180 Million PAN Cards May Become Inoperative by March 31 ఆ లింక్ లేని 18 కోట్ల పాన్ కార్డులు.. నిర్వీర్యం కానున్నాయా..?

180 million pan cards not linked to aadhaar numbers may become defunct by march report

Income Tax evaders, Aadhaar, PAN card, Income Tax, PAN card linked to Aadhaar, Aadhaar, PANs, permanent account numbers, income tax, artificial intelligence

About 180 million permanent account numbers could become obsolete if not linked with Aadhaar by March 31, quoting sources from the Income Tax department. The IT department is taking this step to nab tax evaders who use multiple PANs to conduct high-value transactions.

ఆ లింక్ లేని 18 కోట్ల పాన్ కార్డులు.. నిర్వీర్యం కానున్నాయా..?

Posted: 08/22/2020 12:47 AM IST
180 million pan cards not linked to aadhaar numbers may become defunct by march report

మీకు పాన్ కార్డు వుందా..? అయితే మీ పాన్ కార్డు మార్చి 31 2021 నుంచి పనిచేయదు. ఔనా అని కంగారుపడుతున్నారా.? నిజమేనండీ.. మీ పాన్‌ కార్డుకు ఆ కార్డుతో లింక్ చేయకపోతే ఇక మీ వద్దనున్న పాన్ పనిచేయదు. ఏ కార్డుతో లింక్ చేయాలి అని అంటారా.? అదేనండీ ఆధార్‌ కార్డు. మీ ఆధార్ కార్డుతో పాన్ కార్డును లింక్ చేయని పక్షంలో అది మార్చి 31, 2021 నుంచి పనిచేయదని ఆదాయ పన్నుశాఖ తేల్చిచెబుతోంది. ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు చెప్పామని, అయినా చాలా మంది పెడచెవిన పెడుతున్నారని, అందుచేత ఏకంగా దేశంలోని 18 కోట్ల పాన్ కార్డులను రానున్న మార్చి 31 నుంచి పనిచేయబోకుండా చర్యలు తీసుకుంటున్నారు అధికారుటు,

ఇప్పటివరకు ఆధార్ తో లింక్‌ చేయని సుమారు 18 కోట్ల పాన్ కార్డులు ఉన్నాయని... గడువు ముగిసేలోగా లింక్ చేయకపోతే నిర్వీర్యం చేస్తామని ఆ శాఖ తెలిపింది. ఒకటి కన్నా ఎక్కువ పాన్‌ కార్డులను ఉపయోగించే వారిని, పన్ను ఎగవేతదారులను, అధిక మొత్తాల్లో లావాదేవీలు జరిపేవారిని గుర్తించే పనిలో ఉన్నట్టు ఐటీ అధికారులు తెలిపారు. కొందరు విలాసవంతంగా ఖర్చులు చేస్తూ... పన్నులను ఎగవేసేందుకు ఒకటి కన్న ఎక్కువ పాన్‌ కార్డులను ఉపయోగిస్తున్నారని వెల్లడించారు. పాన్‌ కార్డును ఆధార్‌తో లింక్‌ చేస్తే, ఒకటి కంటే ఎక్కువ పాన్‌ కార్డులు పొందే అవకాశం ఉండదని.. అందుకే లింక్‌ చేసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారని వివరించారు.

బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, మ్యూచివల్‌ ఫండ్‌, క్రెడిట్‌-డెబిట్‌ కార్డులు వంటి వ్యవస్థల ద్వారా జరిగే భారీ లావాదేవీలను గుర్తించి... ఆ వ్యయాల తీరుపై కూడా ఐటీ శాఖ నిఘా పెట్టనుంది.  సుమారు 130 కోట్ల జనాభాలో కేవలం కోటిన్నర మంది మాత్రమే ఆదాయపన్ను చెల్లిస్తున్నారని ప్రధాని ఇటీవల ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపు దారుల సౌలభ్యం కోసం..  ‘‘పారదర్శక పన్ను విధానం.. నిజాయితీపరులకు గౌరవం అని ఆదాయ పన్నుశాఖ పోర్టల్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా పన్ను చెల్లింపు కోసం ప్రజలు కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఈ చర్యను దోహదపడనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aadhaar  PANs  permanent account numbers  income tax  artificial intelligence  

Other Articles