేశంలో ట్రస్టీలు నిర్ణయం తీసుకున్నారు. తన వద్దనున్న కొన్ని పెట్టుబడులను నగదు రూపంలోకి మార్చాలని ఈపీఎఫ్ఓ గతంలో యోచించింది. కానీ కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో మార్కెట్లు స్థిరంగా లేనందువల్ల ఆ యోచనను విరమించుకుంది.

అయితే గత ఏడాదితో పోల్చితే ఈ ఆర్థిక సంవత్సరం ఇస్తున్న వడ్డీ మాత్రం తక్కువే. గత 2018-19 ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్ నిధిపై వడ్డీ రేటు 8.65శాతంగా ఇచ్చిందీ కేంద్రం. అదే వడ్డీ రేటుతో ఈపీఎఫ్ క్లెయిమ్ లను పరిష్కరించింది. ఇదిలావుండగా 2013-14 ఆర్థిక సంవత్సరం నుంచి క్రమేపి పెరుగుతూ వస్తున్న ఈపీఎఫ్ వడ్డీ రేటు 2015-16లో అత్యధికానికి చేరింది. ది 2013-14తో పాటు 2014-15లో 8.75 శాతం వడ్డీ రేటును ఇచ్చింది. ఆ తరువాత 2015-16లో 8.8 శాతంగా పెరిగింది. ఇక ఆ తరువాత 2016-17 సంవత్సరానికి 8.65%, 2017-18లో 8.55 శాతం వడ్డీ రేటును అందించింది. ఈ సారి కరోనా నేపథ్యంలో 8.5కు మాత్రమే పరిమితమైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles