Heavy rains alert for Telangana districts అలర్ట్: పలు జిల్లాల్లో ఇవాళ అతి భారీ వర్షాలు : ఐఎండి

Imd forecasts very heavy rains in parts of telangana

weather, weather today, weather in hyderabad, telangana weather, andhra pradesh weather, weather in amaravati, weather report today, weather forecast, weather forecast today, Rain, low pressure, thunder storms, lightening, Bay of Bengal, Telangana, Andhra Pradesh, weather forecast, tamil nadu weather, karnataka weather

IMD has forecasted heavy to very heavy rains in different parts of Telangana for the next 24 hours. IMD said Sangareddy, Siddipet, RangaReddy, Vikarabad, Medak, Medchal Malkajgiri, Hyderabad, Yadadri BHongir, Nalgonda, Janagaon, Suryapet, Warangal districts, Mahabubabad, Bhadradri Kothagudem, and Khammam will receive heavy to very heavy rains in the next 48 hours.

అలర్ట్: పలు జిల్లాల్లో ఇవాళ అతి భారీ వర్షాలు : ఐఎండి

Posted: 08/28/2020 12:04 PM IST
Imd forecasts very heavy rains in parts of telangana

(Image source from: Indianexpress.com)

నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కురిసిన వర్షాలతో రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి, చిన్న వాగులు వంకలు కూడా ప్రవహిస్తూన్నాయి. కుంటలు, చెరువులు కూడా నిండుకుండలను తలపిస్తున్నాయి. ఇక వర్షాలతో తెలంగాణ తడిసి ముద్దవుతోంది. ఈ తరుణంలో భారతీయ వాతావరణ శాఖ మరోమారు అప్రమత్తం చేసింది. గత వారం రోజులకు ముందుగా నగరంలో పది నుంచి పన్నెండు రోజుల పాటు వరుసగా కురిసిన వర్షంతో హుస్సేన్ సాగర్ కూడా ప్రమాదస్థాయికి నీరు చేరడంతో అధికారులు గేట్లు తెరచి నీటిని కిందకు వదిలిన విషయం కూడా తెలిసిందే.

ఈ తరుణంలో రాష్ట్రంలో ఓ మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న సూచనలతో భారత వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. రానున్న 24 గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు వున్నాయిని సూచనలు చేసింది. అంతేకాదు ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు కూడా పడే అవకాశం వుందని.. ఈ క్రమంలో ప్రజలంతా అప్రమత్తంగా వుండాలని సూచించింది. ముఖ్యంగా సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట, మేడ్చల్‌ మల్కాజిగిరి, హైదరాబాద్‌, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని తెలిపింది.

ఇక ఈ జిల్లాలతో పాటు నల్లగొండ, జనగామ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్‌, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. ఒడిశా, దాని పరిసర ప్రాంతాలు, ఝార్ఖండ్ ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతుండడంతోపాటు, రాయలసీమ నుంచి దక్షిణ తమిళనాడు వరకు సముద్రమట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ద్రోణి ఏర్పడడమే ఇందుకు కారణమని వివరించారు. కాగా, నిన్న కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. వరంగల్ రూరల్, అర్బన్ జిల్లాల్లో అత్యధికంగా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rain  low pressure  thunder storms  lightening  Bay of Bengal  Telangana  Andhra Pradesh  weather forecast  

Other Articles