Pranab Mukherjee's in 'septic shock': Hospital క్షీణిస్తున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అరోగ్యం..

Decline in medical condition of pranab mukherjee army hospital

Pranab Mukherjee, Ventilator, health condition, former president, Army Research and Referral Hospital, brain surgery, COVID-19, coronavirus, corona positive, cororna Tpr rate, India coronavirus cases

There is a decline in the medical condition of Former President Pranab Mukherjee since yesterday. He is in septic shock due to his lung infection & is being managed by a team of specialists. He continues to be in deep coma & on ventilator support: Army Hospital (R&R), Delhi Cantt.

క్షీణిస్తున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అరోగ్యం..

Posted: 08/31/2020 03:51 PM IST
Decline in medical condition of pranab mukherjee army hospital

(Image source from: Tribuneindia.com)

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి మళ్లీ విషమించింది, గత ఇరవై రోజలుగా ఆయన ఢిల్లీ కంటోన్మెంట్ ఏరియాలోని ఆర్మీ రిసర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రిలోనే చికిత్స పోందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించిందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి, శస్త్రచికిత్స జరిగిన నాటి నుంచి ఆయన వెంటిలేటర్ పైనే వున్నా.. ఆయన ఆరోగ్యం నిలకడగానే వుండగా, తాజాగా ఆయన ఆరోగ్యం మరింతగా దిగజారిందని ఆసుపత్రి వర్గాలు తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కోన్నాయి,

ఆదివారం (ఆగస్టు 30) నుంచి మీ ఆరోగ్యం ప్రణబ్ ముఖర్జీ అరోగ్యం మరింతగా క్షీణించిందని ఆయన కోమాలోంచి ‘సెప్టిక్ షాక్’ స్థితిలోకి జారుకున్నట్లు అసుపత్రి వర్గాలు తెలిపాయి, తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో  ‘‘ ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి నిన్నటి నుంచి క్షీణిస్తోంది’’ అని ఆయనకు చికిత్స చేస్తున్న ఢిల్లీలోని ఆర్మీ అండ్ రిఫరెల్ ఆస్పత్రి అధికారులు ప్రకటించారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ సమస్యకు ప్రత్యేక వైద్య బృందాలు చికిత్స అందిస్తున్నాయి. కాగా, ఆయన కోమాలోనే ఉన్నారని.. వెంటిలేటర్‌ సహాయంతో చికిత్స కొనసాగిస్తున్నామని వైద్యాధికారులు తెలిపారు.

ప్రణబ్ ముఖర్జీ ఈ నెల 10వ తేదీని బ్రెయిన్ లో రక్తం గడ్డకట్టడంతో దానికి శస్త్ర చికిత్స చేయించుకునే విషయమై ఆర్మీ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే సర్జరీ చేసే క్రమంలో ఆయనకు నిర్వహించిన పలు విధాల పరీక్షలలో ఆయనకు కరోనా సోకిందని కూడా నిర్థారణ అయ్యింది. అయినా వైద్యులు మాత్రం ఆయన శస్త్రచికిత్స చేశారు. దీంతో సర్జరీ తరువాత ఆయన ఆరోగ్యం విషమంగా మారిడంతో ఆయన కోమాలోకి జారుకున్నారు. అయితే అప్పటి నుంచి ఆయన పరిస్థితి విషమంగానే ఉంది. సర్జరీ నుంచి వెంటిలేటర్ ను సాయంతోనే ఆయన శ్వాస తీసుకుంటున్నారని అసుపత్రి వర్గాలు తెలిపాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles