Woman Threatens Bank Employees With Fake Case రుణం తీర్చామంటే.. రేప్ కేసు పెడతానన్న మహిళ..

Sangeetha gopal bangalore socialite threatens bank loan recovery employees with false rape charges

Woman Threatens To Bank employee viral video, karnataka woman threats video, latest viral video, new viral video, shocking viral video, karnataka latest news, bank employees, threats, Sangeetha Gopal, Bangalore Socialite, Bank recovery officers, Housing loans, bad debts, videographer, WhatsApp, Priyaa Aryaa, karnataka, Crime

A WhatsApp video that has gone viral recently in banking circles underscores the importance of such precautions. It shows three-four middle-aged recovery officials from a bank shaken when a customer’s aggressive wife unleashes a volley of expletives and even threatens to file a rape case.

ITEMVIDEOS: రుణం తీర్చామంటే.. రేప్ కేసు పెడతానన్న మహిళ..

Posted: 09/09/2020 05:28 PM IST
Sangeetha gopal bangalore socialite threatens bank loan recovery employees with false rape charges

నిజాయితీగా రుణాలను చెల్లించే రైతులు, సామాన్యులను ఫలనా డాక్యూమెంట్ కావాలని, ఒకటి తరువాత మరోకటి ఇలా చెప్పి చెప్పులరిగేలా కస్టమర్లను తిప్పించుకునే బ్యాంకులు.. కాస్తా కూస్తో పరపతో లేక పైసానో పెడితే మాత్రం ఎంచక్కగా పనులు చేసిపెడతారు. రుణాలను ఇచ్చిన తరువాత తిరిగి చెల్లించడంలో మాత్రం ఇలాంటి వారిలో కనీసం పది మంది వరకు బ్యాంకు రికవరీ అధికారులు చెప్పులరిగేలా చేస్తుంటారు. ఇలాంటి ఘటనలు చూసినప్పుడల్లా బ్యాంకు అధికారుల మీద సానుభూతి ఏర్పడే కన్నా.. నేను నిజాయితా కట్టేవాడ్ని కానీ నాకు రుణం ఇవ్వలేదన్న సామాన్యులే గొంతులే అధికంగా వినిపిస్తుంటాయి.

ఓ వైపు ఇప్పటికే బడాబాబులు బ్యాంకు అధికారులనే తమ ఇళ్ల చుట్టూ తప్పించుకుని వందల కోట్లు, వేల కోట్ల రూపాయలను రుణాలు పోంది వాటిని ఎగవేసి విదేశాలకు పోయి తలదాచుకుంటున్నారు. ఇక వందల కోట్ల రూపాయలు రుణాలు తీసుకున్న వారు రాజకీయ పార్టీలో చేరి.. ఏ పార్టీ అధికారంలో వుంటే దాని పంచన చేరి రుణాలను చెల్లించకుండా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, ఇలా వారు పొందిన రుణాలన్నీ ప్రజల సొమ్మని వాటినే బ్యాంకులు రుణాలుగా ఇస్తున్నాయన్న విషయం తెలియని సామాన్యుడు మాత్రం బ్యాంకుల నుంచి రుణాల పోందేందుకు నానా యాగీ పడుతుంటాడు.

తాజాగా జరిగిన ఘటన మాత్రం అందుకు భిన్నం. రుణాలను తీర్చాలని అడిగేందుకు వచ్చిన బ్యాంకు రికవరీ అధికారులపై కేసులు పెడతామని బెదిరించిందో మహిళ. అదీ తన ఇంట్లోకి దౌర్జన్యంగా వచ్చారని కాదు ఏకంగా తనపై అత్యాచారం చేయబోయారన్న కేసు పెట్టి ఊచలు లెక్కబెట్టిస్తానని హెచ్చరించింది. కర్ణాటక రాజధాని బెంగుళూరులోని ఇందిరా నగర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది, అమె ఇంటికి వెళ్లిన బ్యాంకు అధికారులు నోళ్లు తెరియబెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. సంగీత దంపతులు బ్యాంకు నుంచి రుణం తీసుకుని ఇళ్లు కొనుగోలు చేశారు.

అయితే కరోనా సమయం కన్నా ముందు నుంచే వారు ఇంటి కోసం తీసుకున్న రుణం చెల్లించడం లేదు, దీంతో బ్యాంకు రికవరీ అధికారులు వారి ఇంటికి వచ్చి ఇంట్లో వున్న సంగీత భర్తను రుణం చెల్లించమని అభ్యర్ధించారు. దీంతో ఆయన బ్యాంకు అధికారులకు సమాధానం ఇస్తున్నారు, ఈ తరుణంలో కోపోద్రిక్తురాలైన సంగీత బ్యాంకు అధికారులపై ఫైర్ అయ్యారు. బ్యాంకు అధికారులను కించపరిచేలా మాట్లాడారు. నా భర్తను లోను కట్టమని అడగటానికి నీకెంత ధైర్యం… అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. మీరు నన్ను రేప్ చేశారని…మీ మీద అత్యాచారం కేసుపెడతానని బెదిరించారు.

అయితే బ్యాంకు రివకరీ అధికారుల్లో ఒకరు ఈ తతంగాన్ని మొత్తం వీడియోలో బంధించి.. దానిని సామాజిక మాద్యమాల్లో అప్ లోడ్ చేశారు. ఇంకేముందీ ఈ వీడియో కాస్తా వైరల్ అయ్యింది. రుణం తీర్చమన్నందుకు బ్యాంకు అధికారులపై సంగీత రెచ్చిపోవడం.. కేసు పెడతానని బెదిరించడం అంతా వీడియోలో నిక్షిప్తమైంది. అయితే బ్యాంకు అధికారులు ఆమె కాళ్ళు పట్టుకోటానికి కూడా సిధ్దం కావడం మాత్రం బ్యాంకు అధికారుల ముందస్తు పన్నాగమా.? అన్న అనుమానాలకు కూడా తావిస్తోంది. ఈ వీడియో ఆధారంగా సామాజిక కార్యకర్త ప్రియా ఆర్య సంగీతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంగీత తన హక్కులు, చట్టాలను దుర్వినియోగం చేసిందని ఆమె తన ఫిర్యాదులో పేర్కోన్నారు. సంగీత పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామిని బెంగుళూరు తూర్పు మండలం డీసీపీ శరణప్ప తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles