Pranab Mukherjee under intensive care: Hospital నిలకడగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అరోగ్యం..

Pranab mukherjee under intensive care being treated for lung infection hospital

Pranab Mukherjee, Ventilator, health condition, former president, Army Research and Referral Hospital, brain surgery, COVID-19, coronavirus, corona positive, cororna Tpr rate, India coronavirus cases

Former President Pranab Mukherjee is under intensive care and being treated for a lung infection, Army Research and Referral Hospital said today. He was admitted to the Army's Research and Referral Hospital in Delhi Cantonment on August 10, where he was operated for removal of a clot in the brain.

వెంటిలేటర్ పై.. నిలకడగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అరోగ్యం..

Posted: 08/28/2020 01:41 PM IST
Pranab mukherjee under intensive care being treated for lung infection hospital

(Image source from: Oneindia.com)

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్యం విషమంగానే వుందని ఆర్మీ రిసర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి, ఆయన ఇంకా తీవ్రమైన కోమాలోకి జారుకున్నారని ఆయనకు వెంటిలేటర్ పైనే చికిత్సను అందిస్తున్నామని ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలోని ఆర్మీ ఆసుపత్రి తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో వెల్లడించింది. 84 ఏళ్ల అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు, మాజీ భారత రాష్ట్రపతికి ఊపిరి తిత్తులలో ఇన్ ఫెక్షన్ సోకడంతో దానితో పాటు మరియు మూత్రపిండాలు పనిచేయడం కోసం ప్రస్తుతం చికిత్సను అందిస్తున్నామని, ప్రస్తుతం ఆయన అతను హేమోడైనమిక్ గా నిలకడగానే వున్నారని ఆసుపత్రి వర్గాలు బులిటెన్ లో పేర్కోన్నాయి.

ప్రణబ్ ముఖర్జీ ఈ నెల 10వ తేదీన మెదడు (బ్రెయిన్)లో రక్తం గడ్డకట్టడంతో ఢిల్లీలోని ఆర్మీ రిసర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే సర్జరీ చేయడంతో ఆయన ఆ తరువాత కోమాలోకి జారుకున్నారు. అయితే అప్పటి నుంచి ఆయన పరిస్థితి విషమంగానే ఉంది. సర్జరీ తరువాత నుంచి వెంటిలేటర్ సాయంతోనే శ్వాస తీసుకుంటున్నారు. దీనికి తోడు ఆయనకు కరోనా పాజిటివ్ గా కూడా నిర్ధారణ అయ్యింది. దీంతో సర్జరీ తరువాత నుంచి ఆయన పరిస్థితి విషమంగా మారింది. కోమాలోకి జారుకోవడంతో పరిస్థితి క్రమక్రమంగా దిగజారుతున్నట్లు అసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

ఆయన శరీరంలోని కీలకమైన అవయవాలన్నీ నిలకడగానే వున్నాయిన అంటూనే దీర్ఘమైన కోమాలోకి జారుకున్నారని అసుపత్రి వర్గాలు వెల్లడించాయి, ఏ క్షణంలో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని అందోళన చెందిన ఆయన అభిమానులకు తాజా హెల్త్ బులిటెన్ కాస్త ఊరటనిస్తోంది. పరిస్థితి నిలకడగా వుందని అందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా సేవలు అందించి.. ట్రబుల్ షూటర్ గా కూడా పేరోందిన ఆయనను పార్టీ 13వ రాష్ట్రపతిగా బరిలోకి దింపింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజకీయాలలో ఆయన అనేక మార్పులను తీసుకువచ్చారు. దేశ రాజకీయాలపై కూడా ప్రణబ్ ముఖర్జీ తనదైన ముద్రవేశారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రిగా కూడా ఆయన అనేక మార్పులను తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles