Pulivendula SI gopinath reddy fight against liquor mafia 'వీడేరా పోలీస్..' సీఎం జగన్ ఇలాకలో ఎస్ఐ సాహసం

Pulivendula si gopinath reddy fight against liquor mafia

cuddapah, pulivendula SI, SI Gopinath Reddy, illicit liquor, sub inspector, pulivendula, kadapa, CM Jagan, Andhra pradesh, viral video, video viral

Pulivendula SI Gopinath Reddy terrible fight with liquor mafia in Andhra Pradesh Chief Ministers own constituency Pulivendula. The Real Singam has done a cine feat in reality to catch hold the illicit liquor.

ITEMVIDEOS: ‘‘వీడేరా పోలీస్..’’ సీఎం జగన్ ఇలాకలో ఎస్ఐ సాహసం

Posted: 08/29/2020 05:54 PM IST
Pulivendula si gopinath reddy fight against liquor mafia

ముఖ్యమంత్రి సోంత గ్రామం పులివెందులలో మరో సింగం వెలుగులోకి వచ్చింది. అదేంటి అంటారా.. ఈ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఒక సింగంలా అక్కడి వారు అభివర్ణించడం సాధారణమే. అయితే మరో సింగం ఎవరంటే కడప జిల్లా పులివెందులలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న గోపినాథ్ రెడ్డి. ఔనా.. అని అంటారా.? ఆయన సినీఫక్కీలో చేసిన ఫీటు పోలీసు అధికారులకు కూడా విస్మయానికి గురిచేసింది. భారత సరిహద్దులో ఆర్మీ జవాన్లు చేసే విన్యాసాలను తన పోలిస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతలను కాపాడేందుకు.. అక్రమ మద్యం మాపియాను అరికట్టేందుకు కావడం గమనార్హం.

మరోలా చేప్పాలంటే గోపినాథ్ రెడ్డి చేసిన సాహసంతో అక్రమ మద్యం రవాణా చేసే మాఫియా గుండెల్లో వణుకుపుట్టేలా చేసింది. అయితే అందుకు ఎస్సై గోపీనాథరెడ్డి ప్రాణాలకు తెగించి సాహసం చేశారు. పట్టణంలోని రాఘవేంద్ర థియేటర్‌ సమీపంలో రోడ్డు పక్కన నిలబెట్టిన వాహనంలో అక్రమ మద్యం ఉన్నట్లు అందిన సమాచారం మేరకు అక్కడికి ఎస్సై గోపీనాథరెడ్డి తన సిబ్బందితో చేరుకున్నారు. పోలీసులు వాహనాన్ని చుట్టుముట్టడంతో నిందితులు కారును వెనక్కు, ముందుకు కదుపుతూ పోలీసులను భయాందోళనలకు గురిచేశారు.

కారును అడ్డుకోవడంలో భాగంగా వాహనం ముందు భాగాన్ని ఎస్సై పట్టుకున్నారు. అయినప్పటికీ నిందితులు కారును అతి వేగంగా నడుపుతూ సుమారు రెండు కి.మీ.దూరం వెళ్లారు. అయినప్పటికీ ఎస్సై కారును గట్టిగా పట్టుకుంటూనే చాకచక్యంగా కారు ముందు అద్దాలను పగులగొట్టారు. ఇంతలో పోలీసులు చేరుకుని వాహనాన్ని అడ్డుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని 80 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన సమాచారం తెలిసిన పోలీసు శాఖ ఉన్నతాధికారులు గోపినాథ్ రెడ్డిని అభినందించారు.

(Video Source: V6 News Telugu)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles