CEC issues New Election Guidelines ఎన్నికలకు సీఈసీ కొత్త కోవిడ్ మార్గదర్శకాలు

Social distancing gloves for voters among new election guidelines

Coronavirus, election commission, covid election guidelines, bihar assembly elections, New Election Guidelines, no mask no vote, EVMs, gloves, mask, social distancing

Door-to-door campaigns with only five people and gloves for voters before they press the button at electronic voting machines are some of the guidelines for holding elections amid the coronavirus pandemic.

‘ఐదుగురితోనే ప్రచారం.. చేతులకు గ్లౌజులు’: సీఈసీ కొత్త మార్గదర్శకాలు

Posted: 08/21/2020 08:43 PM IST
Social distancing gloves for voters among new election guidelines

కరోనా వైరస్ ప్రపంచ స్థితిగతులను మార్చేసింది. ప్రపంచ వేగానికి కళ్లాలను వేసి గమనాన్ని మందగించేలా చేసింది. మహమ్మారి విసరుతున్న సవాళ్లను అధిగమించి ప్రపంచం తన పయనాన్ని మళ్లీ ప్రారంభించింది. ఇటు మన దేశంలో సైతం ఎన్నో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. భద్రతా ప్రమాణాలు పాటిస్తూ ముందుకు సాగాలని.. అంతేకానీ విపత్తు నేపథ్యంలో జీవిత పయనం ఎలా నిలుపుతామని ఇటీవల దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో ఇప్పటికే అన్నింటికీ వేసిన తాళాలు తెరుచుకుంటున్నాయి, ఈ క్రమంలో ఇక అన్ లాక్ 3.0 నుంచి సినిమా హాల్ సహా అన్ని తెరుచుకోబోతున్నాయి.

ఈ క్రమంలో కోవిడ్-19 నిబంధనలను తప్పక అమలుపర్చాలని కూడా అదేశాలు జారీ చేసింది. ఇక ఈ తరహాలోనే కేంద్ర ఎన్నికల సంఘం కూడా తాజాగా కొత్త ఎన్నికల మార్గదర్శకాలను విడుదల చేసింది. చివరకు ఎన్నికల నిబంధనలు కూడా మారిపోతున్నాయి. వాటిలో భాగంగా ప్రచార కార్యక్రమాలు మొదలుకుని ఓటింగ్ కేంద్రాల్లో ఓటు వేసే వరకు అనేక మార్గదర్శకాలను విడుదల చేసింది, ఇన్నాళ్లు హంగూ అర్భాటాల మధ్య వుండే ప్రచార కార్యక్రమాలు ఇక తక్కువ సంఖ్యకు పరిమితం కానున్నాయి, ఇంటింటి ప్రచారానికి ఐదుగురికి మించి వెళ్లకూడదని ఎన్నికల కమీషన్ తెలిపింది. ఓటు వేసే సమయంలో ఓటర్లు సామాజిక దూరాన్ని పాటించాలని చెప్పింది.

ఓటర్లందరికీ గ్లవ్స్ ఇవ్వాలని... ప్రతి ఓటరు గ్లవ్స్ ధరించి ఈవీఎం బటన్ ను నొక్కాలని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం విధించిన కోవిడ్ నిబంధనలను తు.చ తప్పకుండా పాటించాలని పేర్కొంది. పబ్లిక్ మీటింగులు, రోడ్ షోలను నిర్వహించుకోవచ్చని... అయితే, కేంద్ర హోంశాఖ విధించిన కోవిడ్ నిబంధనలను తు.చ తప్పకుండా పాటించాలని ఆదేశించింది. అభ్యర్థులందరూ నామినేషన్లను ఆన్ లైన్లో దాఖలు చేయాలని ఈసీ తెలిపింది. సెక్యూరిటీ డిపాజిట్ ను కూడా ఆన్ లైన్లోనే చెల్లించాలని ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియలో మాస్కులు, శానిటైజర్లు ఉండాలని చెప్పింది. థర్మల్ స్కానర్లు, పీపీఈ కిట్లు కూడా అందుబాటులో ఉండాలని తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles