Skyline Ventures to invest in growth-stage startups ఆన్ లైన్ ఫార్మసీ మెట్రోమెడీతో స్కైలైన్ వెంచర్స్ టై-అప్..

Skyline ventures to invest in growth stage startups

MetroMedi, MetroMedi Start-up Pharma, MetroMedi Online pharmacy, MetroMedi Dilip C Byra, Skyline Ventures India, Lakshmi Narayana, IT/ITeS services, MetroMedi, Start-up Pharma, Online pharmacy, Dilip C Byra, badminton star couple, Saina Nehwal, Parupally Kashyap, Hyderabad

Skyline is positioning itself as a technology ventures company to invest in small growth-stage companies with an equity acquisition of up to 25-26 per cent and take them to the next level

ఆన్ లైన్ ఫార్మసీ మెట్రోమెడీతో స్కైలైన్ వెంచర్స్ టై-అప్..

Posted: 09/06/2020 01:25 AM IST
Skyline ventures to invest in growth stage startups

హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాలు, పట్టణాలతో పాటు అటు కర్ణాటకలోని బెంగుళూరు సహా పలు నగరాలు, పట్టాణాల్లో వేగంగా విస్తరిస్తున్నలో ఆన్ లైన్ ఫార్మసీ స్టార్టప్ సంస్థ ‘‘మెట్రో మెడీ’’లో పెట్టుబడులు పెట్టేందుకు స్కైలైన్ వెంచర్స్ ముందుకువచ్చింది. హెల్త్ కేర్ రంగంలో వేగంగా విస్తరిస్తున్న సంస్థలో పెట్టుబడులను పెట్టేందుకు స్కైలైన్ సంస్థ ఒప్పందాలను కూడా చేసుకున్నట్లు సమాచారం. కాగా సంస్థలో 25శాతం మేర ఈక్వీటితో సంస్థను మరింత విస్తరించేందుకు కూడా స్కైలైన్ వెంచర్స్ సంస్థ ముందుకు వచ్చింది. 

కంపెనీల వృద్ధి మూలధన అవసరాలను సులభతరం చేసి, వాటిని పెట్టుబడిదారులు, మర్చంట్ & ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ పర్యావరణ వ్యవస్థతో అనుసంధానించే సంస్థగా ఇన్నాళ్లు సేవలందించిన స్కైలైన్ వెంచర్స్ ఇండియా, ఇకపై ఐటి, ఐటీఈఎస్ సేవలను కూడా విస్తరించనుంది. దీంతో పాటు మెడికల్, హెల్త్ సహా ఆర్థిక రంగాలలోని స్టార్టప్ సంస్థలలో తమ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహంగా వున్నట్లు తెలిపింది. ఇలా పెట్టబుడులు పెట్టిన ప్రతీ సంస్థలోనూ స్కైలైన్ 25 శాతం ఈక్వీటీ హక్కు పొందుతున్నట్లు ఒప్పందాలు చేసుకుంటోంది. తద్వారా తన వ్యాపారాన్ని విస్తరించుకోంటోంది.

ఈ సందర్భంగా స్కైలైన్ వెంచర్స్ ఛైర్మన్ డి లక్ష్మీ నారాయణ మీడియాతో మాట్లాడుతూ తమ కార్యకలాపాలకు పెట్టుబడి బ్యాంకర్లను మరియు నిర్వహణ బృందాన్ని జోడిస్తూ విస్తరించేందకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. తాము ఎవరితో కలిసి పనిచేయాలనుకుంటున్నామో ఆ ఆశాజనకమైన స్టార్టప్ లను ఎంపిక చేశామని చెప్పారు. వాటిలోనే తాము ప్రారంభంలో బిజినెస్ ఎనేబుల్ లేదా డెవలపర్ గా స్టార్టప్ లతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పారు, ఈ కంపెనీలలో పెట్టుబడుల యొక్క అవకాశాలను తాము పరిశీలిస్తామని చెప్పారు. వాటిలో నిధులు సమకూర్చడానికి ముందు, వారి వ్యాపార నమూనాను కనీసం ఒక సంవత్సరం దగ్గరగా పర్యవేక్షిస్తున్నామని చెప్పారు,  

ఈ క్రమంలో అన్ లైన్ ఫార్మసీ సంస్థ మెట్రోమెడీతో పెట్టుబడులు పెడుతున్నామని దీంతో పాటు మొబైల్ అధారంగా స్వల్పకాలక రుణాలను అందిస్తున్న సంస్థల్లోనూ పెట్టుబడులు పెడుతున్నామన్నారు, డిజిటల్ ఫార్మాట్ల ద్వారా డిజిటల్ చెల్లింపులను చేస్తున్న జాగ్లే ప్రీపెయిడ్ ఓషన్ సర్వీసెస్ తో ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు, ఈ సంస్థతోనూ తాము ఒప్పందాలు చేసుకున్నారని అన్నారు, ఫిన్ టెక్, హెల్త్ టెక్, మెడ్ టెక్ విభాగాలు తాము విస్తరించుకుంటున్నామని లక్ష్మీ నారాయణ తెలిపారు. స్కైలైన్ వెంచర్స్ ఎండి మధు మోహన్ అవలూర్ మాట్లాడుతూ, ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలోనే అనేక టెక్ స్టార్టప్ లలో ఆదాయాన్ని సాధించామన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles