Fuel Rate Today: Petrol price rise for 6th consecutive day తెలుగు రాష్ట్రాల్లో రూ. 85కు చేరువలో లీటరు పెట్రోల్ ధర

Fuel price today petrol prices rise for sixth consecutive day crude also up

Petrol Diesel prices, petrol diesel price hike, petrol prices in delhi, diesel prices in delhi, effect of covid 19 on petrol prices, effect of covid 19 on diesel prices, petrol price, petrol rate, petrol rate today India, diesel rate, diesel price, diesel rate today, diesel rate today in India, today petrol rate, today diesel rate, Petrol rate in Hyderabad, diesel rate in Telangana, diesel rate in Andhra Pradesh, diesel rate in Hyderabad, diesel rate in Guntur, diesel rate in Chennai, diesel rate in Vijayawada, diesel rate in Amaravati, diesel rate in Visakhapatnam, diesel rate in Delhi, diesel rate in Chennai, diesel rate in India, Petrol rate in Telangana, petrol rate in Andhra Pradesh, petrol rate in Delhi, petrol rate in Mumbai, Petrol rate in Hyderabad, Petrol rate in Visakhapatnam, fuel rates today in India, fuel rates, fuel price in India

Petrol prices were hiked for the sixth day straight across the metros by 11 paisa each, on Tuesday, i.e. August 25.Since August 16, OMCs have raised petrol prices across metros, barring August 19. Petrol prices have increased by ₹1.3 in Delhi, and ₹1.2 in Mumbai, in last 10 days.

వరుసగా అరవ రోజు పెరిగిన పెట్రోల్ ధర.. తెలుగు రాష్ట్రాల్లో రూ. 85కు పరుగులు

Posted: 08/25/2020 09:15 PM IST
Fuel price today petrol prices rise for sixth consecutive day crude also up

ఇంధన ధరలు వరుసగా పెరుగుతున్నాయి. అన్ లాక్ వన్ ప్రారంభంతో రెక్కలు వచ్చిన ధరలకు విపక్షాల అందోళన నేపథ్యంలో కాసింత నెమ్మదించాయి, అయితే ప్రస్తుతం మరోమారు ఇంధన ధరలు పెరిగాయి. వరుసగా ఆరో రోజూ పెట్రోల్‌ ధరను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. లీటరు పెట్రోల్‌పై 11 పైసలు పెంచాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ రూ.81.73 కి చేరింది. గత ఆరు రోజుల్లో చమురు సంస్థలు లీటరు పెట్రోలుపై 1.10 పైసలు పెంచాయి. దీంతో పలు నగరాల్లో పెట్రోల్ ధర ఏకంగా రూ.89ను అందుకునేందుకు పరుగులు తీస్తోంది.

మరోవైపు గత రెండు వారాలుగా డీజిల్‌ ధరలు స్థిరంగా కొనసాగుతుండటం విశేషం. ఢిల్లీలో లీటరు డీజిల్‌ ధర రూ.73.62గా ఉంది. పలు నగరాల్లో డీజిల్ ధర ఏకంగా రూ.82 దాటింది. అంతర్జాతీయంగా పెట్రోల్‌ ధరలు పెరుగుతుండటం.. బ్యారెల్‌ ముడి చమురు ధర 45.13 డాలర్లు దాటడం వల్ల దేశీయ చమురు సంస్థలు ధరల్లో సవరణలు చేసినట్లు తెలుస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా మెట్రో నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు ఎలా వున్నాయంటే...

ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 81.73గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 73.56కు చేరింది.

ముంబైలో లీటరు పెట్రోల్ ధర 88.39గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 80.11కు చేరింది.

చెన్నైలో లీటరు పెట్రోల్ ధర 84.73గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 78.86కు చేరింది.

కొల్ కతాలో లీటరు పెట్రోల్ ధర 83.24గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 77.06కు చేరింది.

అమరావతి గుంటూరులో పెట్రోల్ ధర రూ, 86.60 కాగా, లీటరు డీజిల్ ధర రూ. 81.40కు చేరింది.

విశాఖపట్నంలో లీటరు పెట్రోల్ ధర 85.15గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 80.10కు చేరింది.

హైదారాబాద్ లో లీటరు పెట్రోల్ ధర 84.94గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 80.17కు చేరింది.

దేశంలోని ఔరంగాబాద్, భూపాల్, నాగ్ పూర్, నాసిక్, కోల్హాపూర్, ఇండోర్, జైపూర్ నగరాల్లో లీటరు పెట్రోల్ ధర ఏకంగా రూ.90 మార్కుకు చేరువలో వుంది. అదే విధంగా ఔరంగాబాద్, భూపాల్, భువనేశ్వర్, గువహటి, హైదారబాద్, ఇండోర్, ముంబై, నాగ్ పూర్, థానే, విశాఖపట్నం నగరాల్లో డీజిల్ ధర లీటరుకు ఎనబై రూపాయలు దాటగా, జైపూర్ లో మాత్రం ఏకంగా రూ.82 దాటింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Petrol  Diesel  fuel price  petrol price  diesel price  hyderabad  visakhapatnam  coronavirus  covid-19  

Other Articles