Coronavirus: India Record nearly 67,000 cases in a day దేశంలో ఒక్కరోజులో 1059 మరణాలు.. 67 వేల కేసులు..

Coronavirus in india covid cases above 32 lakh recovery case above 76

Coronavirus cases India, Coronavirus India update, Coronavirus india testing centres, coronavirus vaccine, coronavirus testing india labs, coronavirus deaths india, Coronavirus, Covid-19, Maharashtra, Tamil Nadu, Delhi, Health Ministry, corona fatility, corona cases India

India's novel coronavirus tally rose to 32.34 lakh on Wednesday with 67,151 more people testing positive for the infection, while the recoveries have surged to 24,67,758, the Health Ministry said. The death toll from the pathogen climbed to 59,449 with 1,059 more fatalities.

దేశంలో కరోనా మృత్యుఘంటికలు: 24 గంటల్లో 1059 మరణాలు.. 67 వేల కేసులు..

Posted: 08/26/2020 03:30 PM IST
Coronavirus in india covid cases above 32 lakh recovery case above 76

దేశంలో కరోనా మహమ్మారి మరణ మృదంగాన్ని మ్రోగిస్తోంది. గత కొన్ని రోజులుగా ప్రతీరోజు రోజుకు వెయ్యిమార్కుకు చేరువలో మరణాలు సంభవిస్తూ.. ఏకంగా దేశంలో మరణాలు కూడా ఏకంగా యాబై తొమ్మిది వేల మార్కును అధిగమించింది. దీంతో భారత్.. ప్రపంచంలో అత్యధిక మరణాలు సంభవించిన నాల్గవ దేశంగా అవతరించింది. గత వారం రోజులుగా కరోనా కేసులు వ్యాప్తి ఉదృతంగా కోనసాగుతోంది. దేశంలో లాక్ డౌన్ విధించిన నాటి నుంచి దేశంలో ముఫై రెండు లక్షల మార్కును అధిగమించాయి. కాగా, 59 వేల మరణాలు కూడా సంభవించాయి, గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో సుమారు 1059 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మరణాల సంఖ్య 59449కి చేరింది, ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ మరణాల్లో ఒక్క మహారాష్ట్రలోనే ఏకంగా 23 వేల మంది మృత్యువాత పడినట్టు గణంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ఇక మరోవైపు దేశంలో ఏ రోజుకారోజు కొత్త కేసుల నమోదు చేసుకుంటూ రికార్డుస్థాయిలో దూసుకెళ్లిన కరోనా కేసులు.. తాజాగా గత 24 గంటల వ్యవధిలో మరోమారు అధిక స్థాయిలో కేసులు నమోదు అయ్యాయి. ఏకంగా 67 వేలకు చేరువలో కేసులు నమోదు చేసుకుని కాసింత ఊరట కలిగిస్తోంది. ఇక దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి తన ఉద్దృతిని పెంచుతూ సమూహవ్యాప్తిలోకి చేరిందన్న సమాచారంతో దేశ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గత వారం రోజులుగా 60 వేల మార్కుకు పైబడిన కేసులు నమోదవుతున్నాయి, ఇక తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలోనూ 67 వేల మార్కును అందుకున్నాయి. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తూ.. లక్షలాధి మందిని తన ప్రభావానికి గురిచేస్తూ.. లక్షల మంది ప్రాణాలను హరించిన కరోనా మహమ్మారి దేశంలోనూ తన ఉదృతిని శరవేగంగా విస్తరించుకుంటోంది.  

దేశంలో క్రమంగా జడలువిప్పుతున్న కరోనా మహమ్మారి ఏకంగా ముఫై రెండు లక్షల మార్కును దాటింది. ఫలితంగా కరోనా ప్రభావనపడిన దేశాల్లో అమెరికా, బ్రెజిల్ తరువాత మూడవ స్థానంలో భారత్ నిలిచింది. కరోనా పాజిటివ్ కేసులు ఉద్దృతి పెరుగుతున్న ఈ క్రమంలో కొంచెం కఠిన నిబంధనలు పెట్టాల్సిన కేంద్రం అన్ లాక్ 2.0 మార్గదర్శకాలలో రాకపోకలకు వెసలుబాటు కల్పించడం కూడా తీవ్రతను పెంచేందుకు కారణం అవుతుందన్న వాదనలు వినబడుతున్నాయి. ఇక అన్ లాక్ 3.0 కూడా అమల్లోకి రావడం,, బార్లు సహా పలు స్వల్ప సంఖ్యలోని జనసమూహాలకు అనుమతులు కూడా లభ్యం కావడంతో.. కేంద్రం కూడా పలు ఆంక్షలను తొలగించి మరికోన్ని సడలింపులు కూడా అమల్లోకి రావడంతో మరిన్ని కేసులు పెరుగుతాయా.? అన్న అందోళన కూడా రేకెత్తుతోంది. ఆరు మాసాలు పైగా గడుస్తున్నా ఈ మహమ్మారి కట్టడికి ఇప్పటికీ వాక్సీన్ రాకపోవడం కూడా దేశ ప్రజల్లో అందోళనకు కారణమవుతోంది.

గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా ఏకంగా నాలుగున్నర లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత భయాందోళనకరంగా మారిందో అర్థంచేసుకోవచ్చు. ఇక దీనికి తోడు మరణాలు కూడా మృదంగాన్ని మ్రోగిస్తున్నాయి. గత కొంత కాలంగా ప్రతీ రోజు ఎనమిది వందలకు పైబడిన సంఖ్యలో నమోదైన మరణాలు.. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో ఏకంగా 1059 మార్కును అందుకున్నాయి, ఇక తాజాగా మరణాల్లోనూ భారత్ ఏకంగా ప్రపంచంలో నాల్గవ స్థానంలో నమోదు కావడం గమనార్హం. ఇక 50 వేలకు పైబడిన మరణాలతో నాల్గవ స్థానంలో వున్న బ్రిటెన్ ను కూడా భారత్ అధిగమించి నాల్గవ స్థానంలో కోనసాగుతోంది. అంతకంతకూ పెరుగుతున్న మరణాలు దేశ ప్రజలను కలవరానికి గురిచేస్తున్నాయి, దేశంలో జులై 1 అన్ లాక్ 2.0 నుంచి అమల్లోకి రావడంతో రాకపోకలకు అనుమతులు లేకుండా చేసింది.

దీంతో పరిమిత సంఖ్యలోనే తిరిగిన వాహనాలు ఇకపై పూర్తిస్థాయిలో రోడ్డును ఎక్కనున్నాయి. మాల్స్, బార్లు, ధియేటర్లు, స్టేడియాల్లో ఆటలు ఇలా భారీ సంఖ్యలో జనసమూహం వున్న ప్రాంతాల్లో కార్యకలాపాలు మినహాయించి మిగిలిన అన్ని వ్యవహారాలకు అన్ లాక్ 1.0 తలుపులు తెరిచింది. దీంతో కరోనా కేసులు వ్యాప్తి కూడా గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్తగా 67,151 పాజిటివ్ కేసుల నమోదుతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ 32,34,474‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధిక కేసులు ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడులలోనే నమోదయ్యాయి, వీటితో పాటు దేశంలో నిన్న ఏకంగా 1059 మరణాలు నమోదయ్యాయి, దీంతో దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య యాభై తొమ్మిది వేల మార్కును అందుకున్నాయి. తాజాగా నమోదైన మరణాల సంఖ్యతో ఏకంగా 59,449కు చేరింది.

దేశంలో నమోదవుతున్న కరోనా కేసులు, మరణాల్లో మహారాష్ట్రలోనే అత్యదికంగా నమోదు కావడం గమనార్హం. మహారాష్ట్రలో అందులోనూ దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మరణాల సంఖ్య అధికంగా నమోదైంది, గడిచిన 24 గంటల వ్యవధిలో మహారాష్ట్ర ఆ తరువాత ఢిల్లీ, తమిళనాడు, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి బారిన పడిన వారిలో గత 24 గంటల వ్యవధిలో 66 వేల మంది కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని దీంతో మొత్తంగా ఇప్పటి వరకు 24 లక్షల మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక 7 లక్షల యాక్టివ్ కేసులు వున్నాయని వారంతా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పోందుతున్నారు. అయితే కరోనా చికిత్స పోందుతున్న వారి కన్నా.. మహమ్మారి బారినపడి కోలుకుంటున్న వారి సంఖ్య పెరగడం కాస్త ఊరటనిస్తోంది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు స్వల్పంగా తగ్గి 76 శాతంగా నమోదైంది.

దేశంలో నమోదైన మొత్తంలో 32.34 లక్షల కరోనా కేసులలో సింహభాగానికి చెందిన కోవిడ్ కేసులు కేవలం పది రాష్ట్రాల నుంచే నమోదవుతున్నాయని ప్రధాని మోడీ కూడా ఇటీవల తెలిపారు. ఈ పది రాష్ట్రాల్లో కరోనా తగ్గుముఖం పడితే దేశంలో కరోనాను రమారమి మహమ్మారిని కట్టడి చేసినట్లేనని అయన అన్నారు. మరీ ముఖ్యంగా మహరాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, ఏపీ రాష్ట్రాలలో కోవిడ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి, ఇక దేశంలోని మరణాలలోనూ ఈ రాష్ట్రాల నుంచే అధికం. మహారాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండం చేస్తుండంతో అక్కడి సామాన్య ప్రజల జీవినం స్థంభించింది. మహారాష్ట్రలోని దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనూ కరోనా మహమ్మారి తన పంజాను విసురుతూ వేలాది మందిపై ప్రభావాన్ని చూపుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Coronavirus  Covid-19  Maharashtra  Tamil Nadu  Delhi  Health Ministry  corona fatility  corona cases India  

Other Articles