Bail granted for ESI scam accused Atchannaidu 'వచ్చిందయ్యో స్వామి..' అచ్చన్నకు కండీషనల్ బెయిల్

Andhra high court grants bail to tdp mla atchannaidu in esi scam case

Atchannaidu, TDP Senior leader atchanna, former minister atchanna, ESI Scam, Andhra Pradesh High Court, Srikakulam, andhra pradesh, Politics, crime

Former minister and TDP MLA Atchannaidu, who was arrested in the ESI scam, has been granted bail. The court, however, ordered that he should not leave the country without permission. He will be released on bail in two days. Achennaidu recently had tested positive for coronavirus positive. He is currently undergoing treatment at an NRI hospital.

‘‘వచ్చిందయ్యో స్వామి..’’ అచ్చన్నకు కండీషనల్ బెయిల్

Posted: 08/28/2020 02:49 PM IST
Andhra high court grants bail to tdp mla atchannaidu in esi scam case

(Image source from: Mirchi9.com)

ఈఎస్‌ఐ కుంభకోణంలో అరెస్టయిన మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత, టెక్కలి ఎమ్మెల్యే అచ్చన్నాయుడుకు ఎట్టకేలకు ఆంధ్రప్రధేశ్ హైకోర్టులో ఊరట లభించింది. ఈఎస్ఐ మందుల కుంభకోణంలో అభియోగాలను ఎదుర్కోని జూన్ 12న అరెస్టయిన ఆయన అప్పటి నుంచి బెయిల్ కోసం పలుమార్లు హైకోర్టును ఆశ్రయించినా.. లభించిన ఊరట తాజాగా లభించింది. ఆయనకు కండీషనల్ బెయిల్ ను న్యాయస్థానం మంజూరు చేసింది, ఈఎస్ఐ స్కామ్ కేసులో జ్యూడిషియల్ రిమాండ్ లో ఉన్న ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. కొన్ని నెలలుగా రిమాండ్ లో ఉన్న అచన్నాయుడ్ని బెయిల్ పై విడుదల చేయడం టిడిపి వర్గాలలో ఆనందం వ్యక్తమవుతోంది.

కోర్టు అనుమతి లేకుండా దేశాన్ని విడిచి వెళ్లకూడదని అచ్చెన్నకు హైకోర్టు షరతు విధించింది. గత 70 రోజులుగా రిమాండ్ లో ఉంటున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆయనకు బెయిల్ మంజూరు చేయాలన్న ఆయన తరపు న్యాయవాదులు దాఖలు చేసిన పిటీషన్ ను విచారించిన న్యాయస్థానం ఆయనకు విదేశాలకు వెళ్లరాదన్న షరతుతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. ప్రస్తుతం ఆయన ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, రెండు రోజుల్లో ఆయన బెయిల్‌పై విడుదల కానున్నారు. అచెన్నాయుడు ఇటీవల కరోనాబారిన పడ్డారు. ఆయనకు ఆరోగ్య పరీక్షలు చేసిన వైద్యులు ఆయనకు కరోనా వైరస్ సోకిందన్న విషయాన్ని పరీక్షల తరువాత నిర్థారించారు, ప్రస్తుతం ఆయన ఎన్నారై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా కోనసాగిన సమయంలో కార్మిక శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఈఎస్‌ఐ ఔషధ సేకరణలో రూ .150 కోట్ల అవినీతి ఆరోపణలు చేసిన విజిలెన్స్ నివేదిక నేపథ్యంలో జూన్ 12 న శ్రీకాకుళం జిల్లాలోని అచెన్నాయుడును తన సొంత ఇంటిలో ఎసిబి అధికారులు అరెస్టు చేశారు. అనంతరం గుంటూరులోని ఏసీబి కోర్టులో హాజరపర్చారు. అయితే, అప్పటికే శస్త్రచికిత్సతో బాధపడుతున్నందున అచన్నాయుడ్ని ఆసుపత్రిలో చేర్పించడానికి కోర్టు అనుమతించింది. తరువాత ఆసుపత్రిలో ఏసీబి అధికారులు అతనిని ప్రశ్నించారు. కొన్ని వారాల తరువాత అతనికి కరోనావైరస్ పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో ఆయనను గుంటూరులోని ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Atchannaidu  ESI Scam  Andhra Pradesh High Court  Srikakulam  andhra pradesh  Politics  crime  

Other Articles